పెళ్లి చేసుకోకపోయినా అవి పొందవచ్చు.. | Laxmi Menon Comments On Marrage Life | Sakshi
Sakshi News home page

నమ్మకస్తుడు తోడు కావాలి!

Published Mon, Jun 25 2018 8:05 AM | Last Updated on Mon, Jun 25 2018 10:40 AM

Laxmi Menon Comments On Marrage Life - Sakshi

తమిళసినిమా: నమ్మకమైన వాడు తోడు కావాలని నటి లక్ష్మీమీనన్‌ అంటోంది. 15 ఏళ్ల వయసులోనే నటిగా పరిచయమైన ఈ కేరళా కుట్టి కుంకీ చిత్రంతో కోలీవుడ్‌ను ఆకట్టుకుంది. ఆ తరువాత విశాల్, విజయ్‌సేతుపతి, జయంరవి వంటి స్టార్‌ హీరోలతో జతకట్టి సక్సెస్‌ఫుల్‌ నాయకిగా గుర్తింపు పొందింది. అలా ఎదుగుతున్న సమయంలో చదువు పూర్తి చేయాలంటూ నటనకు గ్యాప్‌ తీసుకుంది. ఆ నిర్ణయం సినీకెరీర్‌కు నష్టాన్నే కలిగించింది. రీఎంట్రీ అయినా మునుపటి లక్కు రాలేదు. ప్రస్తుతం ప్రభుదేవాతో జంటగా నటిస్తున్న యంగ్‌ మంగ్‌ ఛంగ్‌ చిత్రం ఒక్కటే చేతిలో ఉంది. ఈ చిత్రం లక్ష్మీమీనన్‌కు ఎలాంటి రిజల్ట్‌ ఇస్తుందో చూడాలి. చాలాకాలం మీడియాకు దూరంగా ఉన్న ఈ అమ్మడు ఒక భేటీలో పెళ్లి ప్రస్తావన తీసుకురాగా ఎలాంటి బదులిచ్చిందో చూద్దాం.

నాకు వివాహబంధంపై నమ్మకం లేదు. పెళ్లి చేసుకుంటేనే ప్రేమ, అభిమానం లభిస్తాయని నేను అనుకోను. పెళ్లి చేసుకోకపోయినా అవి పొందవచ్చు. నేను చెప్పేది ఇతరులకు అర్థం అవుతుందో, కాదో తెలియదు. నేను మాత్రం తెలివిగానే చెబుతున్నాను. వివాహ జీవితంపై నాకు నమ్మకం లేదు. అందుకే నేను పెళ్లే చేసుకోను. అలాగని నాకు జీవితానికి అండ ఉండరని చెప్పడం లేదు. కచ్చితంగా ఉంటాడు. అందుకు అండ అనే మాటకు బలం, చాలా నమ్మకం, ప్రేమాభిమానాలు కలిగించే వ్యక్తి కావాలి. దాన్ని పెళ్లి అనే మాటల్లో చేర్చడం నాకు ఇష్టం లేదు.అయితే దాన్ని సహజీవనం అని కూడా చెప్పను. మరో విషయం ఏమిటంటే జీవితంలో అనుభవమే ఉత్తమ ఉపాధ్యాయుడు. అయితే నేను పెళ్లి గురించి చెప్పిన విషయాలు అనుభవాలే కారణం అని చెప్పను. దాన్ని ఎలా చెప్పాలో నిజానికి నాకే తెలియదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement