కర్నూలు: ‘‘నాన్నా నిద్రలేవు.. నన్ను చూడు’’ అంటూ కుమార్తె అనుషశ్రీ తండ్రి మృతదేహంపై రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఆదోని డీఎస్పీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్ సందీప్‌కుమార్(32) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మృతదేహాన్ని చూసి తట్టుకోలేక కుమార్తె గుండెలవిసేలా రోదించింది. ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామానికి చెందిన నారాయణస్వామి పెద్దకుమారుడు సందీప్‌కుమార్ 2011లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు.
ఈయనకు భార్య హేమలత, కుమార్తె అనూషశ్రీ ఉన్నారు. ఆదోని పట్టణంలోని కపటినగర్‌లో వీరు నివాసముంటున్నారు. కుమార్తె పట్టణంలోని ఓ ప్రయివేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం ఇంట్లో బెడ్ రూమ్‌లో ఫ్యాన్‌కు జంక్షన్ వైరుతో ఉరి వేసుకొని సందీప్‌కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం హాలులో పడుకున్న తల్లి, కుమార్తె రూములోకి వెళ్లి చూడగానే ఫ్యాన్‌కు సందీప్‌కుమార్ వేలాడుతూ కనిపించాడు.
విషయం తెలుసుకున్న డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు విక్రమసింహా, శ్రీనివాసనాయక్, ఎస్‌ఐ చంద్ర, సిబ్బంది లక్ష్మణ్, విష్ణు తదితరులు వెంటనే సందీప్‌కుమార్ ఇంటికి చేరుకున్నారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న కానిస్టేబుల్ మృతదేహాన్ని కిందకు దింపి, అనంతరం అంబులెన్స్‌లో పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సమయంలో మృతుడి కుమార్తె అనుషశ్రీ రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.
సందీప్‌కుమార్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్య హేమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటున్ల టూటౌన్ సీఐ శ్రీనివాసనాయక్ తెలిపారు. కానిస్టేబుల్ మృతదేహాన్ని స్వగ్రామమైన గుమ్మనూరుకు అంబులెన్స్‌లో తరలించారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment