
దేశంలో 81 శాతం మందిలో ఇదే సమస్య
ఆహారపు అలవాట్లలో మార్పే కారణం
పని ఒత్తిడితో అలసట సర్వే వివరాలు విడుదల
చేసిన సుప్రదిన్, నేషనల్ న్యూట్రిషన్ వీక్
దేశంలో 81 శాతం మంది యువత పోషకాహార లోపంతో బాధపడుతున్నారని న్యూట్రిషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుప్రదిన్, నేషనల్ న్యూట్రిషన్ వీక్ సంయుక్తంగా విడుదలచేసిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఈ సర్వేలో 20 మిలియన్ల మంది 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసు గల యువత నుంచి అభిప్రాయాలు సేకరించామని తెలిపారు. 96 శాతం మంది భారతీయులు తమకు అవసరమైన సూక్ష్మపోషకాలు, మలీ్టవిటమిన్లు అందుబాటులో లేవని భావిస్తున్నారని పేర్కొన్నారు. మెట్రోపాలిటన్ నగరాల్లో ప్రధానంగా ఉదయం లేచింది మొదలు,నిత్యం ఉద్యోగంలో, ఇతర పనుల్లో అన్ని స్థాయిల్లోనూ వేగంగా అలసటకు గురవుతున్నారట.
పెరుగుతున్న పోషకాహార లోపంపై అవగాహన కలి్పంచడం, స్వీయ సంరక్షణను ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టాలని సూచిస్తోంది. సర్వే సంస్థ వన్ నేషన్ 100% న్యూట్రిషన్ మిషన్‌లో భాగంగా ఉద్యోగ, శ్రామిక జనాభాలో అలసట పెరుగుతోందని తేలింది. ఈ సమస్యకు గల కారణాలు, పరిష్కార మార్గాలు, తక్షణ పోషక విలువలు మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలు అందులో వివరించారు. విధి నిర్వహణలో 83 శాతం మంది అలసట కారణంగా తరచూ విరామాలు అవసరమని అభిప్రాయపడుతున్నారు.
74 శాతం మంది పగటిపూట నిద్రతో ఇబ్బంది పడుతున్నారు. 69 శాతం మంది పనులు ప్రారంభించడం లేదా పూర్తి చేయడం కష్టంగా
ఉందని తెలిపారు. 66 శాతం మంది రోజువారీ కార్యకలాపాలను పూర్తి చేయలేకపోతున్నామని, 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసు వారిలో 78% మంది, 36 ఏళ్ల నుంచి 45 ఏళ్లలో 72% మంది పగటిపూట మగతగా ఉంటున్నారని అభిప్రాయపడ్డారు.
ముందే గుర్తించారు..
యువతలో అలసట పెరగడం చాలా మంది ఆరోగ్య నిపుణులు గుర్తించారు. పోషకాహార అంతరాలను తగ్గించడానికి మలీ్టవిటమిన్‌లను ప్రోత్సహించడం ద్వారా 70% వరకూ అవసరమైన సూక్ష్మపోషకాలను అందించవచ్చు. రోజువారీ సప్లిమెంట్‌లతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
– డాక్టర్ కేతన్ కె మెహతా, సీనియర్ కన్సల్టెంట్
ఇంటికి వచ్చేసరికే నీరసం..
నగర జీవనంలో శారీరక వ్యాయామం తగ్గుతోంది. నిత్యం పని ఒత్తిడి ఉంటోంది. ఇటువంటి సందర్భంలో అలసటకు గురవుతున్నాం. దీనికి తగ్గట్లే ఆఫీస్‌లో విరామం ఇస్తున్నారు. ఇంటికి వచ్చే సరికి నీరసం అనిపిస్తుంది. సెలవు రోజుల్లో ప్రశాతంగా రెస్ట్ తీసుకోవడానికే ఇష్టపడుతున్నాం.
– ఆలేటి గోపి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, కొండాపూర్