Health Benefits Of Jamun Or Neredu Pandu And Its Side Effects Explained In Telugu - Sakshi
Sakshi News home page

Black Jamun Benefits & Side Effects: అలాంటి వారు నేరేడు పండ్లు తినకపోవడమే మంచిది!

Published Fri, Jun 30 2023 12:23 PM | Last Updated on Thu, Jul 27 2023 4:56 PM

Health Benefits Of Jamun Or Neredu Pandu And Its Side Effects Explained In Telugu - Sakshi

వర్షాకాలంలో దొరికే సీజనల్ ఫ్రూట్ నేరేడు పండు.ప్రకృతి సిద్ధంగా లభించే ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.తియ్యగా, పుల్లగా పంటికి భలే రుచికరంగా ఉండే ఈ పండ్లు వర్షాకాలంలో విరివిగా దొరుకుతాయి. పండు పోషకాల గని, అనారోగ్యాల నివారిణి కూడా.  ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు , కేన్సర్ , కాలేయ సంబంధ వ్యాధుల్ని నివారించే ఎన్నో ఔషధగుణాలున్నాయి.

నేరేడు పండులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి తో అనేక పోషకాలున్నాయి. నేరేడు పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

నేరుడుతో భలే ప్రయోజనాలు
► నేరేడు పండ్లు శరీరానికి చలువ చేస్తాయి.నీరసంగా ఉన్నప్పుడు నేరెడు పండ్లను తింటే తక్షణం శక్తి వస్తుంది. 
► డయాబెటిక్ రోగులు రోజూ నేరేడు పండ్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది చక్కెర స్థాయిలను కంట్రోల్‌ చేస్తుంది
► ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి
► మహిళలకు రుతుస్రావం అధికంగా అయితే నేరేడు గింజల పొడిని కషాయంగా చేసుకొని చెంచాడు తాగితే  మంచిది
► నేరేడు పండు ఊబకాయాన్ని తగ్గిస్తుంది.. 
► నేరేడు పండ్లలోని యాంటీ అక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగు పర్చడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. 
► నేరెడు పండ్లలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. 
► నేరేడు పండ్లు చిగుళ్ల వ్యాధులను నివారిస్తుంది.


ఈ సమస్యలు ఉంటే తినకూడదు

  • నేరేడు పండ్లు అధికంగా తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. అలాగే రక్తంలోని చక్కెర స్థాయి కూడా తగ్గుతుంది. కాబట్టి ఆపరేషన్లకు ముందు, తర్వాత తినకపోవడం ఉత్తమం.
  • అతిగా తినడం వల్ల లోబీపీ వచ్చే అవకాశం ఉంది. 
  • నేరేడు పండ్లు తిన్న తర్వాత పసుపు వేసిన పదార్థాలు, పచ్చళ్లు కూడా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.
  • ఖాళీ కడుపుతో నేరేడు పండ్లను అస్సలు తినకూడదు. లేదంటే వికారం, వాంతులతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. 
  • నేరేడు పండ్లు గర్భిణీ స్త్రీలు తినకూడదని అపోహ ఉంది. నేరేడు పండ్లు తింటే పుట్టబోయే పిల్లలు నల్లగా పుడతారని,వారి చర్మంపై నల్లటి చారలు ఏర్పడుతాయనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని వైద్యులు అంటున్నారు. నేరేడు పండ్లలో కాల్షియం, విటమిన్‌-సి, పొటాషియం, మినరల్స్‌ శిశువు ఎముకలు పటిష్టపరచడానికి సహాయపడతాయని, అయితే ఇవి తిన్న వెంటనే పాలు మాత్రం తాగకూడదని అంటున్నారు. 
  • నేరేడు పండ్లు అధికంగా తినడం వల్ల మొటిమలు వస్తాయి. చర్మ సమస్యలు ఉన్న వారు వీటిని తినడం వల్ల అలర్జీలు ఎక్కువవుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement