కోలీవుడ్‌కు శాన్వీ
టాలీవుడ్‌లో లవ్‌లీ చిత్రంతో బ్యూటీఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నటి శాన్వీ శ్రీవత్సవ. ఆ తరువాత రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన రౌడీతో ప్రాచుర్యం పొందింది. తాజాగా ఈ బబ్లీగర్ల్ దృష్టి కోలీవుడ్‌పై పడింది. తెగిడి చిత్రం ద్వారా తమిళ రంగ ప్రవేశం చేసిన యువ నటుడు అశోక్ సెల్వన్‌తో రొమాన్స్‌కు, శాన్వీ సిద్ధం అవుతోంది. నవ దర్శకుడు అశ్రూప్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం సెప్టెంబర్ నెలలో సెట్‌పైకి రానుంది.
రొమాంటిక్ యాక్షన్ కథా చిత్రంగా ఈ చిత్రం రూపొందనుందని నటుడు అశోక్ సెల్వన్ వెల్లడించారు. తనకిందుల నటనకు అవకాశం ఉంటుందని రెండు డిఫరెంట్ లుక్‌లో కన్పించనున్నట్లు చెప్పారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందంటున్న ఈ చిత్రానికి నివాస్ ప్రసన్న సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్రంతో నటి శాన్వీ శ్రీవత్సవ కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరిక్షించుకోనుంది.