పుష్ప-2 ఎఫెక్ట్.. సైలెంట్‌గా పోటీ నుంచి తప్పుకున్న రష్మిక! | Rashmika Mandanna's 'Chhaava' Movie New Release Date Announced | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: పుష్ప-2 ఎఫెక్ట్.. సైలెంట్‌గా పోటీ నుంచి తప్పుకున్న రష్మిక మూవీ!

Published Thu, Nov 28 2024 1:17 PM | Last Updated on Thu, Nov 28 2024 1:35 PM

Rashmika Mandanna's 'Chhaava' Movie New Release Date Announced

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం పుష్ప-2 ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఇటీవల చెన్నై, కొచ్చిలో జరిగిన ఈవెంట్లలో మెరిసింది. మరో వారం రోజుల్లో పుష్ప-2 విడుదల కానుండగా మేకర్స్ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే రష్మిక టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ వరుస సినిమాలు చేస్తోంది. గతేడాది యానిమల్‌ మూవీలో మెరిసిన ముద్దుగుమ్మ.. ఛావా అనే చిత్రంలో నటిస్తోంది.

బాలీవుడ్‌ విక్కీ కౌశల్‌, రష్మిక మందన్నా జంటగా ఛావా మూవీని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ముందుగా అనుకున్న ప్రకారం డిసెంబర్‌ 6న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. అయితే ఒక్క రోజు ముందే డిసెంబర్‌ 5న పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్న సంగతి తెలిసిందే.

పోటీనుంచి తప్పుకున్న ఛావా

దీంతో పుష్ప-2తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడాల్సి వస్తోంది. ‍అయితే ఈ విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పుష్ప-2తో పోటీపడడం కంటే వాయిదా వేయడమే మేలని భావించారు. అల్లు అర్జున్‌ మూవీ పుష్ప-2 క్రేజ్ దృష్ట్యా పోటీపడి నిలవడం కష్టమేనని మేకర్స్ భావించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 6న విడుదల చేస్తే బాక్సాఫీస్ వద్ద చావుదెబ్బ ఖాయమని మేకర్స్ జాగ్రత్తపడ్డారు.  అందుకే ఛావాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్ చేశారు.

ఫిబ్రవరిలోనే ఎందుకంటే?

తాజాగా ఛావా మూవీని ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు తెలిపారు. 2025 ఫిబ్రవరి 19 శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో రష్మిక నటిస్తోంది. ఇప్పటికే ఛావా టీజర్‌ రిలీజ్‌ కాగా ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement