rude
-
అంత బలుపు వద్దు.. ఓలా సీఈవోపై నెటిజన్ల ఫైర్!
ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ మాట తీరుపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ వేదికగా కమెడియన్ కునాల్ కమ్రాపై భవిష్ అగర్వాల్ చేస్తున్న వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయంటూ సోషల్ మీడియా యూజర్లు విరుచుకుపడుతున్నారు.భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. షోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకుంటున్నారు. ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల సర్వీస్ సెంటర్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ వాగ్వాదం ప్రారంభమైంది. ఓలా సర్వీస్ సెంటర్లో పెద్ద సంఖ్యలో ఈవీ స్కూటర్లున్న ఫొటోను కమ్రా షేర్ చేస్తూ కామెంట్ పెట్టడంతో వివాదం మొదలైంది.ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కునాల్ కమ్రా పెట్టిన పోస్టులకు ‘ఇది పెయిడ్ పోస్టు’.. ‘నువ్వు సంపాదించలేనంత డబ్బు ఇస్తా’.. అంటూ తలపొగరుగా ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ స్పందించిన తీరు.. ప్రయోగించిన పదాలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: సీఈవో అయినా డెలివరీ బాయ్‌గా వెళ్తే అంతే..అగర్వాల్ వర్సెస్ కమ్రా మాటల యుద్ధం వ్యవహారంలో చాలా మంది ఓలా కస్టమర్లతోపాటు నెటిజన్లు సైతం కమ్రాకు మద్దతుగా నిలుస్తున్నారు. భవిష్ మాట తీరుపై చీవాట్లు పెడుతున్నారు. ఓలా సర్వీస్ ఎంత చెత్తగా ఉందో చెప్పేందుకు మంచి కమెడియనే కావాల్సిన అవసరం లేదంటూ ఒక యూజర్ స్పందించారు. ఈ అహంకారం నిర్లక్ష్య ధోరణి నుంచి వచ్చిందని, దీనికి బుద్ధి చెప్పాలని మరో యూజర్ కామెంట్ చేశారు. ‘ఎంత అహంకారివి నువ్వు. సంపదను చాటుకోవడం మానేయండి. అంతా పోగొట్టుకుని రోడ్లపైకి వచ్చిన ఇలాంటి అహంకార సీఈవోలు ఎందరో ఉన్నారు. మీ విఫలమైన ఉత్పత్తులు, సేవల నమూనాను పరిష్కరించడంపై దృష్టి పెట్టండి’ అంటూ ఒక నెటిజన్ ఘాటుగా రాసుకొచ్చారు.ఈ అంశంలో ఓలా రూపొందించిన ఏఐ ఫ్లాట్‌ఫామ్ కృత్రిమ్ కూడా భవిష్ అగర్వాల్‌నే తప్పుపట్టింది. భవిష్ అగర్వాల్, కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధంపై ఓ జర్నలిస్ట్ ఓలా కృత్రిమ్ ఏఐ స్పందనను కోరారు. అది అందించిన స్పందనను ‘ఎక్స్’లో షేర్ చేశారు. కమ్రా లేవనెత్తిన ఆందోళనపై భవిష్ స్పందించిన తీరు హుందాగా లేదంటూ బదులిచ్చింది. ఆందోళనలను గుర్తించి పరిస్థితి పట్ల సానుభూతి చూపాలని అగర్వాల్‌కు కృత్రిమ్ సలహా ఇచ్చింది. I asked OLA bro's AI for PR advice on the developing situation with @kunalkamra88.It clearly does not like the response OLA bro gave. 😆 pic.twitter.com/bX6FifrThO— meghnad (Nerds ka Parivaar) (@Memeghnad) October 6, 2024 -
హీరోయిన్‌తో అసభ్య ప్రవర్తన.. అత్యంత చెత్త అంటూ!
గతంలో డైరెక్టర్‌తో ముద్దు సీన్‌తో పెద్ద ఎత్తున వైరలైన హీరోయిన్ మన్నారా చోప్రా. ఓ ఈవెంట్‌కు హాజరైన ఆమెకు టాలీవుడ్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ అందరి ముందే ముద్దు పెట్టి ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. అప్పట్లో ఆ వీడియో సంచలనంగా మారింది. పెద్దఎత్తున వైరల్ కావడంతో పాటు ఆయన భారీగా ట్రోలింగ్‌కు కూడా గురయ్యారు. కాగా.. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ హిందీ బిగ్ బాస్ సీజన్-17లో మెరిసింది. అంతే కాదు టాప్-3 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌లైన్స్ సిబ్బంది తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించారని తెలిపింది. నేను ప్రయాణించిన అత్యంత చెత్త ఎయిర్‌లైన్స్ ఇదే.. ఇలా జరగడం నాకు రెండోసారని పేర్కొంది. గతంలో ఒకసారి నా బ్యాగ్‌ను డ్యామేజ్ చేశారని.. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా మళ్లీ దురుసుగా ప్రవర్తించారని వెల్లడించింది. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా పంచుకుంది. అయితే మన్నారా చోప్రా ట్వీట్‌కు విమానయాన సంస్థ స్పందించింది. " మన్నారా ట్వీట్‌పై ఎయిర్‌లైన్స్ . "మన్నారా.. మీకు కలిగిన ఇబ్బందికి మేము చింతిస్తున్నాం. మా బృందం విమానాశ్రయంలోనే అదనపు బ్యాగేజీ రుసుము విధానాన్ని వివరించిందని అర్థం చేసుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు మీ రుసుమును మాఫీ చేయలేము. ఈ విషయంలో మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. అలాగే మీకు ఇంతకు ముందు ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం. దయచేసి మాకు ఆ వివరాలను పంపించండి" అంటూ రిప్లై ఇచ్చింది. దీనికి మన్నారా చోప్రా బదులిస్తూ.. "ఏం వ్రాస్తున్నారు సార్.. మీ సిబ్బంది నాతో అసభ్యంగా, దురుసుగా ప్రవర్తించారు. ఈ రోజు ఉదయం నాకు ఆరోగ్యం బాగాలేదు. మీ ఉద్యోగితో ఈ విషయాన్ని ప్రస్తావించా. మీరు చాలా బాగా నటిస్తున్నారు.. వెళ్లి మా మేనేజర్‌తో మాట్లాడండని దురుసుగా ప్రవర్తించింది. కనీసం మీ మేనేజర్ వచ్చి సమస్యను అర్థం చేసుకునే పని కూడా చేయలేదు." అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. మన్నారా థ్రిల్లర్ జిద్ అనే మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం తెలుగులో రాజ్ తరుణ్ సరసన తిరగబడరా సామీ చిత్రంలో కనిపించనుంది. ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ సీజన్ -17లో మూడోస్థానంలో నిలిచింది. The worst airlines to travel with @AkasaAir .this is my second experience with them,first time I travelled they damaged my bag and this time I’m not feeling well they ended up being rude again — Mannara Chopra (@memannara) February 18, 2024 -
అర్థరాత్రి సీఐడీ సీఐ వీరంగం
-
అర్ధరాత్రి సీఐడీ సీఐ వీరంగం
విజయవాడ: ఓ పక్క ప్రభుత్వాలు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ఊదర కొడుతున్న కొందరు అధికారుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. ప్రజలకు సేవ చేయాల్సిన ఓ ఉన్నతాధికారే అడ్రస్ అడిగితే చెప్పలేదనే కోపంతో ఓ పౌరుడిపై విరుచుకుపడిన సంఘటన విజయవాడలో శనివారం అర్ధరాత్రి వెలుగుచూసింది. వివరాలు.. ఏలూరు రోడ్డులోని రామమందిరం వద్ద నిల్చొని ఉన్న భాను అనే యువకుడిని మఫ్టీలో ఉన్న సీఐడీ సీఐ రామచంద్రరావు ఓ అడ్రస్ అడిగాడు. దీనికి ఆ యువకుడు తనకు అడ్రస్ తెలియదని కావాల్సి వస్తే.. గూగుల్ మ్యాప్‌లో చూసుకోవాలని ఓ ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో సదరు సీఐ గారికి చిర్రెత్తుకొచ్చింది. నాకే సలహా ఇస్తావా అంటూ అతని పై ముష్టిఘాతాలు కురిపించాడు. పోలీస్ జులుం చూపిస్తూ.. జీపులో వేసి చితకబాదాడు. ఇది గుర్తించిన స్థానికులు యువ కుడిని రక్షించేందుకు ప్రయత్నించగా.. అప్రమత్తమైన సీఐ స్థానిక సూర్యారావుపేట పోలీసులను పిలిపించుకొని వారి రక్షణలో అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నాడు. అంతటితో ఆగకుండా.. తన్నులు తిన్న యువకుడిని కూడా స్టేషన్‌కు తీసుకెళ్లి తనదైన స్టైల్లో బెదిరించి మీడియా కంట పడకుండా పంపేశాడు.