Mannara Chopra
-
షూటింగ్లో సేద తీరుతున్న బ్యూటీ.. భయపడిపోయిన సోనాక్షి
భర్తతో బంగీ జంప్.. కేకలు పెట్టిన సోనాక్షిహంపిలో బిగ్‌బాస్ బ్యూటీ దివిరెడ్ డ్రెస్‌లో రాయ్ లక్ష్మిపింక్ చీరలో శ్రీలీలపిల్లలతో మన్నారా చోప్రా క్రిస్మస్ సెలబ్రేషన్స్డిసెంబర్ సంగతుల్ని ఫోటోల రూపంలో షేర్ చేసిన పరిణతీ చోప్రా View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Mannara Chopra (@memannara) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) -
గ్లామర్ డోస్ పెంచిన ‘మన్నారా చోప్రా’ (ఫోటోలు)
-
మన్నారా మతిపోయే గ్లామర్ ట్రీట్.. చీరకట్టులో రకుల్
బికినీ అందాలతో హీట్ పెంచేలా లక్ష్మీ రాయ్హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సోనాక్షి సిన్హాకుందనపు బొమ్మలా మెరిసిపోతున్న ఐశ్వర్య లక్ష్మిడస్కీ లుక్‌లో బిగ్ బాస్ ఫేమ్ తేజస్వి మదివాడచీరకట్టులో చాలా సింపుల్‌గా రకుల్ ప్రీత్ సింగ్ఎర్ర గులాబీ అంత అందంగా హీరోయిన్ తాప్సీపుట్టినరోజు సెలబ్రేషన్స్‌లో 'బలగం' బ్యూటీహీరోయిన్ మన్నారా చోప్రా గ్లామర్ ట్రీట్ View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Mannara Chopra (@memannara) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
హీరోయిన్‌తో అసభ్య ప్రవర్తన.. అత్యంత చెత్త అంటూ!
గతంలో డైరెక్టర్‌తో ముద్దు సీన్‌తో పెద్ద ఎత్తున వైరలైన హీరోయిన్ మన్నారా చోప్రా. ఓ ఈవెంట్‌కు హాజరైన ఆమెకు టాలీవుడ్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ అందరి ముందే ముద్దు పెట్టి ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. అప్పట్లో ఆ వీడియో సంచలనంగా మారింది. పెద్దఎత్తున వైరల్ కావడంతో పాటు ఆయన భారీగా ట్రోలింగ్‌కు కూడా గురయ్యారు. కాగా.. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ హిందీ బిగ్ బాస్ సీజన్-17లో మెరిసింది. అంతే కాదు టాప్-3 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌లైన్స్ సిబ్బంది తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించారని తెలిపింది. నేను ప్రయాణించిన అత్యంత చెత్త ఎయిర్‌లైన్స్ ఇదే.. ఇలా జరగడం నాకు రెండోసారని పేర్కొంది. గతంలో ఒకసారి నా బ్యాగ్‌ను డ్యామేజ్ చేశారని.. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా మళ్లీ దురుసుగా ప్రవర్తించారని వెల్లడించింది. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా పంచుకుంది. అయితే మన్నారా చోప్రా ట్వీట్‌కు విమానయాన సంస్థ స్పందించింది. " మన్నారా ట్వీట్‌పై ఎయిర్‌లైన్స్ . "మన్నారా.. మీకు కలిగిన ఇబ్బందికి మేము చింతిస్తున్నాం. మా బృందం విమానాశ్రయంలోనే అదనపు బ్యాగేజీ రుసుము విధానాన్ని వివరించిందని అర్థం చేసుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు మీ రుసుమును మాఫీ చేయలేము. ఈ విషయంలో మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. అలాగే మీకు ఇంతకు ముందు ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం. దయచేసి మాకు ఆ వివరాలను పంపించండి" అంటూ రిప్లై ఇచ్చింది. దీనికి మన్నారా చోప్రా బదులిస్తూ.. "ఏం వ్రాస్తున్నారు సార్.. మీ సిబ్బంది నాతో అసభ్యంగా, దురుసుగా ప్రవర్తించారు. ఈ రోజు ఉదయం నాకు ఆరోగ్యం బాగాలేదు. మీ ఉద్యోగితో ఈ విషయాన్ని ప్రస్తావించా. మీరు చాలా బాగా నటిస్తున్నారు.. వెళ్లి మా మేనేజర్‌తో మాట్లాడండని దురుసుగా ప్రవర్తించింది. కనీసం మీ మేనేజర్ వచ్చి సమస్యను అర్థం చేసుకునే పని కూడా చేయలేదు." అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. మన్నారా థ్రిల్లర్ జిద్ అనే మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం తెలుగులో రాజ్ తరుణ్ సరసన తిరగబడరా సామీ చిత్రంలో కనిపించనుంది. ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ సీజన్ -17లో మూడోస్థానంలో నిలిచింది. The worst airlines to travel with @AkasaAir .this is my second experience with them,first time I travelled they damaged my bag and this time I’m not feeling well they ended up being rude again — Mannara Chopra (@memannara) February 18, 2024 -
ఎయిర్‌పోర్ట్‌లో హీరోయిన్ మన్నారా చోప్రా అమేజింగ్ లుక్స్‌తో కనిపించింది
-
నేను అలాంటి పనులు చేయను !
‘అల్లరి’ నరేశ్ హీరోగా నటీంచిన ‘సిద్ధు ఫ్రమ్ సీకాకుళం’(2008) సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యారు శ్రద్ధాదాస్. ఆ తర్వాత హిందీ, కన్నడ, మలయాళం, బెంగాళీ భాషల్లో పలు సినిమాల్లో నటించి గ్లామర్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. ఆ మధ్య హీరోయిన్ మన్నారా చోప్రా గురించి శ్రద్ధాదాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు తెరలేపాయి. ‘‘జిద్’ (2014) అనే హిందీ సినిమాలో మన్నారా చోప్రాతో కలిసి నటించాను. ఈ సినిమా చిత్రీకరణలో కొన్ని సన్నివేశాల్లో మన్నారా చోప్రా కావాలనే నన్ను నిజంగానే కొట్టింది.. బలవంతంగా మెట్లపైకి తోసేసింది.. ఆమె వల్ల గాయాలపాలయ్యాను’’ అంటూ గతంలో మాట్లాడారు శ్రద్ధాదాస్. ఆ మాటలపై తీవ్ర దుమారం రేగినా, ఆ తర్వాత సద్దుమణిగింది. అయితే మన్నారా చోప్రాతో ఉన్న విభేదాలపై శ్రద్ధాదాస్ మరోసారి స్పందించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు శ్రద్ధాదాస్. ‘‘మన్నారా చోప్రాపై కానీ, ఆమె ఫ్యామిలీ గురించి నేను ఏ మీడియాకి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కనీసం నా వ్యక్తిగత పీఆర్వో సిబ్బంది కూడా లేరు. నేను కావాలనుకుంటే ‘ఎక్స్’ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రిలీజ్ చేసి పబ్లిసిటీ పొందుతాను. కానీ, నేను అలాంటి పనులు చేయను. ఆమె విషయంలో గతంలో నేను బాధపడ్డాను. కానీ, ఇప్పుడు వీటన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నాను’’ అంటూ శ్రద్ధాదాస్ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. -
ఆ హీరోయిన్ నన్ను కావాలనే కొట్టింది.. బాడీపై 30 చోట్ల గాయాలు: శ్రద్ధా దాస్
తెలుగులో బిగ్‌బాస్ షో పూర్తయి దాదాపు నెలరోజులు పైనే అయిపోయింది. కానీ హిందీలో మాత్రం ప్రస్తుతం 17వ సీజన్ నడుస్తోంది. ఈ ఆదివారం ఫినాలే ఎపిసోడ్ జరగనుంది. అయితే కప్ కొట్టే రేసులో ఆరుగురు ఫైనలిస్టులు ఉండగా.. వీరిలో హీరోయిన్ మన్నార్ చోప్రా కూడా ఉంది. అయితే ఈమెతో హీరోయిన్ శ్రద్ధాదాస్ గతంలో గొడవ పడింది. బిగ్‌బాస్ ఫినాలే సందర్భంగా ఇది మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ అప్పట్లో ఏం జరిగింది? శ్రద్ధా దాస్ ఇప్పుడేం చెప్పింది? (ఇదీ చదవండి: పూర్ణతో సంబంధం అంటగడుతున్నారు.. దర్శకుడి ఆవేదన) అసలేంటి గొడవ? ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు కజిన్ సిస్టర్ మన్నారా చోప్రా. 2014లో 'ప్రేమ గీమా జాన్తా నై' అనే మూవీతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. అదే ఏడాది హిందీలో 'జిద్' అనే సినిమా కూడా చేసింది. ఇందులో మన్నారాతో పాటు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన శ్రద్ధా దాస్ కూడా నటించింది. షూటింగ్ టైంలో వీళ్లిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. సన్నివేశాలు తీస్తున్నప్పుడు శ్రద్ధాని మన్నారా నిజంగానే కొట్టేసింది. 'ఓ సీన్లో మెట్లపై నన్ను నెమ్మదిగా తోయాలి. కానీ మన్నారా బలంగా తోసేసింది. నాకు మెట్లు గట్టిగా తగిలేశాయి. సరేలే నటనకు కొత్త కదా తెలియదేమో అనుకున్నాను. నెమ్మదిగా పుష్ చేయ్ అని మరీమరీ చెప్పాను. కానీ తర్వాత సీన్లో నాపై మరింతగా రెచ్చిపోయి నన్ను గట్టిగా కొట్టడం మొదలుపెట్టింది. నేను ఆపాలని చూశాను గానీ కుదర్లేదు. ఓ వైపు నుంచి డైరెక్టర్ కట్ చెబుతున్నాసరే మన్నారా అలా గుద్దుతూనే ఉంది. చివరకు ఆపింది గానీ అప్పటికే నా శరీరంపై 30 చోట్లకు పైనే గాయాలయ్యాయి' (ఇదీ చదవండి: స్టార్ హీరో కాపురంలో చిచ్చు.. హీరోయిన్‌కి వార్నింగ్ ఇచ్చిన భార్య?) 'మరో సీన్లో నా ఛాతిపై నెమ్మదిగా పంచ్ ఇవ్వాలి. కానీ సీన్ వివరిస్తున్నప్పుడు అన్నింటికీ సరే అని సమాధానమిచ్చింది. కానీ సీన్ చేసేటప్పుడు మాత్రం నిజంగానే గట్టిగా గుద్దేసింది. ఇంకో ఫైట్ సీన్లో డమ్మీ స్టిక్ బదులు నిజమైన కర్రతో ఎడాపెడా బాదేసింది. దీంతో నా కుడి కంటికి గాయమై గట్టిగా అరిచాను. ఈ క్రమంలోనే నన్ను హాస్పిటల్లో కూడా చేర్చారు' అని శ్రద్దా దాస్ అప్పట్లో చెప్పుకొచ్చింది. తాజాగా ఈ గొడవపై మరోసారి శ్రద్ధాని ప్రశ్నించగా.. ఆ విషయం గురించి మాట్లాడటానికి నిరాకరించింది. తన జీవితాన్ని రిస్క్‌లో పెట్టదలుచుకోలేనని శ్రద్ధా దాస్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. ఇకపోతే తెలుగులో జక్కన్న, సీత, తిక్క, రోగ్ తదితర సినిమాల్లో మన్నారా చోప్రా నటించింది గానీ ప్రతిదీ ఒకదాని మించి మరొకటి డిజాస్టర్‌గా నిలిచాయి. మరోవైపు శ్రద్దా దాస్ మాత్రం తొలుత హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు సహాయ పాత్రల్లో చేస్తోంది. మరోవైపు టీవీ షోలు కూడా చేస్తోంది. అయితే వీళ్లిద్దరి గొడవ గురించి ఇప్పుడు తెలుసుకున్న తెలుగు ప్రేక్షకులు అవాక్కవుతున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?) -
బిగ్ బాస్ చరిత్రలోనే ఇది దారుణమైన టాస్క్.. వీడియో వైరల్
హిందీ బిగ్ బాస్ 17 దాదాపు పూర్తి కావస్తోంది. ప్రస్తుతం 95 రోజుకు ఈ సీజన్ చేరుకుంది. తాజాగా చివరి నామినేషన్ ప్రక్రియ జరిగింది. తెలుగులో మాదిరి కాకుండా వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఒక టాస్క్ ఇచ్చి నామినేషన్ చేయమని బిగ్ బాస్ చెప్పాడు. ప్రస్తుతం హౌస్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వారిని రెండు గ్రూపులుగా విభిజించి టాస్క్‌లు పెట్టాడు. టాప్-5 లిస్ట్‌లో ఉంటారని అనుకున్న వారిలో నలుగురిని ఒక టీమ్‌లో బిగ్ బాస్ ఉంచాడు. ఆ నలుగురిని కూడా రెండు జంటలుగా ఉంచాడు. మున్నావర్, అరుణ్, అభిషేక్, మన్నారా చోప్రా గ్రూపు-Aలో ఉన్నారు. అంకిత, ఇషా,విక్కీ, ఆయేషా ఈ నలుగురు గ్రూప్-Bలో ఉన్నారు. గ్రూప్-ఏ వాళ్లు అందరూ దాదాపు టాప్-5 రీచ్ అయ్యే కంటెస్టెంట్లు.. గ్రూప్ -బీ సభ్యుల్లో ఉన్న విక్కీ, ఆయేషా ఎలిమినేట్ అవడం దాదాపు ఖాయం అయిపోయింది.. దీంతో ఎలాగైనా చివరి వారం ఎలిమినేషన్ తప్పించుకుంటే ఫైనల్ రేసులోకి ఎంట్రీ ఇవ్వచ్చు అని తాజాగా బిగ్ బాస్ పెట్టిన టాస్క్‌లో విక్కీ, అయేషా చాలా ఎక్స్ట్రీమ్కు వెళ్లారు. దీంతో మన్నారా చోప్రా, అభిషేక్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చివరి వారంలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ గేమ్‌లో భాగంగా అక్కడ ఒక బజర్‌ను బిగ్ బాస్ ఏర్పాడు చేశాడు. ఆ బజర్‌ను నొక్కి పట్టుకున్నంత సేపు అక్కడ ఒక లైట్ వెలుగుతుంది. బజర్ నుంచి చెయి తీసేస్తే ఆ లైట్ ఆఫ్ అయిపోతుంది. ఎవరు ఎంత సమయం పాటు బజర్‌ను నొక్కి పట్టుకుంటారనేది టాస్క్... ఆ సమయంలో ఆపోజిట్ టీమ్ వాళ్లు పలు ఇబ్బందులు క్రియేట్ చేవయవచ్చని బిగ్ బాస్ చెప్తాడు. అక్కడ గెలుస్తే టాప్-5 వెళ్తారు.. లేదంటే నామినేషన్ లిస్ట్‌లో ఉంటారని బిగ్ బాస్ చెప్తాడు. గేమ్‌లో భాగంగా మొదట గ్రూప్-ఏ నుంచి మన్నారా చోప్రా, అభిషేక్ జోడీగా టాస్క్ ప్రారంభిస్తారు. వీరిద్దరూ కూడా టాప్ -5 లిస్ట్‌లో దాదాపు ఖాయం అని చెప్పవచ్చు. వీరిద్దరూ జోడీగా బజర్‌ను నొక్కి పట్టుకుంటారు. ఆ సమయంలో వారిని ఇబ్బంది పెట్టేందుకు గ్రూప్- బీ నుంచి విక్కీ, అయేషా వస్తారు. వారిద్దరూ టాప్ -5 రేసులో లేరు.. చివరి వారంలో దాదాపు ఎలిమినేట్ అవడం ఖాయం అని వారికి కూడా తెలుసు. దీంతో ఎలాగైనా ఈ టాస్క్ గెలిచి టాప్-5లో చేరిపోవాలని వారిద్దరూ విచక్షణ కోల్పోయి టాస్క్‌లో ఎక్స్ట్రీమ్కు చేరుకుంటారు. బజర్ మీద చెయి పెట్టి ఉన్న మన్నారా చోప్రా, అభిషేక్ ముఖం మీద ఏకంగా కారం పొడి, కిచెన్‌లో ఉన్న మసాల పొడులు తీసుకొని వచ్చి పూస్తారు. అంతటితో ఆగకుండా నీటిలో కారం పొడి కలిపి వారి మొఖం మీద కొడుతారు. ఆ సమయంలో వారిద్దరూ అల్లాడిపోయారు. అలా సుమారు 29 నిమిషాల పాటు వారు భరించి బజర్ మీది నుంచి చేతిని తీసేస్తారు. చివరకు వారిద్దరూ మెడికల్ రూమ్‌కు వెళ్లి చికిత్స పొందారు. కొన్ని గంటల తర్వాత ఆగిపోయిన గేమ్ మళ్లీ ప్రారంభం అవుతుంది. ఆ సమయంలో విక్కీ, అయేషా ఎలా విచక్షణ కోల్పోయి కారం పొడి చల్లారో ఆ వీడియోను టీవీలో బిగ్ బాస్ చూపిస్తాడు. అప్పుడు బిగ్ బాస్ గ్రూప్-A వారికి ఒక ఆఫర్ ఇస్తాడు.. మీరు కూడా ఇలాగే కారం పొడి కొట్టి గేమ్ అడుతారా..? లేదా గ్రూప్ -B వారిని డైరెక్ట్‌గా నామినేట్ చేస్తారా..? అని అడుగుతాడు.. అప్పుడు గ్రూప్ ఏ వారు తాము ఈ గేమ్ ఆడలేమని చెప్పి గ్రూప్ బీ వారిని డైరెక్ట్‌గా నామినేట్ చేయమని బిగ్ బాస్‌ను కోరుతారు. దీంతో అంకిత, ఇషా, విక్కీ, ఆయేషా ఈ వారం నామినేషన్ లిస్ట్‌లో ఉన్నారు. విచక్షణ కోల్పోయి గేమ్ ఆడిన ఆయేషా, విక్కీ పట్ల నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి చర్య జరుగుతుంటే ఆపాల్సింది పోయి గేమ్‌ను కొనసాగించడం ఏంటి..? అని బిగ్ బాస్ టీమ్ పట్ల కూడా వారు ఫైర్ అవుతున్నారు. ఈ శనివారంలో హౌస్ట్ సల్మాన్ ఖాన్ ఈ అంశంపై ఎలా రియాక్ట్ అవుతాడో చూడాల్సి ఉంది. It was a tough one, uff! Thank you fam for the support and wishes 🙏💖 #MannaraChopra #BB #BB17 #Mannara #BiggBoss #biggBoss17 pic.twitter.com/rEn6PGdJ1B — Mannara Chopra (@memannara) January 17, 2024 #BiggBoss really wanted to show how much torture this Sherni #MannaraChopra went through compared to the boys #AbhishekKumar, #MunawarFaruqui & #ArunMashettey. #BB17 #BiggBoss17 #MunAra #MKJW pic.twitter.com/M6MjmTGOAh — dw🍼🍼 (@doodhwaali) January 17, 2024 View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) -
హిందీ 'బిగ్‌బాస్'లోకి తెలుగు హీరోయిన్.. ఆ డైరెక్టర్ ముద్దుపై క్లారిటీ
ప్రస్తుతం ఏ భాషలో చూసినా సరే 'బిగ్‌బాస్' షోనే నడుస్తోంది. తెలుగు, తమిళంలో 7వ సీజన్.. కన్నడలో 10వ సీజన్ ప్రసారమవుతోంది. తాజాగా హిందీలో 17వ సీజన్ మొదలైంది. అయితే హిందీ షోలో మన తెలుగు హీరోయిన్ ఓ కంటెస్టెంట్‌గా ఎంటరైంది. స్టేజీపై ఓ తెలుగు దర్శకుడు ముద్దు పెట్టిన విషయం గురించి మాట్లాడింది. ఇంతకీ అసలేం జరిగింది? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్) ప్రియాంక చోప్రా, పరిణితీ చోప్రాలకు బంధువైన మన్నారా చోప్రా.. తెలుగులోకి 'ప్రేమ గీమా జాన్తా నై' అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత జక్కన్న, తిక్క, రోగ్, సీత చిత్రాల్లో నటించింది. కానీ ఒక్కటంటే ఒక్క హిట్ అందుకోలేకపోయింది. ఈ మధ్య రాజ్ తరుణ్ 'తిరగబడరా సామి' సినిమాలో కీలక పాత్ర కోసం ఎంపికైంది. కొన్నిరోజుల ముందు జరిగిన ఈ మూవీ ఈవెంట్లో దర్శకుడు ఏఎస్ రవికుమార్.. పబ్లిక్‌లో మన్నారా బుగ్గపై ముద్దుపెట్టేశాడు. అప్పట్లో అందరూ ఈ సంఘటన గురించి తెగ మాట్లాడుకున్నారు. తాజాగా హిందీ 'బిగ్‌బాస్ 17'లో ఈమె కంటెస్టెంట్‌గా ఇచ్చింది. స్టేజీపై రాగానే ఈమె వెల్కమ్ చెప్పిన సల్మాన్.. ఆ ముద్దు గురించి అడిగాడు. దీనికి బదులిచ్చిన మన్నారా.. అది మీరనుకునే ముద్దు కాదని, ప్రేమపూర్వకంగా ఆయన తనకు పెక్ తరహా ముద్దు పెట్టారని చెప్పింది. అంతే తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చింది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' రతిక) -
చాలా బాగుందే...
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తిరగబడర సామీ’. ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లు. మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జేబీ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చాలా బాగుందే...’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా, చైతు సత్సంగి, లిప్సిక పాడారు. ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘తిరగబడర సామీ’. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రాలపై వచ్చే ‘చాలా బాగుందే..’ పాట మనసుని హత్తుకునే అద్భుతమైన మెలోడీగా సాగుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జవహర్ రెడ్డి యంఎన్. -
డైరెక్టర్ ముద్దుపై తొలిసారి రియాక్ట్ అయిన మన్నారా చోప్రా
హీరోయిన్ మన్నారా చోప్రాకు టాలీవుడ్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ మీడియా సమావేశంలో ముద్దు పెట్టడం.. ఆ వీడియో వైరల్ కావడంతో పాటు ఆయన భారీగా ట్రోలింగ్‌కు కూడా గురైయారు. ఇదే విషయంపై ఆయన ఇప్పటికే స్పందించారు. 'హీరోయిన్ మన్నారా చోప్రాకు, నాకు లేని నొప్పి మీకెందుకు' అంటూ మరోసారి చిల్లర కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.. (ఇదీ చదవండి: వెబ్‌సైట్స్ నుంచి సలార్ తొలగింపు.. డైనోసార్‌పై భారీ ఎఫెక్ట్) తాజాగ ఒక యూట్యూబ్ ఛానల్‌కు హీరోయిన్ మన్నారా చోప్రా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై ఆమె తొలిసారి స్పందించింది. ఆ సందర్భంలో డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ తప్పుగా అలా చేసి ఉంటారని తాను అనుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది. మొదటి నుంచి తనను ఆయన బేటీ బేటీ అంటూ పిలిచే వారని చెప్పింది. అంతే కాకుండా ఆమెను సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్నోసార్లు ఆయన మెచ్చుకున్నారని తెలిపింది. రాజ్ తరుణ్ హీరోగా 'తిరగబడరా సామీ' సినిమాలో తన పాత్రే లీడ్ హీరోయిన్లా ఉంటుందని ఆయన కితాబు ఇచ్చినట్లు మన్నారా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆయన ముద్దు పెట్టిన తర్వాత తాను వెళ్లిపోగానే అసలు అక్కడ ఏం జరుగుతోందో కూడా అర్థం కాలేదని తెలిపింది. ఈ వీడియోలో తన రియాక్షన్ చూస్తే ఎవరికైనా అర్ధం అవుతుందని చెప్పింది. తనకు ఇలా జరగడం ఇదే తొలిసారి అంటూ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ ప్రవర్తనను తప్పుగా అర్థం చేసుకోలేదని మన్నార చోప్రా వెల్లడించింది. బాలకృష్ణతో 'వీరభద్ర', గోపీచంద్‌తో 'యజ్ఞం', సాయిధరమ్ తేజ్‌తో 'పిల్లా నువ్వు లేని జీవితం' తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఏఎస్ రవికుమార్.. ఇప్పుడు రాజ్ తరుణ్ హీరోగా 'తిరగబడరా సామీ' సినిమా తీశాడు. ఇందులో హీరోయిన్ మన్నారా చోప్రా.. ఓ కీలక పాత్రలో నటించింది. Director kisses an actress earlier today!pic.twitter.com/JzyBbau45d — Manobala Vijayabalan (@ManobalaV) August 28, 2023 (ఇదీ చదవండి: సమంత - విజయ్‌ల మధ్య లిప్‌లాక్ సీన్స్ అవసరమా..?) -
హీరోయిన్‌కు ముద్దు.. ఘాటుగానే స్పందించిన డైరెక్టర్!
రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'తిరగబడరాసామీ'. ఈ చిత్రానికి ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు మేకర్స్. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్లో పలువురు చిత్ర యూనిట్ సభ్యులు కూడా పాల్గొన్నారు. (ఇది చదవండి: కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోన్న రాజ్ తరుణ్ హీరోయిన్!) ముద్దు సీన్‌తో వివాదం అయితే ఈ ఈవెంట్‌కు హాజరైన ప్రేక్షకులకు ఊహించని సంఘటన ఎదురైంది. ఈవెంట్‌కు హాజరైన హీరోయిన్ మన్నారా చోప్రాకు దర్శకుడు రవికుమార్ బహిరంగంగా ముద్దుపెట్టడం వివాదానికి దారితీసింది. ఆయన తీరుపై పలువురు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డైరెక్టర్ తీరును నెటిజన్స్ విమర్శించారు. కాగా.. గతంలో ఇలానే కాజల్ స్టేజీపై మాట్లాడుతుండగా సినిమాటోగ్రాఫర్ చోటా. కె. నాయుడు ముద్దుపెట్టేశాడు. మీకేం ఇబ్బంది? అయితే తాజాగా ఈ విషయంపై స్పందించారు. తాను హీరోయిన్‌కు ముద్దుపెట్టడంతో తప్పేంటని రవికుమార్ ప్రశ్నిస్తున్నారు. ఆమె పట్ల అప్యాయతతోనే అలా చేశానని చెప్పుకొచ్చారు. నా కూతురికి కూడా అలాగే ముద్దుపెడతా అంటూ వివరణ ఇచ్చారు. అయినా ఆమెకు, మా ఫ్యామిలీకి లేని ఇబ్బంది మీకేంటని నెటిజన్లను నిలదీశారాయన. నా సినిమాలో మన్నారా చోప్రా ఆమె చేసిన వర్క్ నచ్చడం వల్లే అలా చేశానని రవికుమార్ వెల్లడించారు. ఏదేమైనా ఈవెంట్లో అందరిముందు అలా ముద్దులు పెట్టడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. (ఇది చదవండి: రాఖీ సంబురాల్లో కాబోయే మెగా కోడలు.. సోషల్ మీడియాలో వైరల్!) Director kisses an actress earlier today!pic.twitter.com/JzyBbau45d — Manobala Vijayabalan (@ManobalaV) August 28, 2023 -
పబ్లిక్‌లో హీరోయిన్‌కి ముద్దుపెట్టిన తెలుగు డైరెక్టర్
సినిమా హీరోయిన్లు బయటకు నవ్వుతూ కనిపించినా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. సెట్లో కావొచ్చు.. పబ్లిక్ ప్లేస్‌లో కావొచ్చు అభిమానులం అని చెప్పి, కొందరు వీళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. ఎంత అప్రమత్తంగా ఉన్నా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఓ తెలుగు దర్శకుడు పబ్లిక్‌గా హీరోయిన్‌కి ముద్దుపెట్టేశాడు. (ఇదీ చదవండి: 'సలార్' కోసం ఆ సాహసం చేస్తున్న శ్రుతి హాసన్) బాలకృష్ణతో 'వీరభద్ర', గోపీచంద్‌తో 'యజ్ఞం', సాయిధరమ్ తేజ్‌తో 'పిల్లా నువ్వు లేని జీవితం' తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఏఎస్ రవికుమార్.. ఇప్పుడు రాజ్ తరుణ్ హీరోగా 'తిరగబడరా సామీ' సినిమా తీశాడు. ఇందులో హీరోయిన్ మన్నారా చోప్రా.. ఓ కీలక పాత్రలో నటించింది. తాజాగా సినిమా ప్రమోషన్స్ నిర్వహించగా, దానికి చిత్రబృందం హాజరయ్యారు. ఈవెంట్ అయిపోయిన తర్వాత ఫొటోలకు పోజులిస్తుండగా హీరోయిన్ మన్నారా చోప్రా అనుమతి లేకుండా ఆమెకు ముద్దుపెట్టేశాడు. ఆమె నవ్వేసి ఊరుకుంది గానీ వీడియో చూస్తుంటే మాత్రం కాస్త ఇబ్బందిగా ఫీలైనట్లు అనిపిస్తోంది. దీంతో నెటిజన్స్.. సదరు డైరెక్టర్ తీరుపై విమర్శిస్తున్నారు. గతంలో ఇలానే కాజల్ స్టేజీపై మాట్లాడుతుండగా సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు ముద్దుపెట్టేశాడు. (ఇదీ చదవండి: ఆ రూమర్స్‌పై స్పందించిన నాగచైతన్య.. అవన్నీ!) Director kisses an actress earlier today!pic.twitter.com/JzyBbau45d — Manobala Vijayabalan (@ManobalaV) August 28, 2023 -
కామెడీ అనుకున్నా.. మాస్‌లా ఉంది
‘‘తిరగబడర సామీ’ కామెడీ సినిమా అనుకున్నా. కానీ, టీజర్ చూస్తుంటే ఫుల్ మాస్ సినిమాలా ఉంది. రాజ్ తరుణ్ యాక్షన్ ఇరగదీసినట్లు కనిపిస్తోంది. రాజ్ తరుణ్, రవి కుమార్‌కి ఇది మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుంది. టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. రాజ్ తరుణ్ హీరోగా, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లుగా ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన చిత్రం ‘తిరగబడర సామీ’. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియాపై మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని ‘దిల్’ రాజు విడుదల చేశారు. రాజ్ తరుణ్ మాట్లాడుతూ– ‘‘రవికుమార్ చౌదరిగారు ఈ సినిమాతో నాలో కొత్త కోణం (యాక్షన్) చూపించారు. సినిమా చాలా బాగా వచ్చింది.. ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు. ‘‘కొన్నేళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో నాకు మళ్లీ పునర్జన్మ ఇచ్చిన శివకుమార్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు ఏఎస్ రవికుమార్ చౌదరి. ‘‘త్వరలో రిలీజ్ కానున్న మా సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు మల్కాపురం శివకుమార్. నిర్మాత బెక్కం వేణుగోపాల్, దర్శకుడు సముద్ర, నటుడు తాగుబోతు రమేష్ తదితరులు మాట్లాడారు. -
యాక్షన్.. కామెడీ.. ఎక్కడా తగ్గవు
‘‘తిరగబడర సామీ’ చిత్రం మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. రవికుమార్‌గారి గత సినిమాల్లానే ఈ మూవీలోనూ యాక్షన్, కామెడీ, రొమాన్స్ ఎక్కడా తగ్గకుండా ఉంటాయి. మా సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి’’ అని రాజ్ తరుణ్ అన్నారు. ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా, మాల్వీ మల్హోత్రా, మన్నారా చో్ప్రాహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘తిరగ బడర సామీ’. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ లొకేషన్లో చిత్ర యూనిట్ మీడియాతో సమావేశం అయ్యింది. ఏఎస్ రవికుమార్ చౌదరి మాట్లాడుతూ– ‘‘ఎలాగైనా మళ్లీ హిట్టు కొట్టాలని కొంత విరామం తీసుకొని కసితో చేసిన సినిమా ‘తిరగబడర సామీ’. ఒక బంధాన్ని నిలుపుకోవడం కోసం ప్రేమికులు, భార్యా భర్తలు ఎంతవరకూ వెళ్తారు? అనేది వినోదాత్మకంగా చూపించాం’’ అన్నారు. ‘‘ఈ నెలాఖరులో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు మల్కాపురం శివకుమార్. -
తిరగబడరా...
రాజ్ తరుణ్ హీరోగా, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా కథానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘తిరగబడరా సామీ’. ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ని డైరెక్టర్ వీవీ వినాయక్ విడుదల చేసి, సినిమా మంచి విజయం సాధించాలని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జేబీ, కెమెరా: జవహర్ రెడ్డి. -
నగరంలో హలీమ్ సందడి...
-
మన్నారా చోప్రా తాజా ఫోటోలు
-
డిజైన్ లైబ్రరీ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన నటి మన్నారా చోప్రా
-
‘హై లైఫ్ ఎగ్జిబిషన్’ లో అలరించిన మోడల్స్
-
మన్నారా చోప్రా గ్లామర్ ఫోటోలు
-
డబ్బే ప్రధానం కాదు
‘జీవితంలో డబ్బే ప్రధానం కాదు.. కుటుంబం, సుఖసంతోషాలే ముఖ్యం’ అని తెలియజెప్పే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘హై 5’. మన్నారా చోప్రా లీడ్ రోల్ చేస్తున్నారు. ‘రణం’ ఫేమ్ అమ్మరాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. రాధ క్యూబ్ బ్యానర్‌పై రాధారాజశేఖర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్లో భాగంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మన్నారా చోప్రాపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ‘అమ్మ’ రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘మ్యూజికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న చిత్రమిది. గోపీచంద్‌తో ‘రణం’ తర్వాత మళ్లీ అంతటి వైవిధ్యమైన కథాంశంతో నా భార్య నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. ఇందులో 12 పాటలుంటాయి. ఐదుగురు సంగీత దర్శకులు పని చేస్తున్నారు. మాటల్ని పాటల్లా మార్చి నేటి తరానికి తగ్గట్టు పూర్తి వినోదభరితంగా రూపొందిస్తున్నాం. గోవాలోని చిన్న దీవిలో ఓ సెట్ వేసి కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ జరిపాం. ఈ సినిమాలో చిన్న సందేశంతో పాటు వినోదం కూడా ఉంటుంది’’ అన్నారు. ‘‘మంచి మసాలా పాటలతో ఈ సినిమా ఉంటుంది. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. ఈ సినిమాతో నా కోరిక నెరవేరింది’’ అన్నారు మన్నారా చోప్రా. ‘‘గురువారం షూటింగ్‌తో చిత్రీకరణ ముగిసింది. జనవరిలో ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు రాధారాజశేఖర్. ‘‘అమ్మ రాజశేఖర్ వద్ద సహాయకుడిగా పనిచేశా. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఈ సినిమాకు నృత్యాలు సమకూర్చా’’ అన్నారు నత్య దర్శకుడు ప్రశాంత్. అమ్మ రాజశేఖర్, జాస్మిన్, జబర్దస్త్ బ్యాచ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ముజీర్ మాలిక్, సంగీతం: తమన్. -
‘సీత’ ప్రీ రిలీజ్ వేడుక
-
దీపావళి వేడుకలో మనారా చోప్రా
-
పీవీపీలో మన్నర చోప్రా సందడి
విజయవాడ(లబ్బీపేట) : ఇటీవల విడుదలైన జక్కన సినిమాలోని నటి మన్నర చోప్రా గురువారం నగరంలోని పీవీపీ మాల్లో సందడి చేసింది. అక్కడ అప్పో ఎఫ్ 1ఎస్ మొబైల్‌ను ఆవిష్కరించేందుకు వచ్చిన ఆమెను చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపారు. మన్నర చోప్రా అప్పో ఎఫ్ 1ఎస్ మొబైల్‌ను ఆవిష్కరించి, ఆ మొబైల్‌తో సెల్ఫీ తీసి సందడి చేసింది. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకూ తాను చూసిన మొబైల్స్‌లో అప్పో ఎఫ్ 1ఎస్ అద్భుతంగా ఉందన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో సెల్ఫీలో చక్కటి ఆనందాన్ని ఈ ఫోన్ అందిస్తుందన్నారు. కెమెరా ఫోన్ టెక్నాలజీలో అప్పో అత్యుత్తమంగా ఉందన్నారు. కార్యక్రమంలో అప్పో జీఎం రే, హెడ్ కిమ్, డిస్ట్రిబ్యూటర్ భరత్‌కుమార్ పాల్గొన్నారు.