యాక్షన్‌.. కామెడీ.. ఎక్కడా తగ్గవు | Thiragabadara Saami Movie Press Meet | Sakshi
Sakshi News home page

యాక్షన్‌.. కామెడీ.. ఎక్కడా తగ్గవు

Aug 3 2023 5:42 AM | Updated on Aug 3 2023 5:42 AM

Thiragabadara Saami Movie Press Meet - Sakshi

‘‘తిరగబడర సామీ’ చిత్రం మంచి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. రవికుమార్‌గారి గత సినిమాల్లానే ఈ మూవీలోనూ యాక్షన్, కామెడీ, రొమాన్స్‌ ఎక్కడా తగ్గకుండా ఉంటాయి. మా సినిమాని థియేటర్‌లో చూసి ఎంజాయ్‌ చేయాలి’’ అని రాజ్‌ తరుణ్‌ అన్నారు. ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో రాజ్‌ తరుణ్‌ హీరోగా, మాల్వీ మల్హోత్రా, మన్నారా చో్ప్రాహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘తిరగ బడర సామీ’.

సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ లొకేషన్‌లో చిత్ర యూనిట్‌ మీడియాతో సమావేశం అయ్యింది. ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి మాట్లాడుతూ– ‘‘ఎలాగైనా మళ్లీ హిట్టు కొట్టాలని కొంత విరామం తీసుకొని కసితో చేసిన సినిమా ‘తిరగబడర సామీ’. ఒక బంధాన్ని నిలుపుకోవడం కోసం ప్రేమికులు, భార్యా భర్తలు ఎంతవరకూ వెళ్తారు? అనేది వినోదాత్మకంగా చూపించాం’’ అన్నారు. ‘‘ఈ నెలాఖరులో లేదా సెప్టెంబర్‌ మొదటి వారంలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు మల్కాపురం శివకుమార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement