
శింబు
చెప్పినంత ఈజీ కాదు సాధించడం. కానీ యాక్టర్ శింబు సాధించాడు. 37 రోజుల్లో 13 కిలోల బరువు తగ్గుతానని సవాల్ చేశాడు. అన్నట్లుగానే తగ్గాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా సురేశ్ నిర్మాణంలో ‘మానాడు’ అనే పొలిటికల్ థ్రిల్లర్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటిస్తారు. ఈ సినిమాలోని పాత్ర కోసం లండన్‌లో మార్షల్ ఆర్ట్స్ విభాగంలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు శింబు. అలాగే లుక్‌పై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి సరైన డైట్‌తో కూడిన వర్కౌట్‌తో బరువు తగ్గాడు. ఈ సినిమా చిత్రీకరణ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాతో పాటు ఓ మల్టీస్టారర్ సినిమాకు సైన్ చేశాడు శింబు. ఇందులో గౌతమ్ కార్తీక్ మరో హీరో.
Comments
Please login to add a commentAdd a comment