మాల్వీ మల్హోత్రా, రాజ్ తరుణ్
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తిరగబడర సామీ’. ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లు. మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జేబీ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చాలా బాగుందే...’ అంటూ సాగే పాటని విడుదల చేశారు.
ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా, చైతు సత్సంగి, లిప్సిక పాడారు. ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘తిరగబడర సామీ’. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రాలపై వచ్చే ‘చాలా బాగుందే..’ పాట మనసుని హత్తుకునే అద్భుతమైన మెలోడీగా సాగుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జవహర్ రెడ్డి యంఎన్.
Comments
Please login to add a commentAdd a comment