
హేమలత(ఫైల్)
కుత్బుల్లాపూర్: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..ఆల్వాల్‌కు చెందిన వెంకటరెడ్డి కుమార్తె హేమలత, హోమియో వైద్యుడు శ్రీకర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. జీడిమెట్ల శ్రేయ ఆర్యన్ అపార్టుమెంట్‌లో ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న శ్రీకర్ హేమలతను వేధిస్తున్నాడు.
దీనిపై హేమలత అతడిని నిలదీయడంతో ఆమెపై దాడి చేసి ఇల్లువదిలి వెళ్లిపోయాడు. దీంతో హేమలత సోదరుడు వీరభద్రారెడ్డి ఇంటికి రావల్సిందిగా పలుమార్లు ప్రాథేయ పడినా ప్రయోజనం కనిపించలేదు. ఈ నెల 8న ఇంటికి వచ్చిన శ్రీకర్ విడాకుల పత్రంపై సంతకం చేయాలని, లేని పక్షంలో పిల్లలను తీసుకు వెళ్తానని బెదిరించడంతో మనస్తాపానికి గురైన హేమలత ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడింది. మృతురాలి సోదరుడు వీరభద్రారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.