ఆత్మహత్య చేసుకున్న శిల్పా, హరీశ్
కర్ణాటక, యశవంతపుర : వివాహేతర సంబంధం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈనెల ఒకటిన భర్త పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకోగా గురువారం సాయంత్రం ఆయన తిథి జరుగుతుండగా భార్య ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కనకపుర రోడ్డులోని నెల్లికెరెలో జరిగింది. వివరాలు... హరీశ్‌కి ఎనిమిదేళ్ల క్రితం శిల్పతో వివా హం జరిగింది. హరీశ్ ఇక్కడి ఓ ఆటోమొబైల్ దుకాణంలో పనిచేస్తున్నాడు. హరీశ్‌కు రేవణ్ణ అనే పూల వ్యాపారితో పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడు రేవణ్ణ ఇంటికి కూడా హరీశ్ వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో రేవణ్ణ భార్య శాలినితో హరీశ్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఒక రోజు ఇద్దరూ విహార యాత్రకు కూడా వెళ్లారు.
దీంతో వీరి ఇళ్లలో తెలియడంతో ఇద్దరిని నిలదీశారు. ఈ క్రమంలో హరీశ్, శాలినీలు ఊరు విడిచి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరిని పట్టుకుని కౌన్సెలింగ్ చేశారు. అయితే శాలిని మాత్రం తాను హరీశ్‌తోనే ఉంటానని మొండికేసింది. ఈ క్రమంలో రేవణ్ణ తరచూ హరీశ్‌ను భయపెట్టేవాడు. ఫోన్లు చేసి ఇంకా బతికే ఉన్నావా అంటూ నిలదీసేవాడు. దీంతో భయాందోళకు గురైన హరీశ్ ఈనెల ఒకటిన నెల్లికెరెలోని అక్క ఇంటికి వచ్చాడు. అక్కడే అతను పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఆయన తిథి నిర్వహిస్తుండగా భార్య శిల్ప కూడా గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏడేళ్ల వీరి కుమార్తె అనాథగా మారిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment