గెస్ట్ రోల్‌లో తాప్సీ
గెస్ట్ రోల్‌లో తాప్సీ
Published Thu, Jan 16 2014 11:24 PM | Last Updated on Mon, Aug 13 2018 3:04 PM
తొలిసారిగా 3 చిత్రంతో మెగాఫోన్ పట్టి వై దిస్ కొలెవైరి పాటతో బహుళ ప్రాచుర్యం పొందిన దర్శకురాలు ఐశ్వర్య ధనుష్. ఈమె సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురన్న విషయం తెలిసిందే. 3 చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా తాజాగా విజయమే లక్ష్యంగా చాలా కసిగా తెరకెక్కిస్తున్న చిత్రం వై రాజావై యువక్రేజీ నటుడు గౌతమ్ కార్తిక్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాఆనంద్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నటి తాప్సీ ఇప్పుడు అదనంగా వచ్చి చేరారు. ఇందులో ఈ బ్యూటీ అతిథి పాత్రను చేస్తున్నారట. దీని గురించి తాప్సీ మాట్లాడుతూ తానిప్పటి వరకు అతిథి పాత్రలో నటించింది లేదన్నారు. అయితే దర్శకురాలు ఐశ్వర్య ధనుష్‌తో ఉన్న స్నేహం కారణంగా ఈ చిత్రంలో నటించడానికి ముందు అంగీకరించినా కాస్త సందేహంతోనే కథ విన్నానన్నారు. అయితే ఐశ్వర్య కథ నెరేట్ చేసిన తరువాత నో అని చెప్పలేకపోయానన్నారు. అంతగా తన పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని తాప్సీ తెలిపారు.
Advertisement
Advertisement