ప్రతీకాత్మక చిత్రం
బెంగళూరు : ఇంట్లో బొద్దింకలను చూడగానే ఎక్కడలేని కోపం.. అసహ్యం వేస్తుంది కొందరికి. ఆ కోపంలో వాటిని కొట్టి చంపి చెత్తబుట్టలో పడేస్తారు. మళ్లీ బొద్దింకలు ఇంటి ఛాయల్లోకి రాకుండా జాగ్రత్త పడతారు. అలాంటి బొద్దింకలను ఆహారంగా తీసుకోవాల్సి వస్తే.. ఛీ ఛీ అనుకుంటున్నారా? కానీ రానున్న రోజుల్లో బొద్దింకలకు డిమాండ్ విపరీతంగా పెరగనుందని, వాటిలో ఎక్కువ శాతం పోషకవిలువలు ఉన్నాయని శాస్త్రవేత్తలు సెలవిస్తున్నారు.
బెంగళూరుకు చెందిన ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ బయాలజీ అండ్ రీజెనరేటివ్ మెడిసిన్’ శాస్త్రవేత్తల బృందం చేసిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. బొద్దింకలను ఉపయోగించి తయారు చేసిన పాలలో మామూలు పాలకంటే నాలుగు రెట్లు ఎక్కువ పోషకవిలువలు ఉన్నాయని కొన్నేళ్ల తర్వాత బొద్దింక పాలు సూపర్‌ఫుడ్‌గా మారనుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. బొద్దింక జాతిలో ఒకటైన పసిఫిక్ బీటిల్ కాక్రూచ్ మామూటు బొద్దింకలలా గుడ్లు పెట్టకుండా పిల్లల్ని కంటాయి.
ఆస్ట్రేలియాలో ఉండే ఈ జీవులు అధిక పోషక విలువలు కలిగి ఉంటాయని పరిశోధనలో తేలింది. ఈ బొద్దింకలను కేవలం పాలలోనే కాకుండా ఐస్‌క్రీమ్స్‌లలో కూడా వాడుతున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన గౌర్మట్ గర్బ్ అనే కంపెనీ ‘ఎంటోమిల్క్’ పేరిట బొద్దింకపాలను విక్రయిస్తోంది. ఈ బొద్దింకపాలలో కొవ్వులు, ప్రోటీన్లు, షుగర్, అమినోఆసిడ్స్ వంటివే కాకుండా ఇతర పోషక విలువలు కూడా ఉంటాయి. కొన్ని కంపెనీలైతే పాలకు ప్రత్యామ్నాయాన్ని కనుగొనే పనిలో పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment