నాన్నకు ఆమే సరైన జోడీ | Gautham Karthik opens up about 'Agni Natchathiram' remake | Sakshi
Sakshi News home page

నాన్నకు ఆమే సరైన జోడీ

Published Wed, Jun 14 2017 7:38 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM

నాన్నకు ఆమే సరైన జోడీ

నాన్నకు ఆమే సరైన జోడీ

నాన్న కార్తీక్‌కు నటి నగ్మా సరైన జోడీ అని ఆయన కొడుకు, యువ నటుడు గౌతమ్‌ కార్తీక్‌ అన్నారు. కడల్‌ చిత్రం ద్వారా ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం పరిచయం చేసిన నటుడు గౌతమ్‌ కార్తీక్‌. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా సరైన గుర్తింపు రాలేదు. తాజాగా గౌతమ్‌ కార్తీక్‌ నటించిన రంగూన్‌ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ప్రస్తుతం ఇవన్‌ తందిరన్‌ చిత్రంలో నటిస్తున్నారు శ్రద్ధా కథానాయకి. కండేన్‌ కాదలై చిత్రం ఫేమ్‌ ఆర్‌.కన్నన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎంకే.రామ్‌ ప్రసాద్‌తో కలిసి ఆయనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం రెండురోజుల క్రితం చెన్నైలో జరిగింది.

నటుడు గౌతమ్‌ కార్తీక్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సరైన తరుణంలో విలేకరులతో మాట్లాడాలని భావించానన్నారు. అందుకు ఇది సరైన తరుణం అనిపించిందన్నారు. తాను నటించిన రంగూన్‌ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడటం సంతోషంగా ఉందన్నారు. సిపాయ్, ఇవన్‌ తందిరన్, హరహర మహాదేవకీ చిత్రాలను పూర్తి చేశానని, ప్రస్తుతం విజయ్‌సేతుపతితో కలిసి నల్ల నాళ్‌ పార్తు సొల్రేన్‌ చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు. నాన్న కార్తీక్‌ నటించిన చిత్రాల్లో అగ్నినక్షత్రం మంచి కథా చిత్రం అని పేర్కొన్నారు. ఆ చిత్రం రీమేక్‌లో నటించనని అన్నారు. తనకు నటనపై ఆసక్తి కలిగించిన చిత్రం కడల్‌ అని పేర్కొన్నారు. తనకు ఎప్పుడైతే నిసత్తు కలిగి ఉంటానో అప్పుడు తనను ఉత్సాహపరిచేది అమ్మేనన్నారు. అమ్మంటే తనకు చాలా ఇష్టం అని అన్నారు.

ఇకపోతే తనది కచ్చితంగా ప్రేమ వివాహమే అవుతుందన్నారు. అయితే 35–40 వయసులోనే పెళ్లి చేసుకోవాలన్నది తన భావన అని పేర్కొన్నారు. తన తండ్రి, తాత చిత్రాలను తప్పకుండా చూస్తున్నానని చెప్పారు. నటుడిగా నాన్న లెజెండ్‌ అని పేర్కొన్నారు. షూటింగ్‌ స్పాట్‌లో ఆయన గురించి చెబుతున్నప్పుడు తనకు అర్థమైందని అన్నారు. కథానాయికల్లో ఆయనకు సరైన జోడీ నగ్మా, రేవతి అని అన్నారు.ఇకపై నటనలో మరింత శ్రద్ధ చూపుతానని గౌతమ్‌కార్తీక్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement