ప్రముఖ బాలీవుడ్ నటి అమీషా పటేల్ చెక్ బౌన్స్ కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ కేసుపై రాంచీ కోర్టులో పలుమార్లు విచారణ కూడా జరిగింది. కానీ ఆమె కోర్టుకు హాజరు కాకపోవడంతో ఇదే ఏడాది ఏప్రిల్ 6న అమీషా పటేల్‌కు న్యాయస్థానం వారెంట్ ఇష్యూ చేసింది. దీంతో ఆమె రాంచీలోని సివిల్ కోర్టులో లొంగిపోయింది. ఈ మేరకు అప్పట్లో విచారణ జరిపిన కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కానీ ఇదే కేసుకు సంబంధించి ఆమె తరపున కేసు వాధించే లాయర్ రాకపోవడంతో అమీషా పటేల్‌కు రాంచీ కోర్టు 500 రూపాయల జరిమానా విధించింది.
అమీషా పటేల్‌పై చెక్ బౌన్స్‌కు కారణం ఇదే
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత అజయ్ కుమార్ ఓ సినిమా విషయంలో అమీషా పటేల్‌పై చెక్ బౌన్స్ కేసు వేశారు. సినిమా నిర్మిస్తానంటూ తన దగ్గర నుంచి రూ. 2.5కోట్లు అమీషా పటేల్ తీసుకున్నారని. ఆ తర్వాత సినిమా పూర్తిచేయకపోగా తన డబ్బులు తిరిగి ఇవ్వలేదని పేర్కొంటు రాంచీలోని సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు.
(ఇదీ చదవండి: అతనితో డేటింగ్‌లో భారత మహిళా క్రికెటర్.. ఫోటోలు వైరల్)
పిటిషనర్ అజయ్ కుమార్ సింగ్ తరపున సాక్షిగా కంపెనీ మేనేజర్ టింకు సింగ్ తాజాగా విచారణ కోసం కోర్టుకు హాజరయ్యారు. కానీ అమిషా పటేల్ తరపు న్యాయవాది అతన్ని క్రాస్ ఎగ్జామినేట్ చేయలేదు. బదులుగా, ఆమె న్యాయవాది దాని కోసం మరింత సమయం కోరారు. అప్పుడు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ డిఎన్ శుక్లా కొంతమేరకు అసహనం వ్యక్తం చేశారు. దీంతో అమిషా పటేల్‌కు కోర్టు రూ. 500 జరిమానా విధించింది. తదుపరి విచారణను ఆగష్టు 7కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment