Health professionals
-
యువతలో పోషకలోపం..
దేశంలో 81 శాతం మంది యువత పోషకాహార లోపంతో బాధపడుతున్నారని న్యూట్రిషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుప్రదిన్, నేషనల్ న్యూట్రిషన్ వీక్ సంయుక్తంగా విడుదలచేసిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఈ సర్వేలో 20 మిలియన్ల మంది 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసు గల యువత నుంచి అభిప్రాయాలు సేకరించామని తెలిపారు. 96 శాతం మంది భారతీయులు తమకు అవసరమైన సూక్ష్మపోషకాలు, మలీ్టవిటమిన్లు అందుబాటులో లేవని భావిస్తున్నారని పేర్కొన్నారు. మెట్రోపాలిటన్ నగరాల్లో ప్రధానంగా ఉదయం లేచింది మొదలు,నిత్యం ఉద్యోగంలో, ఇతర పనుల్లో అన్ని స్థాయిల్లోనూ వేగంగా అలసటకు గురవుతున్నారట. పెరుగుతున్న పోషకాహార లోపంపై అవగాహన కలి్పంచడం, స్వీయ సంరక్షణను ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టాలని సూచిస్తోంది. సర్వే సంస్థ వన్ నేషన్ 100% న్యూట్రిషన్ మిషన్‌లో భాగంగా ఉద్యోగ, శ్రామిక జనాభాలో అలసట పెరుగుతోందని తేలింది. ఈ సమస్యకు గల కారణాలు, పరిష్కార మార్గాలు, తక్షణ పోషక విలువలు మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలు అందులో వివరించారు. విధి నిర్వహణలో 83 శాతం మంది అలసట కారణంగా తరచూ విరామాలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. 74 శాతం మంది పగటిపూట నిద్రతో ఇబ్బంది పడుతున్నారు. 69 శాతం మంది పనులు ప్రారంభించడం లేదా పూర్తి చేయడం కష్టంగా ఉందని తెలిపారు. 66 శాతం మంది రోజువారీ కార్యకలాపాలను పూర్తి చేయలేకపోతున్నామని, 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసు వారిలో 78% మంది, 36 ఏళ్ల నుంచి 45 ఏళ్లలో 72% మంది పగటిపూట మగతగా ఉంటున్నారని అభిప్రాయపడ్డారు.ముందే గుర్తించారు.. యువతలో అలసట పెరగడం చాలా మంది ఆరోగ్య నిపుణులు గుర్తించారు. పోషకాహార అంతరాలను తగ్గించడానికి మలీ్టవిటమిన్లను ప్రోత్సహించడం ద్వారా 70% వరకూ అవసరమైన సూక్ష్మపోషకాలను అందించవచ్చు. రోజువారీ సప్లిమెంట్లతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. – డాక్టర్ కేతన్ కె మెహతా, సీనియర్ కన్సల్టెంట్ ఇంటికి వచ్చేసరికే నీరసం.. నగర జీవనంలో శారీరక వ్యాయామం తగ్గుతోంది. నిత్యం పని ఒత్తిడి ఉంటోంది. ఇటువంటి సందర్భంలో అలసటకు గురవుతున్నాం. దీనికి తగ్గట్లే ఆఫీస్‌లో విరామం ఇస్తున్నారు. ఇంటికి వచ్చే సరికి నీరసం అనిపిస్తుంది. సెలవు రోజుల్లో ప్రశాతంగా రెస్ట్ తీసుకోవడానికే ఇష్టపడుతున్నాం. – ఆలేటి గోపి, సాఫ్ట్వేర్ ఉద్యోగి, కొండాపూర్ -
‘స్టెమీ’ గుండెపోటు అంటే తెలుసా? ఎవరికి ఆ ప్రమాదం?
క్యాన్సర్ గుండెపోటును కూడా తెస్తుందన్న విషయం కాస్త విచిత్రంగానే అనిపించవచ్చుగానీ అది పూర్తిగా వాస్తవం. అంటే... క్యాన్సర్ ఇప్పుడు తన అనర్థాలకే కాదు... గుండె తాలూకు సమస్యలకూ కారణమవుతుందన్నమాట. అంతమాత్రాన బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. క్యాన్సర్‌ను జయించిన ప్రతి పదిమందిలో ఒకరికి మాత్రమే ఈ ముప్పు ఉంటుంది. క్యాన్సర్ వల్ల వచ్చే గుండెపోటును ‘స్టెమీ’ అంటారు. ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అనే మాటకు ‘స్టెమీ’ సంక్షిప్త రూపం. ఈ విషయాన్ని మయో క్లినిక్‌కు చెంది నిపుణుల అధ్యయనంలో తెలిసివచ్చిన సంగతి ఇది. రోచెస్టర్‌లోని ఆ క్లినిక్‌లోని పరిశోధకులు / వైద్యనిపుణులు అధ్యయనం చేసినప్పుడు క్యాన్సర్ పూర్తిగా తగ్గిన మాజీ బాధితులు... ప్రతి పదిమందిలో ఒకరికి గుండెపోటుకు గురయ్యే ముప్పు ఉన్నట్లు కనుగొన్నారు. చదవండి: తరుచూ బీట్ రూట్, క్యారెట్, బంగాళ దుంప, ద్రాక్ష పండ్లు తింటున్నారా.. అయితే క్యాన్సర్‌పై విజయం సాధించడం చిన్న విషయమేమీ కాదు. అయితే క్యాన్సర్‌నే జయించినంత మాత్రాన అంతా సద్దుమణిగిందని అర్థం కాదు. ఆ తర్వాత కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ, తగినంత వ్యాయామం చేస్తూ, ఎప్పుడూ ఉల్లాసంగా సంతోషంగా ఉండటం చాలా ముఖ్యం. శారీరక, మానసిక ఒత్తిళ్లు లేకుండా చూసుకోవడం అవసరం. అప్పుడే క్యాన్సర్‌ను జయించిన ఉత్సాహం మాత్రమేగాక... ఆ తర్వాతి అనర్థాలనూ అధిగమించే ఆరోగ్యం సమకూరుతుందం’’ టూ హెచ్చరిస్తున్నారు మయో క్లినిక్ డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు. -
కోవిడ్ మాత్రలు వేరే సంస్థలూ తయారుచేయొచ్చు
జెనీవా: కరోనా వైరస్‌ను తరిమికొట్టడానికి తాము ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసిన యాంటీ వైరల్ మాత్రల్ని ఇతర కంపెనీలూ తయారు చేయడానికి అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ అంగీకరించింది. ఐక్యరాజ్య సమితి మద్దతు కలిగిన జెనీవాకి చెందిన మెడిసన్స్ పేటెంట్ పూల్(ఎంపీపీ) బృందంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. యాంటీవైరల్ పాక్స్లోవిడ్ మాత్రలు తయారు చేయడానికి ఆ బృందానికి లైసెన్స్‌లు మంజూరు చేసినట్టుగా ఫైజర్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఎంపీపీ సంస్థ నిరుపేద దేశాలకు తక్కువ ధరలకే మందుల్ని పంపిణీ చేస్తోంది. ఫైజర్ చేసుకున్న ఒప్పందం ద్వారా ప్రపంచ జనాభాలో 53% మందికి కోవిడ్ మాత్రలు అందుబాటులోకి వస్తాయి. ఫైజర్ కంపెనీ రాయల్టీలను వదులుకోవడంతో 95 దేశాల్లో ఈ మాత్రల్ని అత్యంత చౌక ధరలకే పంపిణీ చేయవచ్చు. మరికొద్ది నెలల్లోనే ఈ మాత్రల్ని మార్కెట్లోకి తెస్తామని ఎంపీపీ పాలసీ చీఫ్ ఎస్టెబన్ బరోన్ చెప్పారు. ఫైజర్ చేసుకున్న ఈ ఒప్పందంతో కరోనాను త్వరితంగా అంతమొందించవచ్చునని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఆడపిల్లలను ఆడనివ్వండి!
కొత్త పరిశోధన టీనేజీ దశలో ఉన్న ఆడపిల్లల్ని స్పోర్ట్స్ ఆడనివ్వడం, చురుగ్గా వ్యాయామాలు చెయ్యనివ్వడం వారి ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీనేజీ ఆడపిల్లలు శారీరకంగా చురుగ్గా ఆటలాడటం... ఆ తర్వాత వారి భవిష్యత్తులోఆరోగ్యంగా ఉండటానికి బాగా ఉపయోగపడుతుందని వారు పేర్కొంటున్నారు. చైనా దేశానికి చెందిన నలభై నుంచి డెబ్బయి ఏళ్ల వయసున్న 74,941 మంది మహిళలపై నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ మహిళల ఆరోగ్య పరిస్థితులను అధ్యయనం చేశాక... ఇలా టీనేజ్‌లో విస్తృతంగా ఆటలాడినవారే ఎక్కువని తేలింది. ఇలా టీనేజీలో ఆటలాడిన వారు తమ 40 నుంచి 70 ఏళ్ల వయసప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారనీ, వీళ్లలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు 16 శాతం, గుండెజబ్బుల రిస్క్ 15 శాతం తగ్గాయనీ, పైగా వారి ఆయుఃప్రమాణం బాగా పెరిగిందని కూడా తెలిసింది. అన్ని రకాల రిస్క్‌ల కారణంగా వచ్చే అకాల మరణాలు దాదాపు 20 వరకు ఇలాంటి ఆరోగ్యకరమైన మహిళల్లో తక్కువని వెల్లడయ్యింది. ఈ విషయాలన్నీ ‘క్యాన్సర్ ఎపిడెమియాలజీ, బయోమార్కర్స్ అండ్ ప్రివెన్షన్’ అనే మెడికల్ జర్నల్‌లో పొందుపరచినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. -
శాకాహారంతో గుండెకు మేలు..
గుండెజబ్బులకు దూరంగా ఉండాలంటే శాకాహారమే మేలని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో కనీసం 70 శాతం శాకాహారం ఉండేలా చూసుకుంటే, గుండెజబ్బులు వచ్చే ముప్పు 20 శాతం వరకు తక్కువగా ఉంటుందని లండన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిపుణులు నిర్వహించిన విస్తృత అధ్యయనంలో తేలింది. పూర్తిగా ఒక దశాబ్దం పాటు 4.50 లక్షల మంది ఆహారపు అలవాట్లపై ఈ అధ్యయనం నిర్వహించారు. శాకాహారంతో పాటు రోజుకు మూడు కప్పుల వరకు కాఫీ తాగే వారిలో గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు. పూర్తిగా శాకాహారం తీసుకోవడం లేదా రోజువారీ భోజనంలో శాకాహారాన్నే ఎక్కువగా తీసుకోవడం ద్వారా గుండెజబ్బుల కారణంగా సంభవించే అకాల మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని భరోసా ఇస్తున్నారు.