హాస్య నటుడు వెన్నెల కిశోర్
టాలీవుడ్ స్టార్ కమెడియన్‌గా వెలుగొందుతున్న వెన్నెల కిశోర్ సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉంటాడు. తన షూటింగ్ అప్‌డేట్స్ ఇవ్వటంతో పాటు సామాజిక అంశాలపై కూడా తనదైన స్టైల్‌లో స్పందిస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా అలాంటి ఆసక్తికరమైన ఒక ట్వీట్ తో ఆకట్టుకున్నాడు కిశోర్. కొన్ని బాదం పప్పుల మాత్రమే ఉన్న చిన్న బౌల్ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన కిశోర్ ఆసక్తికర కామెంట్ చేశాడు.
‘నా బ్రేక్ ఫాస్ట్ ఇది మాత్రమే. 15 నిమిషాల తరువాత రెండు ఇడ్లీలు, కొంచెం పొంగల్, రెండు ఆనియన్ దోశలు (ఆనియన్స్ లేకుండా), ఒక టీ మాత్రం స్నాక్స్ లా తీసుకుంటా’ అంటూ ట్వీట్ చేశాడు. వెన్నెల కిశోర్ చేసిన ఈ ట్వీట్‌పై స్పందించిన మంచు లక్ష్మీ ‘నా జీవితంలో ప్రతీరోజు ఆనందానికి నువ్వు కూడా ఓ కారణం’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై స్పదించిన చాలా మంది అభిమానులకు తనదైన స్టైల్ లో సమాధానమిచ్చాడు కిశోర్.
My only breakfast..then after almost 15 mins will have a light snack of just two idlis, little pongal, two onion dosas (without onions) and one tea..#eathealthy pic.twitter.com/wAWQ9yNcJ5
— vennela kishore (@vennelakishore) 17 March 2018
Comments
Please login to add a commentAdd a comment