sraddha das
-
ఆ హీరోయిన్ నన్ను కావాలనే కొట్టింది.. బాడీపై 30 చోట్ల గాయాలు: శ్రద్ధా దాస్
తెలుగులో బిగ్‌బాస్ షో పూర్తయి దాదాపు నెలరోజులు పైనే అయిపోయింది. కానీ హిందీలో మాత్రం ప్రస్తుతం 17వ సీజన్ నడుస్తోంది. ఈ ఆదివారం ఫినాలే ఎపిసోడ్ జరగనుంది. అయితే కప్ కొట్టే రేసులో ఆరుగురు ఫైనలిస్టులు ఉండగా.. వీరిలో హీరోయిన్ మన్నార్ చోప్రా కూడా ఉంది. అయితే ఈమెతో హీరోయిన్ శ్రద్ధాదాస్ గతంలో గొడవ పడింది. బిగ్‌బాస్ ఫినాలే సందర్భంగా ఇది మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ అప్పట్లో ఏం జరిగింది? శ్రద్ధా దాస్ ఇప్పుడేం చెప్పింది? (ఇదీ చదవండి: పూర్ణతో సంబంధం అంటగడుతున్నారు.. దర్శకుడి ఆవేదన) అసలేంటి గొడవ? ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు కజిన్ సిస్టర్ మన్నారా చోప్రా. 2014లో 'ప్రేమ గీమా జాన్తా నై' అనే మూవీతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. అదే ఏడాది హిందీలో 'జిద్' అనే సినిమా కూడా చేసింది. ఇందులో మన్నారాతో పాటు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన శ్రద్ధా దాస్ కూడా నటించింది. షూటింగ్ టైంలో వీళ్లిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. సన్నివేశాలు తీస్తున్నప్పుడు శ్రద్ధాని మన్నారా నిజంగానే కొట్టేసింది. 'ఓ సీన్లో మెట్లపై నన్ను నెమ్మదిగా తోయాలి. కానీ మన్నారా బలంగా తోసేసింది. నాకు మెట్లు గట్టిగా తగిలేశాయి. సరేలే నటనకు కొత్త కదా తెలియదేమో అనుకున్నాను. నెమ్మదిగా పుష్ చేయ్ అని మరీమరీ చెప్పాను. కానీ తర్వాత సీన్లో నాపై మరింతగా రెచ్చిపోయి నన్ను గట్టిగా కొట్టడం మొదలుపెట్టింది. నేను ఆపాలని చూశాను గానీ కుదర్లేదు. ఓ వైపు నుంచి డైరెక్టర్ కట్ చెబుతున్నాసరే మన్నారా అలా గుద్దుతూనే ఉంది. చివరకు ఆపింది గానీ అప్పటికే నా శరీరంపై 30 చోట్లకు పైనే గాయాలయ్యాయి' (ఇదీ చదవండి: స్టార్ హీరో కాపురంలో చిచ్చు.. హీరోయిన్‌కి వార్నింగ్ ఇచ్చిన భార్య?) 'మరో సీన్లో నా ఛాతిపై నెమ్మదిగా పంచ్ ఇవ్వాలి. కానీ సీన్ వివరిస్తున్నప్పుడు అన్నింటికీ సరే అని సమాధానమిచ్చింది. కానీ సీన్ చేసేటప్పుడు మాత్రం నిజంగానే గట్టిగా గుద్దేసింది. ఇంకో ఫైట్ సీన్లో డమ్మీ స్టిక్ బదులు నిజమైన కర్రతో ఎడాపెడా బాదేసింది. దీంతో నా కుడి కంటికి గాయమై గట్టిగా అరిచాను. ఈ క్రమంలోనే నన్ను హాస్పిటల్లో కూడా చేర్చారు' అని శ్రద్దా దాస్ అప్పట్లో చెప్పుకొచ్చింది. తాజాగా ఈ గొడవపై మరోసారి శ్రద్ధాని ప్రశ్నించగా.. ఆ విషయం గురించి మాట్లాడటానికి నిరాకరించింది. తన జీవితాన్ని రిస్క్‌లో పెట్టదలుచుకోలేనని శ్రద్ధా దాస్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. ఇకపోతే తెలుగులో జక్కన్న, సీత, తిక్క, రోగ్ తదితర సినిమాల్లో మన్నారా చోప్రా నటించింది గానీ ప్రతిదీ ఒకదాని మించి మరొకటి డిజాస్టర్‌గా నిలిచాయి. మరోవైపు శ్రద్దా దాస్ మాత్రం తొలుత హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు సహాయ పాత్రల్లో చేస్తోంది. మరోవైపు టీవీ షోలు కూడా చేస్తోంది. అయితే వీళ్లిద్దరి గొడవ గురించి ఇప్పుడు తెలుసుకున్న తెలుగు ప్రేక్షకులు అవాక్కవుతున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?) -
నడుము అందాలతో ఆ ఇద్దరు.. శ్రద్దా దాస్ మాత్రం ఓరకంట చూస్తూ!
వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి క్యూట్‌నెస్‌తో చంపేస్తున్న బిగ్‌బాస్ 7 ఫేమ్ శుభశ్రీ నాజూకు నడుముతో టెంప్ట్ చేస్తున్న తేజస్వి ప్రకాశ్ మత్తెక్కించే చూపులతో 'జైలర్' బ్యూటీ మిర్నా కాటుక కళ్లతో భయపెడుతున్న హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ మేకప్ లేకుండా అందాల విందు చేస్తున్న పూనమ్ బజ్వా రెడ్ డ్రస్‌లో మహేశ్ భార్య నమ్రత గ్లామర్ ట్రీట్ కారిడార్‌లో విచిత్రమైన డ్రస్‌తో పోజులిచ్చిన మెహ్రీన్ View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by Tejasswi Prakash (@tejasswiprakash) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Shailaja Priya Machiraju (@priyaartist) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Shama Sikander (@shamasikander) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Uorfi (@urf7i) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) -
అనుపమ స్పెషల్ పచ్చబొట్టు.. విష్ణుప్రియని ఇలా చూస్తే మాత్రం!
వంగి మరీ అందాలు చూపిస్తున్న యాంకర్ విష్ణుప్రియ షైనింగ్ ఔట్ ఫిట్‌లో ధగధగా మెరిసిపోతున్న శివాత్మిక బిగ్‌బాస్ భాను శ్రీ బ్లాక్ డ్రస్సులో వయ్యారాలు వెకేషన్లో చిల్ అవుతున్న యాంకర్ రష్మీ గౌతమ్ టూర్ ఫొటోలు పోస్ట్ చేసిన హీరోయిన్ ప్రణీత హాట్నెస్ పెంచి మరి టెంప్ట్ చేస్తున్న అనుపమ సండే స్పెషల్.. అలాంటి స్టిల్స్‌తో రెచ్చగొడుతున్న మలైకా ఎద అందాలతో మెల్ట్ చేస్తున్న హాట్ బ్యూటీ దిశా పటానీ ఆరెంజ్ డ్రస్‌లో వావ్ అనిపిస్తున్న శ్రద్ధాదాస్ View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Bhanu shree (@iam_bhanusri) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
మెట్లపై దిశా.. కుర్చీపై శ్రద్ధా.. మధ్యలో ఈషా!
బ్లాక్ డ్రస్‌లో మత్తెక్కిస్తున్న దిశా పటానీ చీరకట్టులో దివ్యభారతి హాట్ వయ్యారాలు కుర్చీపై ఉంటూనే శ్రద్ధాదాస్ అందాల విందు డిజైనర్ చీరలో ఒంపుసొంపులు చూపిస్తున్న అనన్య పరువాలతో రాజసం లాంటి లుక్‌లో ఐశ్వర్యా రాజేశ్ పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న ఐటమ్ బ్యూటీ ఈషా గుప్తా మెరుపుల చీరలో 'జైలర్' బ్యూటీ మిర్నా మేనన్ కొండల మధ్య సముద్రంలో 'సామజవరగమన' బ్యూటీ View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) -
ఆర్జీవీ ఐడియాలజీ మీదే సినిమా ఉంటుంది
‘‘రామ్‌గోపాల్ వర్మగారు ఒకప్పుడు జీనియస్. ‘శివ’ టైమ్‌లో తనని అభిమానించేవాళ్లం. అయితే ప్రస్తుతం ఆయన ఐడియాలజీ వల్ల సమాజానికి నష్టం. మా ‘ఆర్జీవీ’ సినిమాలో ఆయన్ని విమర్శించడమో, ఆయన్ని కామెడీ పాత్రగా చూపించడమో చేయలేదు. మా చిత్రం కేవలం ఆయన ఐడియాలజీ మీదే ఉంటుంది’’ అని నిర్మాత శ్రీనివాస్ అన్నారు. ‘కార్తికేయ, కథలో రాజకుమారి’ వంటి చిత్రాలు నిర్మించిన ఆయన తాజాగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్జీవీ’ (రోజూ గిల్లే వాడు). సురేశ్, ఆనంద్, రాశి, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రల్లో జొన్నవిత్తుల రచనా దర్శకత్వంలో తెరకెక్కుతోంది. నిర్మాత శ్రీనివాస్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ నేను నిర్మించిన ‘కార్తికేయ’ సినిమాకి రెండు నంది అవార్డులతో పాటు సైమా అవార్డు వచ్చింది. ఆ తర్వాత ‘కథలో రాజకుమారి’ సినిమాని నేను అనుకున్నట్టు తీయకపోవడంతో హిట్ కాలేదు. అయితే ఆ సినిమా నాకు నష్టం కలిగించలేదు. ‘ఆర్జీవీ’ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయింది. సెప్టెంబరులో చిత్రీకరణ ప్రారంభించి జనవరిలో సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నాం. 4 కోట్ల బడ్జెట్‌తో మా సినిమా రూపొందుతోంది. ఇంత బడ్జెట్ సినిమా కాబట్టి థియేటర్లోనే విడుదల చేయాలనుకుంటున్నాం. మంచి కథ ఉంటే ఓటీటీ కూడా కొంచెం బెస్టే. కచ్చితంగా థియేటర్లు ప్రారంభమవుతాయనుకుంటున్నాం.. కాకుంటే ఓటీటీలో విడుదల చేస్తాం. మా ‘ఆర్జీవీ’ చిత్రంలోని మొదటి పాట ‘ఓడ్కామీద ఒట్టు..’ 20 లక్షల వ్యూస్ సాధించింది. ఈ పాట విడుదల తర్వాత ఇండస్ట్రీకి చెందిన చాలామంది నాకు, జొన్నవిత్తులగారికి ఫోన్ చేసి డేరింగ్ స్టెప్ తీసుకున్నారని అభినందించారు. ఈ చిత్రంలోని రెండో పాటను ఆదివారం అర్ధరాత్రి 12గంటలకు మణికొండలోని మర్రిచెట్టు వద్ద విడుదల చేస్తున్నాం. నా తర్వాతి సినిమా హీరో రాజశేఖర్‌గారితో ఉంటుంది’’ అన్నారు. -
బేడీలు వేస్తాం!
పువ్వులు పట్టుకున్న ముద్దుగుమ్మల చేతులు లాఠీలు పట్టుకున్నాయి. తమ పెర్ఫార్మెన్స్తో థియేటర్స్‌లో ప్రేక్షకుల మనసులను లాక్ చేయాలని ఈ ముద్దుగుమ్మలు తమలోని అదర్ సైడ్‌ని చూపించడానికి రెడీ అయిపోయారు. సీరియస్ అండ్ సిన్సియర్ పోలీసాఫీసర్లుగా కనిపించి, విలన్లను రప్ఫాడించడానికి సిద్ధమైన ఆ హీరోయిన్ల గురించి తెలుసుకుందాం. ‘నిశ్శబ్దం’ చిత్రం కోసం ఆమెరికా పోలీసాఫీసర్ అవతారం ఎత్తారు అంజలి. ఈ గెటప్‌లో సెట్ కావాలని దాదాపు ఎనిమిది కిలోల బరువు కూడా తగ్గారామె. ఇటీవల ఈ సినిమాలో అంజలి పాత్ర చిత్రీకరణ మొదలైంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో నాలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క, మాధవన్, షాలినీ పాండే, మైఖేల్ మ్యాడ్సన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఇక ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో గ్లామరస్‌గా రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్ ఇటీవల పోలీసాఫీసర్‌గా చార్జ్ తీసుకున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పాయల్ రాజ్‌పుత్, రాయ్ లక్ష్మి, రేవతి, జ్యోతిక అటు చెన్నైకి వెళితే హీరోయిన్లు జ్యోతిక అండ్ రేవతి ఇద్దరూ కలిసి ఒకే పోలీస్‌స్టేషన్‌లో డ్యూటీ చేస్తున్నారు. వీరిద్దరి డ్యూటీ ‘జాక్‌పాట్’ అనే తమిళం సినిమా కోసం. ఈ సినిమాకు కల్యాణ్ దర్శకత్వం వహించారు. తమిళంలో మరో భామ పోలీస్‌గా కనిపించబోతున్నారు. ఆమె ఎవరో కాదు.. నటి, డాటరాఫ్ శరత్‌కుమార్. ఓ డాగ్‌ని వెంటపెట్టుకుని పోలీసాఫీర్‌గా ఓ కేసును దర్యాప్తు చేస్తున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. ఆమె ఇన్విస్టిగేషన్ రిపోర్ట్‌ను ‘డానీ’ సినిమాలో చూడాలి. ఈ కేసును సంతానమూర్తి డైరెక్ట్ చేస్తున్నారు. తెలుగులో పలు చిత్రాల్లో గ్లామరస్ హీరోయిన్గా కనిపించిన రాయ్ లక్ష్మి ఇప్పుడు కన్నడంలో ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా ఓ సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నారు. ఆమె స్కెచ్ హీరో సుదీప్ కోసమే. పోలీస్‌గా ఆమె వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటో ‘కోటిగొబ్బ 3’ సినిమాలో తెలుస్తుంది. మొన్నామధ్య ఫైటింగ్, ఫైరింగ్ గట్రా నేర్చుకున్నారు హీరోయిన్ రాయ్‌లక్ష్మీ. ఇంత