రోడ్డు ప్రమాదంలో తల్లి చనిపోయిన బాధతో ఒకరు, అనారోగ్యంతో తండ్రి చనిపోయిన బాధతో మరొకరు పుట్టెడు దుఃఖంలోనూ శుక్రవారం పదో తరగతి పరీక్ష రాశారు.
తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం చెన్నడం గ్రామానికి చెందిన ఉల్లూరి చందన.. నగరం గ్రామంలోని శ్రీచైతన్య స్కూలులో పదో తరగతి చదువుతూ మామిడికుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పబ్లిక్ పరీక్షలకు హాజరవుతృంది. ఆమె తల్లి హేమలత (35) ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. కువైట్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హేమలత మృత్యువాత పడింది. ఆమె మృతదేహాన్ని గురువారం స్వగ్రామం తీసుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిని పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న చందన ఆ బాధను దిగమింగుకుని శుక్రవారం పరీక్షకు హాజరైంది.
కాగా, మాకనపాలెం గ్రామానికి చెందిన బొక్కా దుర్గాభవాని లూటుకుర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాస్తోంది. ఆమె తండ్రి బొక్కా వెంకటపతి (60) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. తండ్రి చనిపోయిన బాధతో ఉన్న దుర్గాభవాని కూడా అంత బాధలోనూ మొక్కవోని దీక్షతో పదో తరగతి పరీక్ష రాసింది.
పుట్టెడు దు:ఖంలోనూ పరీక్ష రాసిన విద్యార్థినులు
Published Fri, Apr 1 2016 6:31 PM | Last Updated on Sat, Sep 29 2018 5:55 PM
Advertisement
Advertisement