ముద్దుల్లో అశ్లీలం ఉండదు | no abuse in kiss, says lakshmi menon | Sakshi

ముద్దుల్లో అశ్లీలం ఉండదు

Jan 18 2014 1:28 AM | Updated on Sep 2 2017 2:43 AM

ముద్దుల్లో అశ్లీలం ఉండదు

ముద్దుల్లో అశ్లీలం ఉండదు

ఒకప్పుడు కథానాయికలు ముద్దంటే వద్దనే వారు. ఇప్పుడు ఓకే అంటున్నారు. ఈ నేపథ్యంలో ముద్దుల్లో అశ్లీలం ఏముంది? అని ప్రశ్నిస్తోంది వర్ధమాన నటి లక్ష్మీమీనన్.

ఒకప్పుడు కథానాయికలు ముద్దంటే వద్దనే వారు. ఇప్పుడు ఓకే అంటున్నారు. ఈ నేపథ్యంలో ముద్దుల్లో అశ్లీలం ఏముంది? అని ప్రశ్నిస్తోంది వర్ధమాన నటి లక్ష్మీమీనన్. మొన్నటి వరకు గ్లామర్ పక్కకే వెళ్లనని స్టేట్‌మెంట్లు ఇచ్చిన ఈ కేరళ కుట్టి ఇప్పుడు ఏకంగా లిప్‌లాక్‌కు ఓకే చెప్పేసింది. పైగా అదేం తప్పు కాదే అంటోంది. ఈ లక్కీగర్ల్‌తో చిన్న భేటి...
 
ప్ర : కుంకీ చిత్రంలో మొదలైన మీ విజయపరంపర కొనసాగుతూనే ఉంది. 2014 మీలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది?
జ : నాకు ఎలాంటి మార్పు కనిపించలేదు. గత ఏడాది మాదిరిగానే ఈ సారి వరుసగా నటిస్తున్నాను. గత ఏడాది ఒప్పుకున్న చిత్రాల్లోనే ఇప్పుడు నటిస్తున్నాను.

ప్ర : నాన్ శివప్పు మనిదన్ చిత్రంలో విశాల్‌తో మరోసారి జతకట్టడం గురించి?
జ : నటుడు విశాల్‌తో మరోసారి జంటగా నటించడం సంతోషమే. మీరనుకుంటున్నట్లు ఏమీ లేదు. దర్శకుడు తిరు ఁనాన్ శివప్పు మనిదన్  చిత్ర కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. నా పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉండడంతో వెంటనే నటించడానికి అంగీకరించాను. విశాల్‌తో ఇంతకుముందు పాండియనాడు చిత్రంలో నటించడం వల్ల ఇప్పుడు మరింత సౌకర్యంగా ఉంది.
 
ప్ర : గ్లామర్‌తో పాటు ముద్దు సన్నివేశాల్లోనూ నటించనని చెప్పిన మీరు ఇప్పుడు నాన్ శివప్పు మనిదన్ చిత్రంలో విశాల్‌తో లిప్‌లాక్ సన్నివేశంలో నటించారే?
జ : నాన్ శివప్పు మనిదన్ చిత్రంలో ముద్దు సన్నివేశంలో నటించాను. అందులో అశ్లీలం ఉండదు. గ్లామర్ అస్సలు ఉండదు. కథకు అవసరం కావడంతో ఆ సన్నివేశంలో నటించాను. దీని గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేదు. చిత్ర విడుదలైన తర్వాత దాని గురించి మీరే తెలుసుకుంటారు.
 
ప్ర : యువ నటుడు గౌతమ్ కార్తీక్ అన్ని షూటింగ్‌లలోనూ తెగపొగిడేస్తున్నారట?
జ : నేను చూసిన, నటించిన హీరోలందరిలోనూ లేటెస్ట్ నటుడు గౌతమ్ కార్తీక్. ఆయనతో నటిస్తే నేను స్కోర్ చేయగలనా అనే సందేహించిన ఏకైక హీరో గౌతమ్ కార్తీకే. ఆయన తండ్రి నవరస కథా నాయకుడు. ఆయన జీన్స్ గౌతమ్ కార్తీక్‌లోనూ ఉంటాయిగా.

ప్ర : కమర్షియల్ చిత్రాల్లోకి దిగిపోయారు. మంచి కథా పాత్రల్లో నటించి జాతీయ అవార్డు గెలుచుకోవాలని లేదా?
జ : జాతీయ అవార్డు గెలుచుకోవాలని నేనీ రంగంలోకి రాలేదు. అవకాశం వచ్చింది నటించడానికి సిద్ధమయ్యాను. అవార్డు నటి అనే పేరు తెచ్చుకోవాలన్న ఆశ నాకు లేదు. మంచి చిత్రాలు చేయాలి అంతవరకే నేను కోరుకునేది.

ప్ర : మీ గురించి వస్తున్న గాసిప్స్ గురించి?
జ : నా గురించి ప్రచారం అవుతున్న గాసిప్స్‌ను నేను ఎంజాయ్ చేస్తున్నాను. నా గురించి వదంతులు రాస్తున్నారని తలచుకుంటే సంతోషం కలుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement