gopika
-
నిశ్చితార్థం ఒకరితో-పెళ్లి మరొకరితో.. మలయాళ నటి వివాహం (ఫొటోలు)
-
Lok sabha elections 2024: శ్రీకృష్ణుని గోపికను నేను: హేమమాలిని
మథుర(యూపీ): గోపాలకృష్ణుని 16 వేల గోపికల్లో ఒకరినంటూ సినీ నటి హేమమాలిని తనను తాను అభివర్ణించుకున్నారు. మథురలో బీజేపీ అభ్యరి్థగా బరిలోకి దిగిన హేమమాలిని గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘గోపికల్లో ఒక గోపికగా నన్ను నేను ఊహించుకుంటాను. మథుర చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన బ్రిజ్వాసులంటే శ్రీకృష్ణునికి ఎంతో ప్రేమ, అభిమానం. అందుకే బ్రిజ్వాసులను ఇష్టంతో సేవిస్తే కృష్ణ భగవానుని ఆశీస్సులు లభిస్తాయని నా నమ్మకం. అందుకే వారికి విశ్వాసంతో సేవ చేస్తున్నా’అని ఆమె అన్నారు. పేరు, ప్రఖ్యాతుల కోసమో, మరే ఇతర భౌతిక లాభాపేక్షతోనో రాజకీయాల్లోకి రాలేదన్నారు. మథుర చుట్టుపక్కల 84 కోసుల పరిధి(252 కిలోమీటర్లు)లోని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని చెప్పారు. -
Gopika Govind: బొగ్గు అమ్మే అమ్మాయి ఎయిర్ హోస్టెస్
కేరళలో కేవలం పదిహేను వేల మంది ఉండే గిరిజనులు ‘కరింపలనులు’. పోడు వ్యవసాయం, కట్టెబొగ్గు చేసి అమ్మడం వీరి వృత్తి. అలాంటి సమూహం నుంచి ఒకమ్మాయి ‘ఎయిర్‌హోస్టెస్’ కావాలనే కల కంది. కేరళలో అప్పటి వరకూ గిరిజనులు ఎవరూ ఇలాంటి కలను కనలేదు. 12 ఏళ్ల వయసులో కలకంటే 24 ఏళ్ల వయసులో నిజమైంది. పరిచయం చేసుకోండి కేరళ తొలి గిరిజన ఎయిర్‌హోస్టెస్‌ని. కేరళలోని కన్నూరు, కోజికోడ్ జిల్లాల్లో కనిపించే అతి చిన్న గిరిజన తెగ‘కరింపలనులు’. వీళ్లు మలయాళంలో తుళు పదాలు కలిపి ఒక మిశ్రమ భాషను మాట్లాడతారు. అటవీ భూమిని లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తారు. లేదంటే అడవిలోని పుల్లల్ని కాల్చి బొగ్గు చేసి అమ్ముతారు. గోపికా గోవింద్ ఇలాంటి సమూహంలో పుట్టింది. అయితే ఈ గిరిజనులకు ఇప్పుడు వ్యవసాయం కోసం అటవీభూమి దొరకడం లేదు. కట్టెలు కాల్చడాన్ని ఫారెస్టు వాళ్లు అడ్డుకుంటూ ఉండటంతో బొగ్గు అమ్మకం కూడా పోయింది. చిన్నప్పుడు అమ్మా నాన్న చేసే ఈ పని చూస్తూ పెరిగిన గోపికా ఇక్కడతో ఆగడమా... అంబరాన్ని తాకడమా అంటే అంబరాన్ని తాకడమే తన లక్ష్యం అని అనుకుంది. డిగ్రీ తర్వాత బిఎస్సీ చదివిన గోపిక ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ కావాలంటే అవసరమైన కోర్సు గురించి వాకబు చేసింది. ప్రయివేటు కాలేజీలలో దాని విలువ లక్షల్లో ఉంది. కూలి పని చేసే తల్లిదండ్రులు ఆ డబ్బు కట్టలేరు. అందుకని ఎం.ఎస్సీ కెమిస్ట్రీ చేరింది. చదువుతున్నదన్న మాటేకాని ఎయిర్ హోస్టెస్ కావడం ఎలా... అని ఆలోచిస్తూనే ఉంది. సరిగ్గా అప్పుడే ఐ.ఏ.టి.ఏ (ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్) వాళ్ల కస్టమర్ సర్వీస్ కోర్సును గవర్నమెంట్ స్కాలర్షిప్ ద్వారా చదవొచ్చని తెలుసుకుంది. ఎస్.టి విద్యార్థులకు ఆ స్కాలర్షిప్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. అప్లై చేసింది. స్కాలర్షిప్ మంజూరు అయ్యింది. గోపిక రెక్కలు ఇక ముడుచుకు ఉండిపోలేదు. లక్ష రూపాయల కోర్సు వాయనాడ్‌లోని డ్రీమ్ స్కై ఏవియేషన్ అనే సంస్థలో ఎయిర్ హోస్టెస్ కోర్సును స్కాలర్షిప్ ద్వారా చేరింది గోపిక. చదువు, బస, భోజనం మొత్తం కలిపి లక్ష రూపాయలను ప్రభుత్వమే కట్టింది. మలయాళ మీడియం లో చదువుకున్న గోపిక ఎయిర్ హోస్టెస్‌కు అవసరమైన హిందీ, ఇంగ్లిష్‌లలో కూడా తర్ఫీదు అయ్యింది. కోర్సు పూర్తి చేసింది. ఒకసారి ఇంటర్వ్యూకు వెళితే సెలెక్ట్ కాలేదు. రెండోసారి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలో ఎయిర్ హోస్టెస్‌గా ఎంపికయ్యింది. విమానం ఎప్పుడూ ఎక్కని గోపిక విమానంలోనే ఇక పై రోజూ చేసే ఉద్యోగం కోసం తిరువనంతపురం నుంచి ముంబైకి ట్రైనింగ్ కోసం వెళ్లింది. అక్టోబర్‌లో ఆమె కూడా యూనిఫామ్ వేసుకుని విమానంలో మనకు తారస పడొచ్చు. ఆమె కలను ఆమె నెరవేర్చుకుంది. ఇక మీ వంతు. 8వ క్లాసు కల గిరిజనులు విమానాన్ని గాల్లో ఎగురుతుంటే చూస్తారు తప్ప ఎక్కలేరు. గోపికా గోవింద్ కూడా చిన్నప్పుడు ఆకాశంలో ఎగిరే విమానాన్ని ఉత్సాహంగా, వింతగా చూసేది. అందులో ఎక్కడం గురించి ఆలోచించేది. 8వ క్లాసుకు వచ్చినప్పుడు ఒక పేపర్లో ఎర్రటి స్కర్టు, తెల్లటి షర్టు వేసుకున్న ఒక చక్కటి అమ్మాయి గోపికా కంట పడింది. ఎవరా అమ్మాయి అని చూస్తే ‘ఎయిర్ హోస్టస్’ అని తెలిసింది. విమానంలో ఎగురుతూ విధి నిర్వహణ. ఇదేకదా తనకు కావాల్సింది అనుకుంది. కాని ఎవరికైనా చెప్తే నవ్వుతారు. బొగ్గులమ్ముకునే వాళ్ల అమ్మాయికి ఎంత పెద్ద కల అనుకుంటారు. అందుకని సిగ్గుపడింది. తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. కాని కల నెరవేర్చుకోవాలన్న కలను మాత్రం రోజురోజుకు ఆశ పోసి పెంచి పెద్ద చేసుకుంది. -
గురు దీపిక
గోపిక ఆంటీ... నిజామాబాద్ పట్టణంలో ఈ తరం యువతులకు ఒక కరదీపిక. వృత్తి విద్యల్లో కెరీర్‌ను వెతుక్కోవాలనుకునే వాళ్లకు, కుటీర పరిశ్రమలతో ఉపాధి పొందాలనుకునే వాళ్లకు ఆమె ఒక గైడ్. ప్రభుత్వం రూపొందించిన పథకాలను అట్టడుగున ఉన్న మహిళలకు చేరవేస్తున్న వారధి. ఈ తరం మహిళకూ గడచిన తరం మహిళకూ మధ్య దూరాన్ని చెరిపి వేసి రెండు తరాలను దగ్గర చేసిన సంధాన కర్త. ముప్పై ఏళ్ల కిందటి సమాజానికి ఇప్పటి సమాజానికి మధ్య స్పష్టమైన తేడాను గమనించానన్నారామె. ‘‘నాకిప్పుడు అరవై ఏళ్లు. ముప్పై ఏళ్ల కిందట మహిళ అనే పదానికి గృహిణి అనే పదానికి పెద్ద తేడా ఉండేది కాదు. దాదాపుగా మహిళలందరూ గృహిణులే. వ్యాపారం, ఉద్యోగం కోసం బయటకు వెళ్లే భర్త కోసం ఉదయమే లేచి వండి పెట్టి, పిల్లలను చూసుకుంటూ ఇంటి పట్టున ఉండడమే చాలా మంది మహిళలకు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్. ఇది మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి. పెద్ద చదువులు చదువుకుని ఉద్యోగాలకు వెళ్లే వాళ్ల సంఖ్య కాలనీ మొత్తానికి కూడా వేళ్ల మీద లెక్కపెట్టేటంత తక్కవగానే ఉండేది. దిగువ మధ్య తరగతి, అల్పాదాయ వర్గాల మహిళలు విధిగా ఏదో ఒక పని చేస్తుండే వాళ్లు. మా దగ్గర మహిళలు ఇంట్లో ఉండి చేసుకునే పని అంటే బీడీలు చుట్టడమే ప్రధానమైనది. ఆ రోజుల్లో నేను నాకంటూ ఏదో ఒక గుర్తింపు ఉండాలని కోరుకున్నాను. నాకు గౌరవాన్నిస్తూ పదిమందికి ఉపయోగపడే పని కోసం ప్రయత్నించాను. అప్పట్లో మాకు కంప్యూటర్, ఇంటర్నెట్ అంటే ఏమిటో తెలియదు. మనలో వృత్తి నైపుణ్యాలను పెంచుకోవడానికి ఇప్పుడు ఉన్నన్ని అవకాశాలు కూడా ఉండేవి కావు. అలాంటి రోజుల్లో టైలరింగ్, ఎంబ్రాయిడరీల్లో టెక్నికల్ ట్రైనింగ్ కోర్సు చేశాను. పది మంది ఉద్యోగులతో 2003లో సొంత యూనిట్ మొదలు పెట్టాను. మహిళలకు ఇలాంటి వృత్తుల్లో శిక్షణనిచ్చే అవకాశం నాకు వచ్చింది. అయితే అప్పట్లో మహిళలను చైతన్యవంతం చేయడానికి నేను గడపగడపా ఎక్కాల్సి వచ్చింది. ‘ఇంట్లోనే ఉండి బీడీలు చుట్టుకుంటున్నాం, గడపదాటకుండా పదోపరకో సంపాదించుకుంటున్నాం. ఇది చాలు’ అనే వాళ్లు. ఎంతగానో చెప్పిన తర్వాత కానీ వాళ్లు కొత్త పని నేర్చుకోవడానికి ఇంటి గడపదాటే సాహసం చేయలేకపోయారు. వాళ్లకు పనిలో శిక్షణ కంటే శిక్షణకు సన్నద్ధం చేయడమే పెద్ద శ్రమ. ఇప్పుడు పూర్తిగా భిన్నం. ఆడపిల్లలు తమంతట తాముగా వచ్చి ‘ఆంటీ! కొత్త బ్యాచ్‌లు ఎప్పుడు మొదలవుతాయి? ఏయే కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు? నేను ఈ ఎండాకాలం సెలవుల్లో శిక్షణ పూర్తి చేసుకోవచ్చా?’ అని అడుగుతున్నారు. తొలి అడుగు వేయడమే అత్యంత కష్టమైన పని. చిత్తశుద్ధితో ఆ పని చేయగలిగితే ఆ తర్వాత ప్రయాణం దానంతట అది సాగిపోతుంది. ఒకరి తర్వాత ఒకరుగా వచ్చి చేరి చిన్న ప్రయాణాన్ని మహాప్రస్థానంగా మార్చి వేస్తారు. ఇప్పుడు మా నిజామాబాద్‌లో నా దగ్గర నేర్చుకుని సొంతంగా యూనిట్లు పెట్టుకున్న వాళ్లే ఆరువందల మంది ఉన్నారు. నా దగ్గర మరో ఎనభై మంది పని చేస్తున్నారు. గురువుకు సన్మానం చేసిన మహిళలు మనల్ని మనం మార్చుకోవాలి ఒక పరిశ్రమ పెట్టే వరకు మన మీద మనకు పెద్దగా ఒత్తిడి ఉండదు. పరిశ్రమ బాధ్యత తలకెత్తుకున్న తర్వాత సమాజం మొత్తాన్ని ఒక కంట గమనిస్తూ ఉండాలి. కొత్తగా ఏం వస్తున్నాయో తెలుసుకోవాలి, మనం తయారు చేస్తున్న ఉత్పత్తుల పట్ల జనంలో మోజు తగ్గుతుంటే ఆ విషయాన్ని కూడా వెంటనే పసిగట్టగలగాలి. మార్పులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి. ఉదాహరణకు నేను కోర్సు చేసినప్పటికి టైలరింగ్, ఎంబ్రాయిడరీకి మంచి డిమాండ్ ఉండేది. ఇప్పుడు వాటిలోనే విపరీతమైన మార్పులు వచ్చాయి. అలాగే హస్తకళాకృతులకు ఆదరణ పెరిగింది. హైదరాబాద్‌లోని నాంపల్లి, శిల్పారామంలో ఎగ్జిబిషన్లలో స్టాల్ పెట్టాను. అక్కడ చూసిన కొత్త కళాకృతులను మా నిజామాబాద్‌కు పరిచయం చేశాను. ఆ ట్రైనర్లను తీసుకువచ్చి మా దగ్గర మహిళలకు ట్రైనింగ్ ఇప్పించాను. మా పుట్టిల్లు వరంగల్. అక్కడ జనపనార బాగా దొరుకుతుంది. ఆ నార నిజామాబాద్‌కు తెప్పించి మా వాళ్లకు జ్యూట్ టేబుల్ మ్యాట్లు, ఉట్టి, ఉయ్యాలల అల్లకం నేర్పించాను. ఏలూరులో తాటి ఆకు బుట్టలు, బ్యాగ్‌లు, కళాఖండాలు తయారు చేస్తారు. అవీ మేము నేర్చుకున్నాం. ఓ ఐదారేళ్లుగా జ్యూట్ బ్యాగ్‌ల తయారీ కూడా మొదలు పెట్టాం. అభివృద్ది పథం మహిళలు వృత్తి నైపుణ్యాలు పెంచుకుని స్వయం సహాయకంగా మారడంలో హైదరాబాద్‌లోని ఎన్ఐఆర్డి, ఖాదీ గ్రామోదయ మహా విద్యాలయ, బాలానగర్‌లోని ఎమ్ఎస్ఎమ్ఈ, నెహ్రూ యువ కేంద్ర శిక్షణ ప్రాజెక్టులు మాకు బాగా ఉపయోగపడ్డాయి. వాళ్లు సొంత యూనిట్లు పెట్టుకోవడానికి మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు ముద్ర రుణాలు దోహదం చేస్తున్నాయి. ఈ మహిళలు తమ ఆడబిడ్డలను పెద్ద చదువులు చదివించడానికి ముందుకు వస్తున్నారు. స్వయం సాధికారత సాధించిన అసలైన విజయం అది’’ అన్నారు గోపిక. ఇక ఆమె కుటుంబ వివరాలకు వస్తే... భర్త లెక్చరర్. ముగ్గురబ్బాయిలు. ఒకబ్బాయి యూఎస్‌లో, ఇద్దరు హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ‘‘పిల్లలు ముగ్గురూ కాలేజ్ చదువులకు హాస్టల్కెళ్లిన తర్వాత నేను సొంత యూనిట్ మొదలు పెట్టాను. దాంతో నా యూనిట్ ఎప్పుడూ నాతో ఉండే నాలుగో బిడ్డ అయింది’’ అన్నారు గోపిక. -
ఆదిమానవులు ఇతివృత్తంగా అరమ్వేట్రుమై
తమిళసినిమా: హాలీవుడ్ చిత్రం అపోకలిప్టో చిత్రం తరహాలో అరమ్ మేట్రుమై చిత్రం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు హరికృష్ణ అంటున్నారు. ఈయన తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్త్ సెన్స్ మూవీ మేకర్స్ పతాకంపై శక్తివేల్ నిర్మిస్తున్నారు. నూతన జంట అజయ్, గోపిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఇందులో యోగిబాబు, ఉమశ్రీ, అళగు, సూర్యకాంత్, చరణ్‌రాజ్, పరదేశీ భాస్కర్ ముఖ్యపాత్రలు పోషించారు. గణేశ్రాఘవేందర్ సంగీతాన్ని, అరివళగన్ ఛాయాగ్రహణం అందించారు. చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ, ఇది ఈ తరానికి చెందిన కథతో రూపొందించిన చిత్రం కాదన్నారు. సుమారు 900 ఏళ్ల క్రితానికి చెందిన ఆదిమానవుల జీవన విధానాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందని తెలిపారు. వారికి భాషే లేదని చెప్పారు. భాష, జాతి అంటే తెలియకుండా జీవించిన ఆదిమానవుల ఇతివృత్తంగా అరమ్ వేట్రుమై చిత్రం ఉంటుందని చెప్పారు. అలా మూడు కొండల్లో మూడు రకాల ఆదివాసుల జీవన విధానాన్ని ఎంతో వ్యయ ప్రాయాసాలకోర్చి రూపొందించామని తెలిపారు. కథపై నమ్మకంతో చిత్ర యూనిట్ అంతా కష్టపడి తమ ప్రయత్నానికి సహకరించారని అన్నారు. చిత్ర షూటింగ్‌ను నాగరికత చెందని అటవీ ప్రాంతాలను అన్వేషించి నిర్వహించామని చెప్పారు. ఇది హాలీవుడ్ చిత్రం అపోకలిప్టో చిత్రం తరహాలో చాలా వైవిధ్యంగా ఉంటుందని అన్నారు. చిత్ర నిర్మాణం పూర్తి అయ్యిందని, చిత్రాన్ని చూసిన శ్రీముత్తమిళ్ లక్ష్మీ మూవీమేకర్స్ అధినేత ఆర్.బాలచందర్ చాలా బాగుందని విడుదల హక్కులను పొందారని దర్శకుడు వెల్లడించారు. -
ప్రేమోపాసన
జ్యోతిర్మయం నంద వ్రజంలో ఒక గోపిక కొత్త ఇల్లు కట్టుకుంది. గృహ ప్రవేశానికి ఎందరో బంధువులు, ఆత్మీయులు వచ్చారు. వీళ్లేకాక ఆ గోపికకు ఎంతో ప్రియమైన ఒక ఇష్టసఖి కూడా బహుదూరం నుండి వచ్చింది. గృహ ప్రవేశానంతరం వాళ్లిద్దరూ యమునా నదీ స్నానానికి వెళ్లారు. జలకాలాడుతూ ఇష్టసఖి గోపికతో ‘చెలీ! నంద వ్రజంలో నివసించే మీరంతా ఎంతో అదృష్టవం తులు. శ్రీకృష్ణునితో రాసలీలలో పాల్గొనే మహద వకాశం మీకు ప్రాప్తించింది. అవునా!’ అని అన్నది. ‘నిజమే నేమో’ అన్నది గోపిక. ‘చెలీ రాసలీల జరిగిన ఆ ఒక్క రాత్రి ఆరు నెలల సాధా రణ రాత్రులతో సమానం అని అంటారు కదా! అంత సుదీర్ఘ కాలంలో శ్రీకృష్ణుడు ఎన్నిమార్లు తన బాహువల్లరిలో నిన్ను లాలించాడో చెప్పవా?’ అని అడిగింది కుతూహలంగా ఇష్టసఖి. గోపిక విలాసంగా నవ్వుతూ ‘సఖీ! రాసలీల తరగతి కాదు కదా, లెక్కల్నీ ఎక్కాల్నీ వల్లించటానికి! అది ఒక దుకాణం కాదు కదా, లెక్కలు సరిచూసుకోవ టానికి! శ్రీకృష్ణ ప్రేమ గణాంకాలకు అందేది కాదు. అది ఒక అలౌకికమైన దివ్య రసానుభూతి. స్వామి సన్నిధికి చేరగానే నాకు శరీర సృ్పహ నశించింది. అంతరంగం అంతరించిపోయింది. నా అహంభావం లీనమైపోయింది. నేను నేనుగా మిగలలేదు. ఇంక మిగిలింది పరమానందస్ఫూర్తియే! సత్‌చిత్ ఆనంద స్వరూపమే!’ అని అన్నది పరవశంగా. ‘అదృష్టవంతురాలివే చెలీ! ఆ దశకు చేరటానికి నువ్వు ఎంత జపాన్ని చేశావో? ఎన్ని వ్రతాల్ని అనుష్టిం చావో? ఎన్ని సత్కర్మల్ని చేశావో కదా!’ అని అన్నది ఇష్టసఖి. ‘సఖీ! నేనింత జపించాను, అంత ధ్యానిం చాను, ఇన్ని వ్రతాల్ని చేశాను అన్న లెక్కల్లో అహం ఉం టుంది. అహం ఉన్నంత కాలం స్వామి దక్కడు. స్వామి విరహంలో ఎంత జ్వలించిపోయావు? సన్నిధికై ఎంతగా తపించావన్నదే ప్రధానం!’ అన్నది గోపిక. యమునా నదీ తీరంలోని చెట్ల పొదల్లో కూర్చొని ఒక సాధకుడు ఎంతో కాలంగా కృష్ణ మంత్రాన్ని జపిస్తున్నాడు. జప సంఖ్య కొన్ని కోట్లు దాటింది. శరీరం శుష్కించిందే కానీ, కృష్ణ దర్శనం కాలేదు. ఆ సాధకునికి ఆ కాంతల సంభాషణ వినిపించింది. వెంటనే ఆ సాధకుడు తన తప్పు తెలుసుకొని, జపమాలను యమునలోకి విసిరివేశాడు. ప్రేమోపాస నకు ఉద్యుక్తుడైనాడు. చేతిలో మాల ప్రధానం కాదు. చిత్తంలో ప్రేమ జ్వాల ప్రధానం. భగవంతుణ్ణి ప్రేమించాలి. విరహంలో జ్వలించాలి. హృదయం ద్రవించాలి. అశ్రువులు స్రవించాలి. ఈ సంసార క్లేశం నుండి జన్మ మృత్యు పరంపర నుండి ముక్తి పొందాలని పరితపించాలి. మహదానంద స్వరూపులం కావాలని, ప్రేమ స్వరూపులం కావాలని ధ్యానించాలి. అదే వినిర్మల భక్తి. కనుక మనం కూడా వినిర్మల భక్తులమై ప్రేమోపాసకులమై సాధనను కొనసాగిద్దాం. ప్రేమ స్వరూపుడైన స్వామి దర్శనాన్ని పొందుదాం. ప్రేమ స్వరూపులమై నిలిచిపోదాం! పరమాత్ముని -
గీత స్మరణం
సాకీ : అతడు: గోపాలబాలకృష్ణ గోకులాష్టమి ఆబాలగోపాల పుణ్యాల పున్నమి ముకుంద పదముల ముగ్గుల ఇల్లే బృందావని నంద నందనుడు నడచిన చోటే... న వనందనవని బృందం: గోపికా ప్రియ కృష్ణహరే నమో కోమల హృదయ కృష్ణహరే వేవేల రూపాల వేదహరే నమో వే దాంతవేద్యా కృష్ణహరే (2) పల్లవి : ఆమె: గోవిందుడే కోకచుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేతబట్టి వచ్చెనమ్మా ॥ నవమోహన జీవన వరమిచ్చెనమ్మా ఇకపై ఇంకెపుడూ నీ చేయి విడిచి వెళ్లనని చేతిలోన చెయ్యేసి ఒట్టేసెనమ్మా బృం: దేవకీ వసుదేవ పుత్రహరే నమో పద్మపత్ర నేత్ర కృష్ణహరే యదుకుల నందన కృష్ణహరే నమో యశోద నందన కృష్ణహరే ॥ చరణం : 1 ఆ: ఎన్నాళ్లకు... ఎన్నాళ్లకు... ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు వెన్నుడొచ్చెనమ్మా ఎన్నెన్నో చుక్కల్లో నన్ను మెచ్చెనమ్మా వెన్నపాలు ఆరగించి... విన్నపాలు మన్నించి (2) వెండి వెన్నెల్లో ముద్దులిచ్చెనమ్మా ఇద్దరు: కష్టాల కడలి పసిడి పడవాయెనమ్మా కళ్యాణ రాగమురళి కలలు చిలికెనమ్మా ఆ: మా కాపురాన మంచి మలుపు తిప్పెనమ్మా అ: వసుధైక కుటుంబమని గీత చెప్పెనమ్మా బృం: గోవర్ధనోద్ధార కృష్ణహరే నమో గోపాల భూపాల కృష్ణహరే గోవింద గోవింద కృష్ణహరే నమో గోపికావల్లభ కృష్ణహరే ॥॥ చరణం : 2 ఆ: తప్పటడుగు తాండవాలు చేసినాడమ్మా తన అడుగుల ముగ్గులు చూసి మురిసినాడమ్మా అ: మన అడుగున అడుగేసి... మనతోనే చిందేసి (2) మన తప్పటడుగులు సరిదిద్దినాడమ్మా కంసారి సంసారిని కలిసి మెరిసెనమ్మా కలకాల భాగ్యాలు కలిసొచ్చెనమ్మా హరిపాదం లేనిచోటు మరుభూమేనమ్మా ఆ: శ్రీపాదం ఉన్నచోట సిరులు విరియునమ్మా బృం: ఆపదోద్ధారక కృష్ణహరే నమో ఆనందవర్ధక కృష్ణహరే లీలామానుష కృష్ణహరే నమో గానవిలాస కృష్ణహరే ॥॥ చిత్రం : పాండురంగడు (2008) రచన : శ్రీ వేదవ్యాస సంగీతం : ఎం.ఎం.కీరవాణి గానం : మధుబాలకృష్ణన్, సునీత, కీరవాణి, బృందం