క్యాన్సర్ గుండెపోటును కూడా తెస్తుందన్న విషయం కాస్త విచిత్రంగానే అనిపించవచ్చుగానీ అది పూర్తిగా వాస్తవం. అంటే... క్యాన్సర్ ఇప్పుడు తన అనర్థాలకే కాదు... గుండె తాలూకు సమస్యలకూ కారణమవుతుందన్నమాట. అంతమాత్రాన బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. క్యాన్సర్‌ను జయించిన ప్రతి పదిమందిలో ఒకరికి మాత్రమే ఈ ముప్పు ఉంటుంది.
క్యాన్సర్ వల్ల వచ్చే గుండెపోటును ‘స్టెమీ’ అంటారు. ఎస్‌టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్‌ఫార్‌క్షన్ అనే మాటకు ‘స్టెమీ’ సంక్షిప్త రూపం. ఈ విషయాన్ని మయో క్లినిక్‌కు చెంది నిపుణుల అధ్యయనంలో తెలిసివచ్చిన సంగతి ఇది. రోచెస్టర్‌లోని ఆ క్లినిక్‌లోని పరిశోధకులు / వైద్యనిపుణులు అధ్యయనం చేసినప్పుడు క్యాన్సర్ పూర్తిగా తగ్గిన మాజీ బాధితులు... ప్రతి పదిమందిలో ఒకరికి గుండెపోటుకు గురయ్యే ముప్పు ఉన్నట్లు కనుగొన్నారు.
చదవండి: తరుచూ బీట్ రూట్, క్యారెట్, బంగాళ దుంప, ద్రాక్ష పండ్లు తింటున్నారా.. అయితే
క్యాన్సర్‌పై విజయం సాధించడం చిన్న విషయమేమీ కాదు. అయితే క్యాన్సర్‌నే జయించినంత మాత్రాన అంతా సద్దుమణిగిందని అర్థం కాదు. ఆ తర్వాత కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ, తగినంత వ్యాయామం చేస్తూ, ఎప్పుడూ ఉల్లాసంగా సంతోషంగా ఉండటం చాలా ముఖ్యం. శారీరక, మానసిక ఒత్తిళ్లు లేకుండా చూసుకోవడం అవసరం. అప్పుడే క్యాన్సర్‌ను జయించిన ఉత్సాహం మాత్రమేగాక... ఆ తర్వాతి అనర్థాలనూ అధిగమించే ఆరోగ్యం సమకూరుతుందం’’ టూ హెచ్చరిస్తున్నారు మయో క్లినిక్ డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు.
Comments
Please login to add a commentAdd a comment