కష్టపడింది ఆమె కన్నడ చిత్రం ‘ఝాన్సీ’లో పోలీస్ గెటప్ వేయడం కోసమే. పీవీఆర్ గురుప్రసాద్ ఈ చిత్రానికి డైరెక్టర్. సౌత్‌లోనే కాదు.. బాలీవుడ్ భామలు కొందరు పోలీస్‌సైరన్ మోగిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ సినిమాతో సౌత్‌కు పరిచయం అవుతున్నారు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్. ఈ సినిమాలో శ్రద్ధాది పోలీస్ పాత్రే అని ఆల్రెడీ విడుదలైన ‘సాహో’ టీజర్ చెబుతోంది. ‘అంగ్రేజీ మీడియం’ సినిమా కోసం గన్ పట్టుకున్నారు కరీనా కపూర్. ఈ సినిమాకు హోమి అడ్జానియా దర్శకుడు. ఇర్ఫాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. ముంబైలో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని మళ్లీ శివానీ శివాజీ రాయ్‌గా డ్యూటీ చేస్తున్నారు రాణీ ముఖర్జీ. శివాజీ రాయ్ అనగానే ‘మర్దానీ’ చిత్రం గుర్తుకు వచ్చే ఉంటుంది. ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ సినిమా సీక్వెల్ ‘మర్దానీ 2’లో రాణీముఖర్జీ నటిస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌కి కథ అందించిన∙గోపీ పుత్రన్ సీక్వెల్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. వరలక్ష్మి, రాణీ ముఖర్జీ, కరీనా కపూర్ -
కల నిజమాయె
ఇండస్ట్రీలోకి కాలు పెట్టిన యాక్టర్స్ అందరికీ ఏదో ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది. అలాగే కథానాయికగా శ్రద్ధాదాస్ కూడా పోలీస్ క్యారెక్టర్‌ను డ్రీమ్ రోల్‌గా భావించారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పదేళ్ల తర్వాత ఆమె అనుకున్న డ్రీమ్ రోల్లో నటించే అవకాశం వచ్చింది. సుదీప్ హీరోగా శివకార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కోటిగొబ్బ 3’. సూరపబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హీరో సుదీప్‌నే కథ అందించడం విశేషం. ఇందులో ఇంటర్‌పోల్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు శ్రద్ధాదాస్. ఈ సినిమా షూటింగ్ సెర్బియాలోని బెల్గ్రేడ్లో ఈ నెల 17న మొదలు కానుంది.‘‘నా డ్రీమ్ రోల్ చేయబోతున్నా. పోలీసాఫీసర్ పాత్ర చేసే చాన్స్ రావడం, సుదీప్ సార్ హీరోగా నటిస్తున్న సినిమాకి అవకాశం రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు శ్రద్ధా. నాగన్న దర్శకత్వంలో రూపొంది న ‘కోటిగొబ్బ’ ఫస్ట్ పార్ట్‌లో విష్ణువర్థన్ హీరోగా నటించారు. ‘కోటిగొబ్బ 2’లో హీరోగా నటించిన సుదీప్ 3లో కూడా చేస్తున్నారు. -
అలాంటి లీడర్నే ఎన్నుకోండి..
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో పౌరులకు ఓటే ఏకైక ఆయుధం. ఎంతో విలువైన ఆ ఓటు వృథా కాకుండా సమర్థులైన నేతలనే ఎన్నుకోవాలి. ఒక్క ఓటు కూడా మురిగిపోకుండా, ప్రజలకు మంచి చేసే నాయకుడికే పట్టం కట్టాలి. నాకు తెలిసి ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు గానీ ప్రజలకు ఉపయోగపడే లీడర్ మాత్రం లేడు. అటువంటి లీడర్నే ప్రజలు ఎన్నుకోవాలి. . మరో ముఖ్య విషయం... చాలామందికి ఓటు విలువ తెలియకో, నిర్లక్ష్యంతోనో, బయటకు వెళ్లేందుకు బద్ధకంతోనో ఓటింగ్‌కు దూరంగా ఉంటారు. ప్రజాస్వామ్యంలో ఇది చాలా ప్రమాదకర ధోరణి. ఈసారి అలా కాకూడదు.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. మన భవిష్యత్తును తీర్చిదిద్దే పాలకులను ఎన్నుకునే అవకాశాన్ని ఏ ఒక్కరూ చేజార్చుకోవద్దు. - శ్రద్ధా దాస్, హీరోయిన్