రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'తిరగబడరాసామీ'. ఈ చిత్రానికి ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు మేకర్స్. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో పలువురు చిత్ర యూనిట్ సభ్యులు కూడా పాల్గొన్నారు.
(ఇది చదవండి: కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోన్న రాజ్ తరుణ్ హీరోయిన్!)
ముద్దు సీన్‌తో వివాదం
అయితే ఈ ఈవెంట్‌కు హాజరైన ప్రేక్షకులకు ఊహించని సంఘటన ఎదురైంది. ఈవెంట్‌కు హాజరైన హీరోయిన్ మన్నారా చోప్రాకు దర్శకుడు రవికుమార్ బహిరంగంగా ముద్దుపెట్టడం వివాదానికి దారితీసింది. ఆయన తీరుపై పలువురు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డైరెక్టర్ తీరును నెటిజన్స్ విమర్శించారు. కాగా.. గతంలో ఇలానే కాజల్ స్టేజీపై మాట్లాడుతుండగా సినిమాటోగ్రాఫర్ చోటా. కె. నాయుడు ముద్దుపెట్టేశాడు.
మీకేం ఇబ్బంది?
అయితే తాజాగా ఈ విషయంపై స్పందించారు. తాను హీరోయిన్‌కు ముద్దుపెట్టడంతో తప్పేంటని రవికుమార్ ప్రశ్నిస్తున్నారు. ఆమె పట్ల అప్యాయతతోనే అలా చేశానని చెప్పుకొచ్చారు. నా కూతురికి కూడా అలాగే ముద్దుపెడతా అంటూ వివరణ ఇచ్చారు. అయినా ఆమెకు, మా ఫ్యామిలీకి లేని ఇబ్బంది మీకేంటని నెటిజన్లను నిలదీశారాయన. నా సినిమాలో మన్నారా చోప్రా ఆమె చేసిన వర్క్ నచ్చడం వల్లే అలా చేశానని రవికుమార్ వెల్లడించారు. ఏదేమైనా ఈవెంట్‌లో అందరిముందు అలా ముద్దులు పెట్టడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
(ఇది చదవండి: రాఖీ సంబురాల్లో కాబోయే మెగా కోడలు.. సోషల్ మీడియాలో వైరల్!)
Director kisses an actress earlier today!pic.twitter.com/JzyBbau45d
— Manobala Vijayabalan (@ManobalaV) August 28, 2023
Comments
Please login to add a commentAdd a comment