ఇండియన్ క్రికెట్‌లో అద్భుతమైన జంట అనగానే గుర్తొచ్చే స్వీట్ కపుల్ జస్ప్రీత్ బుమ్రా,సంజనా గణేశన్. క్రికెటర్‌గా బుమ్రా చెలరేగి ఆడి జట్టుకు విజయాన్ని అందిస్తే, డిజిటల్ ఇన్‌సైడర్‌గా మ్యాచ్ తర్వాత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాను ఇంటర్వ్యూ లతో ఆ విజయాన్ని మరింత సెలబ్రేటీ చేసే మీడియా పర్సన్ సంజనా గణేశన్.
తాజాగా చిన్ని సంతోషాలు అందమైన క్షణాలు అంటూ భర్త జస్ప్రీత్ బుమ్రాతో గడుపుతున్న ఫోటోలు, జూనియర్ బుమ్రా ఫోటోలను ఎక్స్‌లో షేర్ చేశారు సంజనా. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బ్యూటిఫుల్ పిక్స్, లవబుల్ ఫ్యామిలీ అంటూ కమెంట్స్ చేశారు. క్యూట్ అంగద్, లిటిల్ బూమ్ బూమ్ అంటూ ఈ చిన్నోడి ఫోటోలను చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
this little life 🩷 pic.twitter.com/8PXpKnrx2i
— Sanjana Ganesan (@iSanjanaGanesan) July 2, 2024
కాగా ఇటీవల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో మెన్‌ఇన్‌బ్లూ ఘన విజయం తర్వాత బుమ్రాను, సంజనా ఇంటర్వ్యూ చేయడం, తరువాత బుమ్రాను ఆమెను ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడంతోపాటు, అంగద్‌ను ముద్దాడిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment