
సినిమా అంటే రంగుల ప్రపంచం. ఈ రంగంలో ఒక్కసారి ఫేమ్ వచ్చిందంటే చాలు.. అవకాశాలు కూడా అలా వెతక్కుంటూ వస్తాయి. అయితే అదే క్రేజ్ కెరీర్ మొత్తం ఉంటుందనుకోవడం పొరపాటే. ముఖ్యంగా హీరోయిన్ల విషయానికొస్తే ఈ పరిస్థితి కాస్తా భిన్నంగా ఉంటుంది. ఒకసారి గుర్తింపు వచ్చినా.. దాన్ని కెరీర్ మొత్తం నిలబెట్టుకోవడం కష్టమే. అలా మొదట స్టార్ హీరోయిన్లుగా ఫేమ్ తెచ్చుకున్న కొందరు స్టార్స్ తర్వాత తెరపై పెద్దగా కనిపించలేదు. అలాంటి వారి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకీ స్టార్ డమ్ నుంచి కనుమరుగైన నటీమణులెవరో మీరు చూసేయండి.
అమ్మా, నాన్న ఓ తమిళ అమ్మాయి..
తెలుగులో రవితేజ సరసన అమ్మా, నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంలో మెప్పించిన కోలీవుడ్ భామ ఆసిన్. తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో నటించింది. అంతేకాకుండా స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆమె తన కెరీర్ తమిళంలో పోక్కిరి, కావలన్, తెలుగులో లక్ష్మీ నరసింహ, రెడీ, ఘర్షణ, హిందీలో గజిని, హౌస్‌ఫుల్ 2 వంటి భారీ విజయాలు దక్కించుకుంది. అంతేకాకుండా ఆసిన్, ఫిల్మ్‌ఫేర్, సైమా లాంటి అనేక అవార్డులను గెలుచుకుంది. తన కెరీర్‌లో అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తన 2015 నుంచి చిత్ర పరిశ్రమ నుండి పూర్తిగా కనుమరుగైంది.
అజిత్ భార్య శాలిని..
తొలి రోజుల్లో బేబీ శాలినిగా గుర్తింపు పొందిన శాలిని అజిత్ కుమార్. 1980లలో మలయాళం, తమిళ సినిమాల్లో నటించింది. ఎంటే మమట్టిక్కుట్టియమ్మక్కు, టీవీ సిరీస్ అమ్లూ వంటి చిత్రాలలో బాలనటిగా మెప్పించింది. అంతేకాకుండా పలు క్లాసిక్ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కానీ 2000 ఏడాదిలో నటుడు అజిత్ కుమార్‌ను వివాహం చేసుకున్న తర్వాత వెండితెరపై కనిపించలేదు. 2002 తర్వాత నటనకు పూర్తిగా దూరమైంది.
నగ్మా
తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటి నగ్మా. 1990లో తమిళం, తెలుగు, హిందీ, భోజ్‌పురి సినిమాల్లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో ఘరనా మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి అల్లుడు లాంటి హిట్ సినిమాల్లో కనిపించింది. తమిళంలో కాదలన్, బాషా, మెట్టుకుడి, తమిళంలో చతురంగం, చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. కానీ 2008లో తన సినీ కెరీర్‌లో దూసుకెళ్తున్న సమయంలోనే నగ్మా రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది.
గోపిక
మలయాళంలో స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్న నటి గోపిక. ముఖ్యంగా ఫోర్ ది పీపుల్ అనే మలయాళ చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా గోపిక తనదైన ముద్ర వేసింది. రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ మూవీలో అభిమానులను మెప్పించింది. అయితే 2008లో వివాహం తర్వాత గోపిక సినీ పరిశ్రమను పూర్తిగా విడిచిపెట్టేసింది.
తెలుగులో స్టార్ హీరోయిన్..
రంభ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఆమె అసలు పేరు విజయలక్ష్మి యీది కాగా.. సినిమాలతో వచ్చిన గుర్తింపు వల్ల రంభగా మార్చుకుంది. 1990ల్లో దక్షిణ భారత సినీ పరిశ్రమలో స్టార్గా ఎదిగింది. అరుణాచలం, ఉల్లతై అల్లిత, క్రానిక్ బ్యాచిలర్ వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ చిత్రాలలో ప్రేక్షకులను అలరించింది. తెలుగులో భైరవ ద్వీపం, బంగారు కుటుంబం, హిట్లర్, గణేష్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు కూడా ఉన్నాయి. చిత్ర పరిశ్రమలో విజయవంతంగా దూసుకెళ్తోన్న రంభ 2011లో నటనకు ఎండ్ కార్డ్ ఇచ్చేసింది.
Comments
Please login to add a commentAdd a comment