సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి ఆనంద్ మహీంద్ర స్పెషల్‌ గిఫ్ట్‌ | Anand Mahindra offers gift of a Thar to Naushad Khan | Sakshi
Sakshi News home page

సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి ఆనంద్ మహీంద్ర స్పెషల్‌ గిఫ్ట్‌

Published Fri, Feb 16 2024 2:27 PM | Last Updated on Fri, Feb 16 2024 3:07 PM

Anand Mahindra offers gift of a Thar to Naushad Khan - Sakshi

పారిశ్రామికవేత్త, ఎంఅండ్‌ఎం అధినేత ఆనంద్‌ మహీంద్ర మరోసారి తన గొప్ప మనుసు చాటుకున్నారు. క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రిని ఉద్దేశించి ఉద్వేగభరితమైన ట్వీట్‌ చేశారు. క్రికెటర్‌ సర్ఫరాజ్‌లో విశ్వాసాన్ని నింపింనందుకు అతని తల్లిదండ్రులను అభినందనల్లో ముంచెత్తారు. అనుకున్నది సాధించేంతవరకు నమ్మకాన్ని కోల్పోకూడదనే స్పూర్తి  నిచ్చారు అంటూ వారిని  ప్రశంసించారు. ఈ సందర్బంగా నౌషాద్‌ మాటలు, సర్ఫరాజ్‌ బ్యాటింగ్‌ వీడియోను షేర్‌ చేశారు. ఒక  బహుమతిని కూడా   ప్రకటించారు.

విశ్వాసాన్ని కోల్పోవద్దు....కఠోర శ్రమ, ధైర్యం, సహనం..ఇంతకంటే గొప్ప లక్షణాలు ఏముంటాయి ఒక తండ్రి పిల్లల్లో స్ఫూర్తి నింపేందుకు. అందుకే స్పూర్తిదాయకమైన  తండ్రి  నౌషద్‌ ఖాన్‌కు  థార్‌ బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నా. ఇది  తనకు గౌరవం  ఈ బహుమతిని ఆయన స్వీకరిస్తానని విశ్వసిస్తున్నా.. అంటూ ట్వీట్‌ చేశారు.

“Himmat nahin chodna, bas!”

Hard work. Courage. Patience.

What better qualities than those for a father to inspire in a child?

For being an inspirational parent, it would be my privilege & honour if Naushad Khan would accept the gift of a Thar. pic.twitter.com/fnWkoJD6Dp

— anand mahindra (@anandmahindra) February 16, 2024

జెర్సీ నంబర్ 97తో బరిలోకి సర్ఫరాజ్ ఖాన్  అరంగేట్రంలోనే ఇంగ్లండ్‌తో గురువారం రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో జరిగిన మూడో మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ చేసి తానేంటో నిరూపించుకున్నాడు.  కాగా దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు సర్ఫరాజ్ ఖాన్. భారత వెటరన్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అతడికి అరంగేట్రం క్యాప్ అందించిన సందర్భంలో సర్ఫరాజ్‌ ఖాన్‌ తండ్రి నౌషాద్ ఖాన్, సర్ఫరాజ్‌ భార్య భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించినవ వీడియో, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.  


జెర్సీ నంబర్ 97 
సర్ఫరాజ్ తండ్రి నౌషాద్ కూడా క్రికెటర్. తన కలను నెరవేర్చుకునే ఆశయంలో భాగంగా  కుమారుడికి శిక్షణ ఇచ్చాడు. ఇక 97 విషయానికి వస్తే మూడో టెస్టుకు ముందు మాట్లాడుతూ జెర్సీ నంబర్ 97 విశేషాలుతెలిపాడు. తండ్రి పేరులోని నౌ అంటే తొమ్మిది, షాద్ నుంచి 7 తీసుకున్నట్లు తెలిపాడు. అంతేకాదు ఇటీవల అండర్-19 ప్రపంచకప్‌లో  ఆడిన సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ జెర్సీ నంబర్ కూడా 97 కావడం  విశేషమే మరి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement