కిరోసిన్ తాగి బాలుడి మృతి | boy killed of Drinking kerosene | Sakshi
Sakshi News home page

కిరోసిన్ తాగి బాలుడి మృతి

Published Thu, May 21 2015 1:33 AM | Last Updated on Fri, Jul 12 2019 3:29 PM

కిరోసిన్ తాగి బాలుడి మృతి - Sakshi

కిరోసిన్ తాగి బాలుడి మృతి

వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కూనీపూర్ గ్రామానికి చెందిన 14 నెలల బాలుడు కిరోసిన్ తాగి, చికిత్స అందక మృతి చెందిన సంఘటన మంగళవారం  రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన శ్రీకాంత్, గాయత్రిలకు ఈశ్వర్(14 నెలలు) ఉన్నాడు. చిన్నారికి తల్లిదండ్రులు డబ్బా పాలు తాగించేవారు. మంగళవారం రాత్రి గాయత్రి వంట పనిలో నిమగ్నమై ఉండగా, చిన్నారి ఈశ్వ ర్ ఆడుకుంటూ వెళ్లి సీసాలో ఉన్న కిరోసిన్ తాగాడు. తర్వా త ఏడుస్తుండడంతో కిరోసిన్ తాగినట్లు గుర్తించిన గాయత్రి తొలుత వర్ని ఆస్పత్రికి, అక్కడి నుంచి బోధన్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది.

ఆస్పత్రిలో చికి త్స ప్రారంభించిన కొద్దిసేపటికే బాలుడు మృతి చెందాడు. కూనీపూర్ నుంచి బోధన్‌కు 20 కిలోమీటర్లు ఉండగా, అక్కడికి తీసుకొచ్చే వరకు జాప్యం జరిగిందని, అందువల్లే బాలుడు చనిపోయాడని స్థానికులు అంటున్నారు. డబ్బాపాలు తాగే అలవాటున్న ఈశ్వర్ పాలసీసాగా భావించి కిరోసిన్ తాగాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement