తమిళ నటుడు గౌతమ్ కార్తీక్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడా? అంటే కోలీవుడ్ వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ఈ యంగ్ యాక్టర్ కుర్ర హీరోయిన్ మంజిమా మోహన్‌తో లవ్‌లో ఉన్నాడట. వీళ్లిద్దరూ తమ ప్రేమను పెళ్లిపీటల వరకు తీసుకెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2019లో దేవరత్తమ్ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట.
అప్పటినుంచి వాళ్లిద్దరూ చెన్నైలో కలిసే ఉంటున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వాలంటైన్స్ డే రోజు వారి ప్రేమను అఫీషియల్‌గా వెల్లడించే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు.
ఇదిలా ఉంటే అలనాటి హీరో నవరస నయగన్ కార్తీక్ తనయుడే గౌతమ్ కార్తీక్. ప్రస్తుతం అతడు యుత సతం, పాటు తల సినిమాలు చేస్తున్నాడు. మంజిమ మోహన్.. 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఆమె నటించిన ఎఫ్‌ఐఆర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో విష్ణు విశాల్, రైజా విల్సన్, రెబా మోనికా తదితరులు నటించారు.
Comments
Please login to add a commentAdd a comment