Laxmi menon
-
పెళ్లి చేసుకోకపోయినా అవి పొందవచ్చు..
తమిళసినిమా: నమ్మకమైన వాడు తోడు కావాలని నటి లక్ష్మీమీనన్ అంటోంది. 15 ఏళ్ల వయసులోనే నటిగా పరిచయమైన ఈ కేరళా కుట్టి కుంకీ చిత్రంతో కోలీవుడ్‌ను ఆకట్టుకుంది. ఆ తరువాత విశాల్, విజయ్‌సేతుపతి, జయంరవి వంటి స్టార్ హీరోలతో జతకట్టి సక్సెస్ఫుల్ నాయకిగా గుర్తింపు పొందింది. అలా ఎదుగుతున్న సమయంలో చదువు పూర్తి చేయాలంటూ నటనకు గ్యాప్ తీసుకుంది. ఆ నిర్ణయం సినీకెరీర్‌కు నష్టాన్నే కలిగించింది. రీఎంట్రీ అయినా మునుపటి లక్కు రాలేదు. ప్రస్తుతం ప్రభుదేవాతో జంటగా నటిస్తున్న యంగ్ మంగ్ ఛంగ్ చిత్రం ఒక్కటే చేతిలో ఉంది. ఈ చిత్రం లక్ష్మీమీనన్‌కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. చాలాకాలం మీడియాకు దూరంగా ఉన్న ఈ అమ్మడు ఒక భేటీలో పెళ్లి ప్రస్తావన తీసుకురాగా ఎలాంటి బదులిచ్చిందో చూద్దాం. నాకు వివాహబంధంపై నమ్మకం లేదు. పెళ్లి చేసుకుంటేనే ప్రేమ, అభిమానం లభిస్తాయని నేను అనుకోను. పెళ్లి చేసుకోకపోయినా అవి పొందవచ్చు. నేను చెప్పేది ఇతరులకు అర్థం అవుతుందో, కాదో తెలియదు. నేను మాత్రం తెలివిగానే చెబుతున్నాను. వివాహ జీవితంపై నాకు నమ్మకం లేదు. అందుకే నేను పెళ్లే చేసుకోను. అలాగని నాకు జీవితానికి అండ ఉండరని చెప్పడం లేదు. కచ్చితంగా ఉంటాడు. అందుకు అండ అనే మాటకు బలం, చాలా నమ్మకం, ప్రేమాభిమానాలు కలిగించే వ్యక్తి కావాలి. దాన్ని పెళ్లి అనే మాటల్లో చేర్చడం నాకు ఇష్టం లేదు.అయితే దాన్ని సహజీవనం అని కూడా చెప్పను. మరో విషయం ఏమిటంటే జీవితంలో అనుభవమే ఉత్తమ ఉపాధ్యాయుడు. అయితే నేను పెళ్లి గురించి చెప్పిన విషయాలు అనుభవాలే కారణం అని చెప్పను. దాన్ని ఎలా చెప్పాలో నిజానికి నాకే తెలియదు. -
ఆ ట్విట్టర్ అకౌంట్ నాది కాదు : లక్ష్మీ మీనన్
టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది వాటివల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా అభివృద్ది చెందుతున్న కొద్ది దాని వల్ల ఇబ్బంది పడుతున్న సెలబ్రిటీల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. తాజాగా కోలీవుడ్ హీరోయిన్ లక్ష్మీ మీనన్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ట్విట్టర్లో లక్ష్మీ మీనన్ పేరుతో ఓ అకౌంట్ క్రియేట్ చేసిన ఆకతాయిలు అదే అఫీషియల్ అకౌంట్ అంటూ ప్రచారం చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో అభిమానులతో పాటు కొంతమంది లక్ష్మీ మీనన్ సన్నిహితులు కూడా ఆ ఖాతాను ఫాలో అయ్యారు. ఈ విషయం లక్ష్మీ మీనన్ వరకు వెళ్లటంతో అది తన అకౌంట్ కాదంటూ ప్రకటించింది ఈ కోలీవుడ్ బ్యూటీ. ఇప్పటికే ఫేస్బుక్లో అప్పుడప్పుడు అభిమానలుకు అందుబాటులో ఉండే లక్ష్మీ మీనన్ తన పేరుతో క్రియేట్ అయిన ట్విట్టర్ అకౌంట్ అఫీషియల్ కాదంటూ ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేసింది. కుంకీ, జిగర్తాండ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీ మీనన్ ఇటీవల మిరుథన్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం విజయ్ సేతుపతి సరసన రెక్క సినిమాలో నటిస్తోంది. -
చిక్కడు దొరకడు మూవీ స్టిల్స్
-
ఇంద్రుడు మూవీ ఆడియో లాంచ్
-
ఇంద్రుడు మూవీ పోస్టర్స్
-
ముద్దుల్లో అశ్లీలం ఉండదు
ఒకప్పుడు కథానాయికలు ముద్దంటే వద్దనే వారు. ఇప్పుడు ఓకే అంటున్నారు. ఈ నేపథ్యంలో ముద్దుల్లో అశ్లీలం ఏముంది? అని ప్రశ్నిస్తోంది వర్ధమాన నటి లక్ష్మీమీనన్. మొన్నటి వరకు గ్లామర్ పక్కకే వెళ్లనని స్టేట్మెంట్లు ఇచ్చిన ఈ కేరళ కుట్టి ఇప్పుడు ఏకంగా లిప్‌లాక్‌కు ఓకే చెప్పేసింది. పైగా అదేం తప్పు కాదే అంటోంది. ఈ లక్కీగర్ల్తో చిన్న భేటి... ప్ర : కుంకీ చిత్రంలో మొదలైన మీ విజయపరంపర కొనసాగుతూనే ఉంది. 2014 మీలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? జ : నాకు ఎలాంటి మార్పు కనిపించలేదు. గత ఏడాది మాదిరిగానే ఈ సారి వరుసగా నటిస్తున్నాను. గత ఏడాది ఒప్పుకున్న చిత్రాల్లోనే ఇప్పుడు నటిస్తున్నాను. ప్ర : నాన్ శివప్పు మనిదన్ చిత్రంలో విశాల్‌తో మరోసారి జతకట్టడం గురించి? జ : నటుడు విశాల్‌తో మరోసారి జంటగా నటించడం సంతోషమే. మీరనుకుంటున్నట్లు ఏమీ లేదు. దర్శకుడు తిరు ఁనాన్ శివప్పు మనిదన్ చిత్ర కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. నా పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉండడంతో వెంటనే నటించడానికి అంగీకరించాను. విశాల్‌తో ఇంతకుముందు పాండియనాడు చిత్రంలో నటించడం వల్ల ఇప్పుడు మరింత సౌకర్యంగా ఉంది. ప్ర : గ్లామర్‌తో పాటు ముద్దు సన్నివేశాల్లోనూ నటించనని చెప్పిన మీరు ఇప్పుడు నాన్ శివప్పు మనిదన్ చిత్రంలో విశాల్‌తో లిప్‌లాక్ సన్నివేశంలో నటించారే? జ : నాన్ శివప్పు మనిదన్ చిత్రంలో ముద్దు సన్నివేశంలో నటించాను. అందులో అశ్లీలం ఉండదు. గ్లామర్ అస్సలు ఉండదు. కథకు అవసరం కావడంతో ఆ సన్నివేశంలో నటించాను. దీని గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేదు. చిత్ర విడుదలైన తర్వాత దాని గురించి మీరే తెలుసుకుంటారు. ప్ర : యువ నటుడు గౌతమ్ కార్తీక్ అన్ని షూటింగ్లలోనూ తెగపొగిడేస్తున్నారట? జ : నేను చూసిన, నటించిన హీరోలందరిలోనూ లేటెస్ట్ నటుడు గౌతమ్ కార్తీక్. ఆయనతో నటిస్తే నేను స్కోర్ చేయగలనా అనే సందేహించిన ఏకైక హీరో గౌతమ్ కార్తీకే. ఆయన తండ్రి నవరస కథా నాయకుడు. ఆయన జీన్స్ గౌతమ్ కార్తీక్లోనూ ఉంటాయిగా. ప్ర : కమర్షియల్ చిత్రాల్లోకి దిగిపోయారు. మంచి కథా పాత్రల్లో నటించి జాతీయ అవార్డు గెలుచుకోవాలని లేదా? జ : జాతీయ అవార్డు గెలుచుకోవాలని నేనీ రంగంలోకి రాలేదు. అవకాశం వచ్చింది నటించడానికి సిద్ధమయ్యాను. అవార్డు నటి అనే పేరు తెచ్చుకోవాలన్న ఆశ నాకు లేదు. మంచి చిత్రాలు చేయాలి అంతవరకే నేను కోరుకునేది. ప్ర : మీ గురించి వస్తున్న గాసిప్స్ గురించి? జ : నా గురించి ప్రచారం అవుతున్న గాసిప్స్‌ను నేను ఎంజాయ్ చేస్తున్నాను. నా గురించి వదంతులు రాస్తున్నారని తలచుకుంటే సంతోషం కలుగుతోంది.