వివాహిత ఆత్మహత్య
Published Sun, May 21 2017 12:27 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM
అనంతపురం సెంట్రల్ : అనంతపురం సత్యసాయినగర్‌లో డ్రైవర్ సూర్యనారాయణ భార్య హేమలత(33) శనివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నట్లు త్రీటౌన్ సీఐ మురళీకష్ణ తెలిపారు. సూర్యనారాయణ మొదటి భార్య మరణించడంతో హేమలతను రెండో పెళ్లి చేసుకున్నాడు. తొలి భార్యకు ఇద్దరు, రెండో భార్యకు ఒక కుమార్తె సంతానం. కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న సూర్యనారాయణ తరుచూ ఆమెను వేధిస్తుండేవాడన్నారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు వివరించారు. కాగా హేమలత మతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. త్రీ టౌన్ సీఐ మురళీకష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement