ఊహకు అందని పాత్రలో...
ఊహకు అందని పాత్రలో...
Published Thu, Jan 16 2014 12:07 AM | Last Updated on Mon, Aug 13 2018 3:04 PM
గ్లామర్‌ని కాసేపు పక్కన పెట్టేసి ఆర్టిస్టుగా తనేంటో నిరూపించుకునే పనిలో పడ్డారు తాప్సీ. ‘ఆరంభం’తో తమిళంలో కూడా హిట్ కొట్టేసి, అక్కడ కూడా విరివిగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారీమె. ప్రస్తుతం లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘గంగ’ చిత్రంలో తాప్సీ నటిస్తున్న చిత్రం తెలిసిందే. ఈ సినిమాలో కూడా అభినయానికి ఆస్కారమున్న పాత్రనే పోషిస్తున్నారు తాప్సీ. ఈ సినిమాతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి తాప్సీ పచ్చజెండా ఊపేశారు. ‘3’ చిత్రంతో దక్షిణాది ప్రేక్షకుల ప్రశంసలందుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ధనుష్ ‘వై రాజా వై’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
గౌతమ్ కార్తీక్, ప్రియా ఆనంద్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో తాప్సీ ఓ స్పెషల్ రోల్ పోషించనున్నారు. తాప్సీ కెరీర్‌లోనే గుర్తుంచుకోదగ్గదిగా ఈ పాత్ర ఉంటుందని సమాచారం. ‘‘ ‘వై రాజా వై’లో భిన్నమైన పాత్ర చేయబోతున్నాను. ఆడియన్స్ ఊహలకు అందని స్థాయిలో ఇందులో నా పాత్ర ఉంటుంది. ఈ అవకాశాన్నిచ్చిన దర్శకురాలు ఐశ్వర్య ధనుష్‌కి థ్యాంక్స్’ అని ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వెలిబుచ్చారు తాప్సీ. యువన్‌శంకర్‌రాజా స్వరాలందిస్తున్న ఈ తమిళ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా పలకరిస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Advertisement
Advertisement