అలాంటి లీడర్‌నే ఎన్నుకోండి..
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో పౌరులకు ఓటే ఏకైక ఆయుధం. ఎంతో విలువైన ఆ ఓటు వృథా కాకుండా సమర్థులైన నేతలనే ఎన్నుకోవాలి. ఒక్క ఓటు కూడా మురిగిపోకుండా, ప్రజలకు మంచి చేసే నాయకుడికే పట్టం కట్టాలి. నాకు తెలిసి ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు గానీ ప్రజలకు ఉపయోగపడే లీడర్ మాత్రం లేడు. అటువంటి లీడర్‌నే ప్రజలు ఎన్నుకోవాలి.
. మరో ముఖ్య విషయం... చాలామందికి ఓటు విలువ తెలియకో, నిర్లక్ష్యంతోనో, బయటకు వెళ్లేందుకు బద్ధకంతోనో ఓటింగ్‌కు దూరంగా ఉంటారు. ప్రజాస్వామ్యంలో ఇది చాలా ప్రమాదకర ధోరణి. ఈసారి అలా కాకూడదు.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. మన భవిష్యత్తును తీర్చిదిద్దే పాలకులను ఎన్నుకునే అవకాశాన్ని ఏ ఒక్కరూ చేజార్చుకోవద్దు. - శ్రద్ధా దాస్, హీరోయిన్