
మెగా కాంపౌండ్ నుంచి వారసులుగా వచ్చి తమ టాలెంట్‌ని నిరూపించుకొని స్టార్స్‌గా మారారు. ఇక మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన తొలి హీరోయిన్ నిహారిక అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే నిహారికకు హీరోయిన్‌గా సరైన సక్సెస్ ఇప్పటి వరకు లభించలేదు. ముద్దపప్పు ఆవకాయ వెబ్సిరీస్‌తో మొదలైన నిహారిక ప్రయాణం ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా వంటి చిత్రాల వరకు కొనసాగింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్యలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.( పిల్లలను చూసి నేర్చుకోండి: నటుడు)
కాగా నిహారిక సినిమాల కన్నా ఆమె పెళ్లి వార్తలే హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. నిహారిక వివాహంపై ఇప్పటికే చాలా రూమర్లు వచ్చాయి. ఆమె పెళ్లి నాగశౌర్యతో జరగనుందని ఒకసారి, తన బావ సాయిధరమ్ తేజ్‌తో జరగనుందంటూ మరోసారి గాసిప్స్ పుట్టాయి. అయితే వీటన్నింటిని నిహారిక ఎప్పటికప్పుడు ఖండించారు. తాజాగా ప్రభాస్‌తో మీ పెళ్లి అనే వార్తలు వింటున్నాం అని ఓ నెటిజన్ .. నిహారికని అడిగాడు. నిహారిక అందుకు స్పందిస్తూ.. 'ప్రభాస్‌తో నా పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలు అవాస్తవం. నేను ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవడం లేదు. నా కుటుంబసభ్యులు చూపించిన వాడినే నేను పెళ్లి చేసుకుంటా' అని స్పష్టం చేశారు. నిహారిక తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి చేసిన బ్రష్ ఛాలెంజ్ వీడియో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment