ఆ హీరోయిన్ నన్ను కావాలనే కొట్టింది.. బాడీపై 30 చోట్ల గాయాలు: శ్రద్ధా దాస్ | Shraddha Das Reveals That Mannara Chopra Hit Her Hard With Sticks In Zid Movie Shooting, Deets Inside - Sakshi
Sakshi News home page

Shraddha Das: నా ఛాతిపై పదేపదే గుద్దింది.. దెబ్బకు హాస్పిటల్‌లో చేర్పించారు

Published Sat, Jan 27 2024 6:02 PM | Last Updated on Sun, Jan 28 2024 8:29 AM

Mannara Chopra And Shraddha Das Issue In Zid Movie Shooting - Sakshi

తెలుగులో బిగ్‌బాస్ షో పూర్తయి దాదాపు నెలరోజులు పైనే అయిపోయింది. కానీ హిందీలో మాత్రం ప్రస్తుతం 17వ సీజన్ నడుస్తోంది. ఈ ఆదివారం ఫినాలే ఎపిసోడ్ జరగనుంది. అయితే కప్ కొట్టే రేసులో ఆరుగురు ఫైనలిస్టులు ఉండగా.. వీరిలో హీరోయిన్ మన్నార్ చోప్రా కూడా ఉంది. అయితే ఈమెతో హీరోయిన్ శ్రద్ధా‌దాస్ గతంలో గొడవ పడింది. బిగ్‌బాస్ ఫినాలే సందర్భంగా ఇది మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ అప్పట్లో ఏం జరిగింది? శ్రద్ధా దాస్ ఇప్పుడేం చెప్పింది?

(ఇదీ చదవండి: పూర్ణతో సంబంధం అంటగడుతున్నారు.. దర్శకుడి ఆవేదన)

అసలేంటి గొడవ?
ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు కజిన్ సిస్టర్ మన్నారా చోప్రా. 2014లో 'ప్రేమ గీమా జాన్తా నై' అనే మూవీతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. అదే ఏడాది హిందీలో 'జిద్' అనే సినిమా కూడా చేసింది. ఇందులో మన్నారాతో పాటు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన శ్రద్ధా దాస్ కూడా నటించింది. షూటింగ్ టైంలో వీళ్లిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. సన్నివేశాలు తీస్తున్నప్పుడు శ్రద్ధాని మన్నారా నిజంగానే కొట్టేసింది.

'ఓ సీన్‌లో మెట్లపై నన్ను నెమ్మదిగా తోయాలి. కానీ మన్నారా బలంగా తోసేసింది. నాకు మెట్లు గట్టిగా తగిలేశాయి. సరేలే నటనకు కొత్త కదా తెలియదేమో అనుకున్నాను. నెమ్మదిగా పుష్ చేయ్ అని మరీమరీ చెప్పాను. కానీ తర్వాత సీన్‌లో నాపై మరింతగా రెచ్చిపోయి నన్ను గట్టిగా కొట్టడం మొదలుపెట్టింది. నేను ఆపాలని చూశాను గానీ కుదర్లేదు. ఓ వైపు నుంచి డైరెక్టర్ కట్ చెబుతున్నాసరే మన్నారా అలా గుద్దుతూనే ఉంది. చివరకు ఆపింది గానీ అప్పటికే నా శరీరంపై 30 చోట్లకు పైనే గాయాలయ్యాయి'

(ఇదీ చదవండి: స్టార్ హీరో కాపురంలో చిచ్చు.. హీరోయిన్‌కి వార్నింగ్ ఇచ్చిన భార్య?)

'మరో సీన్‌లో నా ఛాతిపై నెమ్మదిగా పంచ్ ఇవ్వాలి. కానీ సీన్ వివరిస్తున్నప్పుడు అన్నింటికీ సరే అని సమాధానమిచ్చింది. కానీ సీన్ చేసేటప్పుడు మాత్రం నిజంగానే గట్టిగా గుద్దేసింది. ఇంకో ఫైట్ సీన్‌లో డమ్మీ స్టిక్ బదులు నిజమైన కర్రతో ఎడాపెడా బాదేసింది. దీంతో నా కుడి కంటికి గాయమై గట్టిగా అరిచాను. ఈ క్రమంలోనే నన్ను హాస్పిటల్‌లో కూడా చేర్చారు' అని శ్రద్దా దాస్ అప్పట్లో చెప్పుకొచ్చింది. తాజాగా ఈ గొడవపై మరోసారి శ్రద్ధాని ప్రశ్నించగా.. ఆ విషయం గురించి మాట్లాడటానికి నిరాకరించింది. తన జీవితాన్ని రిస్క్‌లో పెట్టదలుచుకోలేనని శ్రద్ధా దాస్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.

ఇకపోతే తెలుగులో జక్కన్న, సీత, తిక్క, రోగ్ తదితర సినిమాల‍్లో మన్నారా చోప్రా నటించింది గానీ ప్రతిదీ ఒకదాని మించి మరొకటి డిజాస్టర్‌గా నిలిచాయి. మరోవైపు శ్రద్దా దాస్ మాత్రం తొలుత హీరోయిన్ గా చేసింది. ఇ‍ప్పుడు సహాయ పాత్రల్లో చేస్తోంది. మరోవైపు టీవీ షోలు కూడా చేస్తోంది. అయితే వీళ్లిద్దరి గొడవ గురించి ఇప్పుడు తెలుసుకున్న తెలుగు ప్రేక్షకులు అవాక్కవుతున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement