ప్రభుదేవా ఇంట్లో విషాదం.. హుటాహుటిన ప్రయాణం | Prabhu Deva Grandmother Passed Away | Sakshi
Sakshi News home page

ప్రభుదేవా ఇంట్లో విషాదం.. హుటాహుటిన ప్రయాణం

Published Wed, Jul 10 2024 6:29 PM | Last Updated on Wed, Jul 10 2024 6:46 PM

Prabhu Deva Grandmother Passed Away

ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌, నటుడు ప్రభుదేవా కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రభుదేవా అమ్మమ్మ 'పుట్టమ్మన్ని' (97) అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఆయన వెంటనే మైసూరు చేరుకున్నారు. కర్నాటకలోని మైసూర్‌లో జన్మించిన ప్రభుదేవా చైన్నైలో నివాసం ఉంటున్నారు.

ప్రభుదేవా అమ్మమ్మ మరణించడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మైసూర్‌లోని మందకల్లి విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా తన సొంత గ్రామం 'తొరు' చేరుకున్నారు. నేడు జరిగిన ఈ అంత్యక్రియల్లో ప్రభుదేవా తమ్ముళ్ళు రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్‌లు కూడా పాల్గొన్నారు. పుట్టమ్మన్ని మరణంతో ప్రభుదేవా కుటుంబంలో విషాదం నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement