హీరోయిన్‌తో అసభ్య ప్రవర్తన.. అత్యంత చెత్త అంటూ! | Mannara Chopra Tweet Akasa Air Staff For Being Rude When She Was Not Well | Sakshi
Sakshi News home page

Mannara Chopra: 'మీరు చాలా బాగా నటిస్తున్నారు'.. మన్నారా చోప్రాకు మరోసారి!

Published Sun, Feb 18 2024 5:20 PM | Last Updated on Sun, Feb 18 2024 5:44 PM

Mannara Chopra Tweet Akasa Air Staff For Being Rude When She Was Not Well - Sakshi

గతంలో  డైరెక్టర్‌తో ముద్దు సీన్‌తో పెద్ద ఎత్తున వైరలైన హీరోయిన్ మన్నారా  చోప్రా.  ఓ ఈవెంట్‌కు హాజరైన ఆమెకు టాలీవుడ్ డైరెక్టర్‌ ఏఎస్ రవికుమార్ అందరి ముందే ముద్దు పెట్టి ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. అప్పట్లో ఆ వీడియో సంచలనంగా మారింది. పెద్దఎత్తున వైరల్‌ కావడంతో పాటు ఆయన భారీగా ట్రోలింగ్‌కు కూడా గురయ్యారు. కాగా.. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ హిందీ బిగ్ బాస్ సీజన్‌-17లో మెరిసింది. అంతే కాదు టాప్‌-3 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచింది.  

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించారని తెలిపింది. నేను ప్రయాణించిన అత్యంత చెత్త ఎయిర్‌లైన్స్ ఇదే.. ఇలా జరగడం నాకు రెండోసారని పేర్కొంది. గతంలో ఒకసారి నా బ్యాగ్‌ను డ్యామేజ్ చేశారని.. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా మళ్లీ దురుసుగా ప్రవర్తించారని వెల్లడించింది. ఈ విషయాన్ని తన ట్విటర్‌ ద్వారా పంచుకుంది. అయితే మన్నారా చోప్రా ట్వీట్‌కు విమానయాన సంస్థ స్పందించింది. "

మన్నారా ట్వీట్‌పై ఎయిర్‌లైన్స్ . "మన్నారా.. మీకు కలిగిన ఇబ్బందికి మేము చింతిస్తున్నాం. మా బృందం విమానాశ్రయంలోనే అదనపు బ్యాగేజీ రుసుము విధానాన్ని వివరించిందని అర్థం చేసుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు మీ రుసుమును మాఫీ చేయలేము. ఈ విషయంలో మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. అలాగే మీకు ఇంతకు ముందు ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం. దయచేసి మాకు ఆ వివరాలను పంపించండి"  అంటూ రిప్లై ఇచ్చింది. 

దీనికి మన్నారా చోప్రా బదులిస్తూ.. "ఏం వ్రాస్తున్నారు సార్.. మీ సిబ్బంది నాతో అసభ్యంగా, దురుసుగా ప్రవర్తించారు. ఈ రోజు ఉదయం నాకు ఆరోగ్యం బాగాలేదు. మీ ఉద్యోగితో ఈ విషయాన్ని ప్రస్తావించా. మీరు చాలా బాగా నటిస్తున్నారు.. వెళ్లి మా మేనేజర్‌తో మాట్లాడండని దురుసుగా ప్రవర్తించింది. కనీసం మీ మేనేజర్ వచ్చి సమస్యను అర్థం చేసుకునే పని కూడా చేయలేదు." అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

కాగా.. మన్నారా థ్రిల్లర్ జిద్‌ అనే మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం తెలుగులో రాజ్ తరుణ్ సరసన తిరగబడరా సామీ చిత్రంలో కనిపించనుంది. ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ సీజన్‌ -17లో మూడోస్థానంలో నిలిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement