Gautham Karthik Reveals How He Proposed To Manjima Mohan - Sakshi
Sakshi News home page

Gautham Karthik- Manjima Mohan : ప్రేమకథను రివీల్‌ చేసిన హీరో,హీరోయిన్లు

Published Thu, Nov 24 2022 3:08 PM | Last Updated on Thu, Nov 24 2022 3:36 PM

Gautham Karthik Reveals How He Proposed To Manjima Mohan - Sakshi

కోలీవుడ్‌ హీరో గౌతమ్‌ కార్తీక్‌, హీరోయిన్‌ మంజిమా మోహన్‌ ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. తాము రిలేషన్‌లో ఉన్నామంటూ ఇటీవలె ఈ జంట అధికారికంగా ప్రకటించింది కూడా. మరో నాలుగు రోజుల్లో(నవంబర్‌ 28)న వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో తమ ప్రేమకథను రివీల్‌ చేశారు ఈ క్యూట్‌ కపుల్‌. చెన్నై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో గౌతమ్‌ కార్తీక్‌ మాట్లాడుతూ.. తాను ప్రపోజ్‌ చేస్తే మంజిమా వెంటనే ఒప్పుకోలేదని కానీ ఆ తర్వాత అంగీకరించిందని తెలిపాడు.

'మా ప్రేమకథ అంత గొప్పదేం కాదు. జీవితంలోకి సరైన వ్యక్తి వచ్చినప్పుడు మనం మంచి మనిషిగా ఎదుగుతాం అని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. అలా నా జీవితానికి సరైన వ్యక్తి మంజిమా. తను అందగత్తె మాత్రమే కాదు అద్భుతమైన వ్యక్తి. నేనెప్పుడైనా నిరాశకు గురైనా తను నా వెంటే ఉండేది. ఇక దేవరట్టం సినిమా షూటింగ్‌ సమయంలోనే మేం స్నేహితులుగా మారాం. ఆ తర్వాత ఏడాదికి తనతో రిలేషన్‌ కొనసాగించాలనిపించింది.

వెంటనే ఆమెకు ప్రపోజ్‌ చేశా. కానీ మంజిమా రెండు రోజులు సమయం తీసుకున్న తర్వాత నా ప్రేమకు అంగీకారం చెప్పింది. అలా కుటుంబసభ్యుల అంగీకారంతో నవంబర్‌ 28న చెన్నైలో పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ పేర్కొన్నారు. కాగా అలనాటి హీరో నవరస నయగన్‌ కార్తీక్‌ తనయుడే గౌతమ్‌ కార్తీక్‌. ప్రస్తుతం గౌతమ్‌ కోలీవుడ్‌లో హీరోగా బిజీగా ఉన్నాడు. మంజిమా మోహన్‌ విషయానికి వస్తే 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement