మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసుల్లో సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర గందరగోళం నెలకొంది. అర్థాంతరంగా విండోస్ స్క్రీన్‌లపై "బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్" కనిపించింది. దీంతో మైక్రోసాఫ్ట్ వినియోగదారులంతా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అలాగే అనేక వ్యాపార సంస్థలు బ్యాంకింగ్, విమానయాన రంగ సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో సోషల్ మీడియాలో సెటైర్లు, మీమ్స్ సందడి చేశాయి. పనిలో పనిగా టెస్లా అధినే, ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్ కూడా స్పందించడం గమనార్హం.
మైక్రోసాఫ్ట్ సేవల అంతరాయంపై స్పందించిన సంస్థ 365 యాప్‌లు, సేవలను యాక్సెస్ చేయడంలో వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తినట్టు వివరణ ఇచ్చింది. సమస్యను పరిష్కరించడానికి తాము కృషి చేస్తున్నామని, వీలైనంత త్వరగా దీనిని పరిష్కరిస్తామని కంపెనీ తెలిపింది.
మస్క్ రియాక్షన్
మస్క్ ఎక్స్‌లో స్పందిస్తూ ఒక మీమ్‌కు లాఫింగ్ ఎమోజీని పోస్టు చేశారు. అలాగే మైక్రోసాఫ్ట్ కాదు..మాక్రోహార్డ్ అంటూ సెటైర్ వేస్తూ పాత ట్వీట్‌ను రీట్వీట్ చేవారు. అంతేకాదు ఎలన్ మస్క్ జోస్యం నిజ మైందంటున్నార నెటిజన్లు.
IT departments: #Microsoft #Windows #bluescreen pic.twitter.com/cwO7x4QqF4
— NEELKAMAL MEENA NEWAI (@NEELKAMALBhonda) July 19, 2024
Happy Weekend, thank you #Microsoft #Bluescreen pic.twitter.com/P8NywbSv6S
— Parmatma Yadav (@yparmatma561) July 19, 2024
కార్పొరేట్ ఉద్యోగులకు వీకెండ్ ముందే వచ్చిందని కొందరు, సంబరాల్లో ఉద్యోగులు అంటూ మరికొందరి మీమ్స్ , ఫన్నీ జోక్‌లతో ఇంటర్నెట్ సందడిగా మారింది.
— Elon Musk (@elonmusk) July 19, 2024
Comments
Please login to add a commentAdd a comment