గుర్గావ్ గురుగ్రామైతే.. తెలంగాణ టెలిగ్రామా?
'గుర్గావ్ను ఇప్పటినుంచి గురుగ్రామ్ అని పిలువాలి.. మరీ ఎప్పుడు తెలంగాణను టెలిగ్రామ్ అని పిలుస్తారు? దిగ్బోయ్ని డయాగ్రామ్, ఆనంద్‌ను అనగ్రామ్, మోహన్పూర్ను మోనోగ్రామ్ అని ఎప్పుడు పిలువనున్నారు'..
గుర్గావ్ పేరును గురుగ్రామ్ గా మారుస్తూ తీసుకున్న నిర్ణయంపై ఓ నెటిజన్ వేసిన సెటైర్ ఇది..
Gurgaon now called #Gurugram. When will Telangana be called Telegram, Digboi be called Diagram,Anand called Anagram and Monohurpur Monogram.
— Harsh Goenka (@hvgoenka) 12 April 2016
ఢిల్లీ శివార్లలో ఉండే ప్రముఖ పట్టణం గుర్గావ్ పేరును గురుగ్రామ్‌గా మారుస్తూ హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తున్నాయి. ఈ నిర్ణయం వెలువడిన మంగళవారం నుంచి ఇప్పటివరకు ట్విట్టర్లో చాలామంది నెటిజన్లు ఈ అంశంపై స్పందించారు. హర్యానా సర్కార్ నిర్ణయంపై వ్యంగ్యంగా స్పందిస్తూ చాలామంది నెటిజన్లు కామెంట్లు పెట్టారు. కొందరు తప్పుబట్టారు. కొందరు విమర్శించారు. దీంతో ఈ అంశం కొన్ని గంటల్లోనే ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్ గా మారిపోయింది. గురుగ్రామ్ హ్యాష్‌ట్యాగ్ (#Gurugram)తో ఇప్పటివరకు 24.6వేలకుపైగా ట్వీట్లు వెలువడ్డాయి. దీంతో ట్విట్టర్లో ఇది అత్యధికంగా మాట్లాడిన అంశంగా మారిపోయింది.
How would like to be called collectively, people of Gurugram?
— Karthik Srinivasan (@beastoftraal) 12 April 2016
Gramvasiyon?
Gurulog?
Grammars?
Gur naal ishq mitha oye hoye...
గుర్గావ్గా గురుగ్రామ్‌గా మారిపోవడంపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. 'ఇక నుంచి గురుగ్రామ్ వాసులను ఉమ్మడిగా కలిపి ఎలా పిలుస్తారు? గురువంశీయులారా అనా? గురులోకులు అనా? గ్రామర్స్ అనా? గురు నాల్ ఇష్క్ మిథా ఓయ్ హోయ్ అనా?..' అని వ్యంగ్యంగా పేర్కొనగా.. ఇన్స్టాగ్రామ్ తరహాలో బాబాలు, సన్యాసాలు సెల్ఫీలు అప్లోడ్ చేసుకునేందుకు గురుగ్రామ్ యాప్ తీసుకురావాలని తాను అనుకొన్నానని, తన ఐడియాను కాపీ కొట్టేశారని మరో నెటిజన్ వాపోయాడు.
ఇక పేరు మార్చడం వల్ల 250 ఫార్చూన్ 500 కంపెనీలకు నెలవైన గుర్గావ్ పట్టణ పరిస్థితులు ఏమైనా మెరుగవుతాయా? అని పలువురు ప్రశ్నించారు. మహాభారతంలో ఏకలవ్యుడి బొటనవేలిని పొట్టనబెట్టుకున్న ద్రోణాచార్యుడి పేరు మీద గురుగ్రామ్ అని పెట్టడం, అది కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్ణయం తీసుకోవడమేమిటని పలువురు విమర్శించారు. హర్యానా రాజకీయ నాయకులు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
Delhi govt must learn from Haryana. Instead of wasting time improving the education system, just change it's name to Indraprastha. #Gurugram
— Shirish Kunder (@ShirishKunder) 12 April 2016
@farzana_versey Gurugram sounds more like a photo uploading app for Delhiites.
— Masroor Dhar (@ImMasroor_) 13 April 2016
So does that make Instagram our cousin brother? #Gurugram
— Shivangi (@Shivangiyadav) 12 April 2016
BJP's swift balancing act - within days of opening Ambedkar Memorial, name of #Gurgaon is changed to #Gurugram - invoking Dronacharya 1/2
— Pawan Khera (@Pawankhera) 12 April 2016
In perception what Aurangzeb was to Hindus, Dronacharya was to Dalits. If name changes symbolise corrective intervention, why #Gurugram? 2/2
— Pawan Khera (@Pawankhera) 12 April 2016