తమిళసినిమా: ఒక మంచి రోజు చూసి చెబుతానంటోంది నటి నిహారిక. ఈ పేరు వినగానే ఎలాంటి సినీ కుటుంబం నుంచి వచ్చిందన్నది ఇట్టే తెలిసిపోతుంది. ఎస్.మెగాస్టార్ చిరంజీవి కుంటుంబం నుంచి రంగప్రవేశం చేసిన నటి నిహారిక. చిరంజీవి సోదరుడు, నిర్మాత, నటుడు నాగబాబు కూతురు ఈ వర్ధమాన నటి నిహారిక కొణెదల. ఇప్పటికే తెలుగులో నాయకిగా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఇప్పుడు కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. తను కథానాయకిగా నటిస్తున్న చిత్రం ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్ (ఒక మంచి రోజు చూసి చెబుతా).
వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్‌సేతుపతి, ఇటీవలే సక్సెస్ ట్రాక్‌లో పడ్డ గౌతమ్ కార్తీక్ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 7సీస్ ఎంటర్‌టెయిన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, అమ్మీ నారాయణ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆర్ముగకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటించడం గురించి నటి నిహారిక తెలుపుతూ కోలీవుడ్‌లో తొలి చిత్రమే ఇంత భారీ చిత్రంగా రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. విజయ్‌సేతుపతి, గౌతమ్ కార్తీక్ లాంటి నిరాడంబరమైన నటులతో కలిసి నటించడం మంచి అనుభవం అని చెప్పింది.
ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్ చిత్రంలో తనది రెగ్యులర్ కథా పాత్రగా ఉండదని అంది. ఇందులో తనకు రెండు పేర్లు ఉంటాయని, అలా ఎందుకన్నది చిత్రం చూస్తే మీకే తెలుస్తుందని చెప్పింది. నటిగా తనకు తన కుటుంబం ఆదరణ, ప్రోత్సాహం ఎంతన్న మాటల్లో చెప్పలేనని, ఇంత మంచి కుటుంబంలో పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని నిహారిక పేర్కొంది. ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్ చిత్రం కోలీవుడ్ ప్రేక్షకులకు నచ్చుతుందనే అభిప్రాయాన్ని నిహారిక కొణెదల వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment