
మలయాళ ముద్దుగుమ్మ మంజిమా మోహన్ మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముత్తయ్య దర్శకత్వంలో గౌతమ్ కార్తీక్ హీరోగా రూపొందనున్న తమిళ చిత్రం ‘దేవరదమ్’లో మంజిమా కథానాయికగా నటించనున్నారు. ‘‘ఈ సినిమా టీమ్‌లో జాయిన్ అయినందుకు హ్యాపీ. ఇక షూటింగ్ స్టార్ట్ కావడం కోసం ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు మంజిమా.
గతేడాది రెండు తమిళ సినిమాల్లో నటించిన ఈమె ఈ ఏడాది నటించనున్న ఫస్ట్ తమిళ చిత్రం ఇదే. సో.. మంజిమా కెరీర్‌లో వన్‌మోర్ తమిళ మూవీ క్రెడిట్ అయ్యిందన్నమాట. ప్రస్తుతం హిందీ హిట్ ‘క్వీన్’ మలయాళ రీమేక్ ‘జామ్ జామ్’ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ తెలుగులో ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో మెరిసిన విషయం గుర్తుండే ఉంటుంది.