తమిళసినిమా: నటి రెజీనా అందాలారబోతలో రెచ్చిపోయి నటిస్తోంది. ఈ బ్యూటీకిప్పుడు కోలీవుడ్‌లో పెద్దగా అవకాశాల్లేవు. టాలీవుడ్‌లోనూ క్రేజ్ తగ్గింది. అలాంటిది ఒక క్రేజీ ఆఫర్ రెజీనాను వరించింది. దాన్ని సద్వినియోగం చేసుకుని ఎలాగైనా అవకాశాలు దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉందట. అసలు విషయానికి వస్తే యువ నటుడు గౌతమ్ కార్తీక్, ఆయన తండ్రి కార్తీక్ కలిసి నటిస్తున్న తొలి చిత్రం మిస్టర్ చంద్రమౌళి. దీనికి తిరు దర్శకుడు. నాన్ శిగప్పు మనిదన్ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రం తరువాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఇందులో రెజీనా నాయకిగా నటిస్తోంది. కోలీవుడ్ సమ్మెకు కొద్ది రోజుల ముందే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న చిత్రం మిస్టర్ చంద్రమౌళి.
ఈ చిత్రంలో పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ థాయ్‌లాండ్ చుట్టొచ్చింది. అక్కడ గౌతమ్‌కార్తీక్, రెజీనాలతో చిత్రీకరించిన పాట దృశ్యాల ఫొటోలను చిత్ర వర్గాలు మీడియాకు విడుదల చేశాయి. ఆ ఫొటోలను చూస్తే నటి రెజీనా గ్లామర్ విషయంలో విజృంభించిందని తెలుస్తోంది. ఆ పాటలో గౌతమ్ కార్తీక్, రెజీనాల సన్నిహిత దృశ్యాలు యూత్‌ను గిలిగింతలు పెట్టిస్తాయని మిస్టర్ చంద్రమౌళి చిత్రవర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకూ అంత గ్లామరస్‌గా కోలీవుడ్ చిత్రాల్లో నటించలేదట. మరి ఈ చిత్రం నటి రెజీనా ఆశలు తీరుస్తుందా? అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇందులో మరో ముఖ్య పాత్రను నటి వరలక్ష్మీశరత్‌కుమార్ పోషిస్తున్నారన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment