ఆ ట్విట్టర్ అకౌంట్ నాది కాదు : లక్ష్మీ మీనన్ | I'm not on Twitter: Lakshmi Menon | Sakshi
Sakshi News home page

ఆ ట్విట్టర్ అకౌంట్ నాది కాదు : లక్ష్మీ మీనన్

Published Sat, Feb 6 2016 7:19 PM | Last Updated on Sun, Sep 3 2017 5:04 PM

ఆ ట్విట్టర్ అకౌంట్ నాది కాదు : లక్ష్మీ మీనన్

ఆ ట్విట్టర్ అకౌంట్ నాది కాదు : లక్ష్మీ మీనన్

టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది వాటివల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా అభివృద్ది చెందుతున్న కొద్ది దాని వల్ల ఇబ్బంది పడుతున్న సెలబ్రిటీల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. తాజాగా కోలీవుడ్ హీరోయిన్ లక్ష్మీ మీనన్కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ట్విట్టర్లో లక్ష్మీ మీనన్ పేరుతో ఓ అకౌంట్ క్రియేట్ చేసిన ఆకతాయిలు అదే అఫీషియల్ అకౌంట్ అంటూ ప్రచారం చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో అభిమానులతో పాటు కొంతమంది లక్ష్మీ మీనన్ సన్నిహితులు కూడా ఆ ఖాతాను ఫాలో అయ్యారు.

ఈ విషయం లక్ష్మీ మీనన్ వరకు వెళ్లటంతో అది తన అకౌంట్ కాదంటూ ప్రకటించింది ఈ కోలీవుడ్ బ్యూటీ. ఇప్పటికే ఫేస్బుక్లో అప్పుడప్పుడు అభిమానలుకు అందుబాటులో ఉండే లక్ష్మీ మీనన్ తన పేరుతో క్రియేట్ అయిన ట్విట్టర్ అకౌంట్ అఫీషియల్ కాదంటూ ఓ వీడియో మెసేజ్ను రిలీజ్ చేసింది. కుంకీ, జిగర్తాండ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీ మీనన్ ఇటీవల మిరుథన్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం విజయ్ సేతుపతి సరసన రెక్క సినిమాలో  నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement