గౌతమ్ కార్తీక్‌తో సనా
యువ నటుడు గౌతమ్ కార్తీక్‌తో రొమాన్స్ చేస్తోంది వర్ధమాననటి సనా మక్‌బూల్. టాలీవుడ్‌లో దిక్కులు చూడకు రామయ్య చిత్రంతో రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీకి కోలీవుడ్‌లో ఇదే తొలి చిత్రం. రాజ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రంగూన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవు తున్న సనా మక్‌బూల్ మాట్లాడుతూ రంగూన్ బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న చిత్రం అని చెప్పింది. దర్శకుడు రాజ్‌కుమార్ కథను చాలా ఆసక్తికరంగా తయారు చేశారని తెలిపింది.
చిత్రంలో మంచి పాజిటివ్ సందేశం ఉంటుందని పేర్కొంది. చిత్ర షూటింగ్ చెన్నైలో ఇటీవలే ప్రారంభ మైందని తెలిపింది. నటన విషయంలో తికమక పడరాదని ముందు నుంచే తమిళ భాష నేర్చుకుంటున్నట్లు చెప్పింది. ఇప్పటికే భాషను అర్థం చేసుకుంటూ చక్కని అభినయాన్ని పలికిస్తున్నట్లు తెలిపింది. తాను విధిని నమ్ముతానని తమిళంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటానని అంటోంది. ఇప్పటికే మరికొన్ని తమిళ చిత్రాల్లో నటించే విషయమై చర్చలు జరుగుతున్నట్లు సనా వెల్లడించింది.