దౌల్తాబాద్: మధ్య తరగతి ప్రజల పౌష్టికాహారమైన కోడిగుడ్డు ధరలకు రెక్కలొచ్చాయి. ధరలు ఒక్కసారిగా పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు నిత్యావసర ధరలు మండిపోతుండగా మరో వైపు చికెన్, మటన్, చేపల ధరలు పెరుగుతున్నాయి. దీనికి తోడు సామాన్యులకు అందుబాటులో ఉండే గుడ్డు ధర కూడా అమాంతంగా పెరుగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
పౌష్టికాహారం..
ఆరోగ్యంగా ఉండాలంటే బలవర్ధకమైన పౌష్టికాహారం తినాలని వైద్యులు సూచిస్తున్నారు. సామాన్యులు ఎక్కువగా గుడ్లను కొనుగోలు చేస్తారు. ఇమ్యూనిటినీ పెంచుకోవడం కోసం ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తుండటం విశేషం. మండలంలో కోడిగుడ్లు ఉత్పత్తి అంతంత మాత్రంగా నే ఉండడంతో ఇతర జిల్లాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. ఐదేళ్ల నుంచి పౌల్ట్రిఫాం రైతులు నష్టాలు చవిచూడడం.. కోడిపల్లల పెంపకాన్ని తగ్గించడంతో గుడ్ల ధరల పెరుగుతున్నాయని పలువురు పేర్కొంటునారు. గత ఏప్రిల్‌లో గడ్డు ధర రూ.4నుంచి రూ.4.50వరకు ఉండగా ప్రస్తుతం రిటైల్‌గా రూ.6.50 వరకు ఉంది. ఓల్‌సేల్ వ్యాపారులు మార్కెట్ ధర ప్రకారం గుడ్లు సరఫరా చేస్తున్నప్పటికీ రిటైల్ వ్యాపారులు మాత్రం అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment