సాక్షి, హైదరాబాద్: కింగ్‌ఫిషర్ మాజీ అధిపతి విజయ్ మాల్యాపై చెక్ బౌన్స్ కేసులో తీర్పును హైదరాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానం వాయిదా వేసింది. జీఎంఆర్ విమానాశ్రయాన్ని వాడుకున్నందుకు కింగ్‌ఫిషర్ సంస్థ గతంలో రూ.25 కోట్లకుగాను 17 చెక్కులు జారీ చేసింది. వీటిలో రూ.50 లక్షల చెక్కులు రెండు బౌన్సయ్యాయి. దీనిపై జీఎంఆర్ సంస్థ కేసు దాఖలు చేసింది. విచారణ అనంతరం మాల్యా నేరాన్ని కోర్టు ఇప్పటికే నిర్థారించింది.
శిక్ష ఖరారు చేయటానికి మాల్యా వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ వారెంట్లు జారీ చేసింది. ‘‘మాల్యా విదేశాల్లో ఉన్నారు. వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. రాజ్యసభ సభ్యత్వం కూడా రద్దయింది. ఆయన వ్యక్తిగతంగా హాజరు కాకపోయినా శిక్ష ఖరారు చేయండి’’ అని జీఎంఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. తీర్పును ఈ నెల 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఎర్రమంజిల్‌లోని 3వ ప్రత్యేక మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కృష్ణారావు పేర్కొన్నారు.
మాల్యా కేసులో తీర్పు 9కి వాయిదా!
Published Fri, May 6 2016 2:18 AM | Last Updated on Sat, Apr 6 2019 9:07 PM
Advertisement
Advertisement