రంగూన్‌కు సిద్ధం | Gautham Karthik's next is Rangoon | Sakshi
Sakshi News home page

రంగూన్‌కు సిద్ధం

Published Thu, Aug 28 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM

రంగూన్‌కు సిద్ధం

రంగూన్‌కు సిద్ధం

ప్రస్తుత యువ నటుల్లో అధిక చిత్రాలు చేతిలో ఉన్న హీరో గౌతమ్ కార్తీక్. విశేషం ఏమిటంటే ఈయన నటించిన తొలి, మలి చిత్రాలు కడల్, ఎన్నమో ఎదో రెండు చిత్రాలు ఆశించిన విజయాలు సాధించలేదు. అయినా గౌతమ్ కార్తీక్ పై ఆ ప్రభావం ఇసుమంత కూడా లేకుండా ఆయన్ని వెతుక్కుంటూ అవకాశాలు రావడం గమనార్హం. ప్రస్తుతం గౌతమ్ కార్తీక్ నాలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా మరో క్రేజీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
 
 రంగూన్ అనే వైవిధ్య భరిత కథా చిత్రంలో గౌతమ్ కార్తీక్ హీరోగా నటించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ నిర్మించనున్నారు. ఆయన శిష్యుడు రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రం ద్వారా మెగాఫోన్ పట్టనున్నారు. ఈయన ఎ.ఆర్.మురుగసామి వద్ద 7ఆమ్ అరివు, తుపాకి చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు. రాజ్‌కుమార్, పెరియసామి చెప్పిన కథకు అంగీకరించినట్లు నటుడు గౌతమ్ కార్తీక్ తెలిపారు.
 
 దర్శకుడు మాత్రం ఈ చిత్రం వివరాలు చెప్పడానికి ఇంకా చాలా సమయం ఉందంటూనే ఇదొక కల్పిత కథతో తెరకెక్కించనున్న చిత్రం అని తెలిపారు. 25 ఏళ్ల ఒక యువకుడి జీవితంలో జరిగిన సంఘటనల సమాహారమే చిత్రం అన్నారు. ఈ చిత్రానికి గౌతమ్ కార్తీక్‌ను హీరోగా ఎంపిక చెయ్యడానికి ప్రధాన కారణం ఆయన శారీరక భాష ముఖ్యంగా ఆయన వయసు అని తెలిపారు. అనిరుధ్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రంలో నాయిక ఇతర నటవర్గం ఎంపిక జరుగుతోందని తెలిపారు. చిత్రం షూటింగ్‌ను వచ్చే నెల ప్రారంభించి వచ్చే ఏడాది మార్చిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement