Sanjana Ganesan
-
నవంబర్ ‘సన్’షైన్: కొడుకుతో బుమ్రా.. బుడ్డోడు డబ్బాలో పడిపోయాడా? (ఫొటోలు)
-
నా హృదయం ద్రవించిపోతోంది.. బుమ్రా భావోద్వేగం (ఫొటోలు)
-
మా లిటిల్ సూపర్ హీరో.. అప్పుడే ఏడాది నిండింది!! (ఫొటోలు)
-
సతీమణితో బుమ్రా.. రాజహంసలా సంజనా.. ఫొటోలు వైరల్
-
ఫ్యామిలీతో సంజనా గణేశన్..చిన్నోడు అదుర్స్ (ఫోటోలు)
-
లిటిల్ బూమ్ బూమ్..ఈ చిన్నోడిని గుర్తు పట్టారా? ఫోటోలు వైరల్
ఇండియన్ క్రికెట్లో అద్భుతమైన జంట అనగానే గుర్తొచ్చే స్వీట్ కపుల్ జస్ప్రీత్ బుమ్రా,సంజనా గణేశన్. క్రికెటర్‌గా బుమ్రా చెలరేగి ఆడి జట్టుకు విజయాన్ని అందిస్తే, డిజిటల్ ఇన్‌సైడర్‌గా మ్యాచ్ తర్వాత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాను ఇంటర్వ్యూ లతో ఆ విజయాన్ని మరింత సెలబ్రేటీ చేసే మీడియా పర్సన్ సంజనా గణేశన్.తాజాగా చిన్ని సంతోషాలు అందమైన క్షణాలు అంటూ భర్త జస్ప్రీత్ బుమ్రాతో గడుపుతున్న ఫోటోలు, జూనియర్ బుమ్రా ఫోటోలను ఎక్స్‌లో షేర్ చేశారు సంజనా. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బ్యూటిఫుల్ పిక్స్, లవబుల్ ఫ్యామిలీ అంటూ కమెంట్స్ చేశారు. క్యూట్ అంగద్, లిటిల్ బూమ్ బూమ్ అంటూ ఈ చిన్నోడి ఫోటోలను చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.this little life 🩷 pic.twitter.com/8PXpKnrx2i— Sanjana Ganesan (@iSanjanaGanesan) July 2, 2024కాగా ఇటీవల టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో మెన్ఇన్బ్లూ ఘన విజయం తర్వాత బుమ్రాను, సంజనా ఇంటర్వ్యూ చేయడం, తరువాత బుమ్రాను ఆమెను ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడంతోపాటు, అంగద్‌ను ముద్దాడిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by ICC (@icc) -
టీ20 వరల్డ్‌కప్-2024: భర్త క్రికెట్‌తో.. భార్య యాంకరింగ్‌తో బిజీ.. క్యూట్ కపుల్(ఫొటోలు)
-
తండ్రిని ఎంకరేజ్ చేసేందుకు వచ్చిన జూనియర్ బుమ్రా..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా నిన్న (మే 6) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు శతకంతో (51 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడి ముంబైని ఒంటిచేత్తో గెలిపించాడు. తొలుత ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సన్‌రైజర్స్ 173 పరుగుల నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఛేదనలో ముంబై సైతం ఆదిలో తడబడినప్పటికీ స్కై.. తిలక్ వర్మ (37 నాటౌట్) సహకారంతో ముంబైని విజయతీరాలకు చేర్చాడు. ఐపీఎల్లో స్కైకు ఇది రెండో సెంచరీ. Angad bumrah is here !!! So cute ,,#MIvSRH #bumrah #RohitSharma @Jaspritbumrah93 pic.twitter.com/EzxEdHwRPI— Randhir_45 (@Mr_Randhir_45) May 6, 2024ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు హార్దిక్ పాండ్యా (4-0-31-3), పియూశ్ చావ్లా (4-0-33-3) సైతం సత్తా చాటారు. నాలుగు వరుస పరాజయాల తర్వాత ఎట్టకేలకు ముంబైకు ఊరటనిచ్చే గెలుపు దక్కింది. ఈ గెలుపుతో ముంబై పాయింట్ల పట్టికలో పదో స్థానం నుంచి తొమ్మిదో ప్లేస్‌కు ఎగబాకింది. ఈ సీజన్లో ముంబై మరో రెండు మ్యాచ్‌లు (మే 11న కేకేఆర్‌తో, మే 17న లక్నోతో) ఆడాల్సి ఉన్నా ప్లే ఆఫ్స్‌కు చేరే పరిస్థితి లేదు. అలాగని టెక్నికల్‌గా ఇంకా ఔట్ కాలేదు. ఏదైనా మహాద్భుతం జరిగితే తప్ప ముంబై ఈ సీజన్ ప్లే ఆఫ్స్‌కు చేరలేదు.జూనియర్ బుమ్రా వచ్చాడు..ఇదిలా ఉంటే, నిన్న వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఓ చిట్టిపొట్టి అతిథి అందరి దృష్టిని ఆకర్శించాడు. అతడే బుమ్రా తనయుడు అంగద్ బుమ్రా. అంగద్.. తన తల్లి సంజనా గణేశన్‌తో కలిసి తన తండ్రి జస్ప్రీత్ బుమ్రాను ఎంకరేజ్ చేసేందుకు వాంఖడేకు వచ్చాడు. వీఐపీ స్టాండ్స్‌లో సంజనా.. అంగద్‌ను ఒడిలో కూర్చొబెట్టుకుని కెమెరా కంటికి చిక్కింది. ఈ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. అంగద్ తొలిసారి పబ్లిక్‌లోకి రావడంతో చిన్నారిని చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. అంగద్ ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించి ఉండటంతో ఆ ఫ్రాంచైజీ అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు. జూనియర్ బుమ్రా వచ్చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌లో యధావిధిగా అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో తన కోటా నాలుగు ఓవర్లు పూర్తి చేసిన బుమ్రా కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన అభిషేక్ శర్మ (11) వికెట్ పడగొట్టాడు. మొత్తానికి బుమ్రా కొడుకు అంగద్ నిన్నటి మ్యాచ్ సందర్భంగా చర్చనీయాంశంగా మారాడు. -
ఈ బ్యూటీని గుర్తుపట్టారా? టీమిండియా స్టార్ భార్య.. అంతేకాదండోయ్! (ఫొటోలు)
-
Bumrah: కెనడాకు వెళ్లి.. అక్కడి క్రికెట్ జట్టుకు ఆడాలనుకున్నా..
ప్రపంచంలో ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్న ఫాస్ట్ బౌలర్లలో టీమిండియా క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా ముందు వరుసలో ఉంటాడనడంలో సందేహం లేదు. టెస్టు, వన్డే, టీ20.. ఇలా ఫార్మాట్లకు అతీతంగా ఈ పేస్ గుర్రం సత్తా చాటుతున్నాడు. టెస్టుల్లో భారత జట్టు వైస్ కెప్టెన్‌గానూ సేవలు అందిస్తున్నాడు ఈ పేస్ దళ నాయకుడు. నిజానికి టీమిండియా తమ పేస్ బెంచ్‌ను పటిష్టం చేసుకునే సమయంలోనే బుమ్రా వెలుగులోకి వచ్చాడు. ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటి టీమిండియాలో అడుగుపెట్టి నంబర్ వన్‌గా ఎదిగాడు. వరల్డ్‌క్లాస్ ఫాస్ట్ బౌలర్‌గా నీరాజనాలు అందుకుంటూ ప్రస్తుతం స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్నాడు బుమ్రా. అయితే.. ఒకానొక సమయంలో బుమ్రా కెనడాకు వలస వెళ్లి అక్కడి క్రికెట్ టీమ్‌లో ఆడాలనుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. అవును.. కెనడాకు వలస వెళ్లాలి అనుకున్నా జియో సినిమా షోలో స్పోర్ట్స్ ప్రజెంటర్, తన సతీమణి సంజనా గణేషన్.. నువ్వు కెనడాకు వెళ్లి.. అక్కడే జీవించాలనుకున్నావా అని అడిగిన ప్రశ్నలకు బుమ్రా ఈ విధంగా సమాధానమిచ్చాడు. ‘‘అవును.. అలాంటి సంభాషణలు జరిగేవి. నాకు తెలిసి ప్రతి ఒక అబ్బాయికి క్రికెటర్ అవ్వాలన్న కోరిక ఉంటుంది. ఇండియాలో వీధి వీధికి సుమారుగా 25 మంది టీమిండియాకు ఆడాలనే కుర్రాళ్లు ఉంటారు. అదే సమయంలో మనకు బ్యాకప్ ప్లాన్ కూడా ఉండాలి కదా! మా బంధువుల్లో కొందరు కెనడాలో ఉన్నారు. నా విద్యాభ్యాసం పూర్తైన తర్వాత.. కుటుంబమంతా అక్కడికి వెళ్లిపోదాం అనుకున్నాం. అయితే, అక్కడి భిన్న సంస్కృతికి మేము అలవాటు పడలేమని భావించి.. మా అమ్మ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. అమ్మ వల్లే ఆట, అదృష్టం అమ్మ అలా చేయడం నాకు సంతోషాన్ని, అదృష్టాన్నీ ఇచ్చింది. ఇక్కడే నేను అనుకున్నవన్నీ వర్కౌట్ అయ్యాయి. లేదంటే బహుశా నేను కెనడా వెళ్లి అక్కడి క్రికెట్ జట్టుకు ఆడేందుకు ప్రయత్నించేవాడినేమో. ఇప్పుడు నేను టీమిండియాకు, ముంబై ఇండియన్స్‌కు ఆడుతుండటం సంతోషంగా ఉంది’’ అని జస్ప్రీత్ బుమ్రా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్న బుమ్రా.. ముంబై ఇండియన్స్ తరఫున ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి ఐదు వికెట్లు తీశాడు. ఇక 2016లో టీమిండియాలో అడుగుపెట్టిన ఈ గుజరాతీ బౌలర్ 36 టెస్టులు, 89 వన్డేలు, 62 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 159, 149, 74 వికెట్లు తీశాడు. కాగా స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనాను పెళ్లాడాడు బుమ్రా. ఇటీవలే వీరికి కుమారుడు అంగద్ జన్మించాడు. చదవండి: Hardik Pandya: రోహిత్‌కు వయసైపోతోంది.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్లు వాళ్లిద్దరే! -
Bumrah: వదినమ్మ అంటూనే వెకిలి కామెంట్.. పో.. ఇక్కడి నుంచి!
Jasprit Bumrah's Wife Sanjana Ganesan Fiery Reply: ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్, టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా సతీమణి సంజనా గణేషన్ ప్రస్తుతం మాతృత్వ మధురిమలను ఆస్వాదిస్తున్నారు. కెరీర్‌కు కాస్త విరామం ఇచ్చి తమ చిన్నారి కుమారుడు అంగద్ ఆలనాపాలనతో సంతోషంగా సమయం గడుపుతున్నారు. మరోవైపు.. బుమ్రా ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. తొలి రెండు టెస్టుల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన అతడు.. రాజ్‌కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి మొదలుకానున్న మూడో మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇక బుమ్రా- సంజనాలది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాలంటైన్స్ డే సందర్భంగా ఇద్దరూ కలిసి ఓ యాడ్‌లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బుమ్రా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. PC: Bumrah Insta Grab క్రికెట్ బాల్‌తో మొదలుపెట్టి.. ఫొటోషూట్ వరకు కపుల్ గోల్స్ సెట్ చేసే విషయంలో ఇలా ఉంటామంటూ బుమ్రా- సంజనా ఆహ్లాదంగా మాట్లాడుకుంటూ వీడియోలో కనిపించారు. అభిమానులను ఆకట్టుకుంటున్న వీడియోపై ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ మాత్రం వెకిలిగా కామెంట్ చేశాడు. ‘‘వదినమ్మ.. రోజు రోజుకీ లావైపోతోంది’’ అని బాడీషేమింగ్ చేశాడు. ఇందుకు.. సంజనా కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ‘‘పాఠశాలలో సైన్సు పుస్తకాల్లో చదివిన విషయాలు నీకు గుర్తులేవా? మహిళల శరీరంపై కామెంట్ చేయడానికి నీకెంత ధైర్యం? పో ఇక్కడి నుంచి..’’ అంటూ సంజనా గణేషన్ చురకలు అంటించారు. PC: Bumrah Insta Grab ఈ క్రమంలో అభిమానులు సంజనాకు అండగా నిలుస్తూ.. ‘‘బాగా బుద్ధి చెప్పారు భాభీ’’ అని ప్రశంసిస్తున్నారు. కాగా తల్లైన తర్వాత సాధారణంగా శరీరంలో వచ్చే మార్పుల కారణంగా సంజనా కూడా మునుపటి కంటే కాస్త బొద్దుగా కనిపించారు. దీంతో ఆకతాయి అలా కామెంట్ చేశాడు. అయితే, తానొక తల్లినన్న విషయాన్ని గుర్తుచేస్తూ ఆమె ఇలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సెలబ్రిటీలకూ తప్పని చేదు అనుభవాలు కొత్తగా తల్లైన వారు బిడ్డకు పాలిచ్చే క్రమంలో వచ్చే శరీర మార్పుల కారణంగా చుట్టూ ఉన్న వాళ్ల మాటల కారణంగా కొన్నిసార్లు ఆత్మన్యూనతకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అయితే, సహజ సిద్ధంగా జరిగే ఈ మార్పుల గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సంజనా కూడా అదే విషయాన్ని చెప్పారు. గతంలో.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సైతం కుమారుడు ఇజహాన్ పుట్టిన తర్వాత ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కొన్నారు. అయితే, ట్రోల్స్‌ను పట్టించుకోకుండా.. తన కోసం తాను సమయం కేటాయించుకుని ఫిట్నెస్ సాధించి మళ్లీ మునపటిలా మారిపోయారు. ఇదిలా ఉంటే.. 2021లో జస్ప్రీత్ బుమ్రా- సంజనా గణేషన్ వివాహం జరగగా.. గతేడాది సెప్టెంబరు 4న వీరికి కుమారుడు అంగద్ జస్ప్రీత్ బుమ్రా జన్మించాడు. -
నువ్వే నా ప్రపంచం.. నా సర్వస్వం: బుమ్రా భార్య భావోద్వేగ పోస్ట్
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా పుట్టినరోజు నేడు(డిసెంబరు 6). ఈ సందర్భంగా బుమ్రా సతీమణి, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ భావోద్వేగ పూరిత నోట్ షేర్ చేసింది. ‘‘నా ప్రపంచం నువ్వే’’ అంటూ భర్త పట్ల ప్రేమను చాటుకుంది. ‘‘మనిద్దరం కలిసి ఉన్నపుడు ప్రతీ సంతోష క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించగలం. అలాగే మనకి బాధ కలిగించే సంఘటనలు ఎదురైనపుడు మరీ అంత కుంగిపోము కూడా!ప్రతీ చిరునవ్వు, ప్రతీ కన్నీటి బందువు, ప్రతీ ఆనందం.. ఇలా అన్ని భావోద్వేగాల్లోనూ నేను నీతోనే ఉంటాను. నీతో జీవితం పంచుకోవడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. నా ప్రపంచానికి పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అని సంజనా... బుమ్రాకు విషెస్ తెలియజేసింది. ఈ సందర్భంగా భర్త జస్ప్రీత్, కుమారుడు అంగద్తో కలిసి ఉన్న ఫొటోలను సంజనా గణేషన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కాగా 1993, డిసెంబరు 6న అహ్మదాబాద్‌లో జన్మించాడు జస్ప్రీత్ బుమ్రా. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ స్టార్ పేసర్‌గా పేరొందిన ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.. 2016లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది టీ20లలోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత రెండేళ్లకు టెస్టుల్లోనూ బుమ్రా అరంగేట్రం చేశాడు. తన అద్భుత ఆట తీరుతో అంచెలంచెలుగా ఎదుగుతూ టీమిండియా ప్రధాన పేసర్‌గా స్థానం సుస్థిరం చేసుకున్న బుమ్రా గాయాల కారణంగా పలు కీలక టోర్నీలకు దూరమయ్యాడు. అయితే, ఎప్పటికప్పుడు ఫిట్నెస్ మెరుగుపరచుకుంటూ జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా రాణిస్తున్నాడు. ఇక తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు 181 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన జస్ప్రీత్ బుమ్రా 351 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన ముగ్గురు భారత బౌలర్లలో ఒకడిగా తన పేరును చరిత్రలో లిఖించుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌తో బుమ్రా మళ్లీ బిజీ కానున్నాడు. మరోవైపు.. సంజనా గణేషన్ స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా ఇప్పటికే పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. బుమ్రాను ప్రేమించిన ఆమె.. 2021, మార్చి 15న అతడితో వివాహ బంధంలో అడుగుపెట్టింది. ఇటీవలే ఈ దంపతులకు కుమారుడు అంగద్ బుమ్రా జన్మించాడు. View this post on Instagram A post shared by Sanjana Ganesan (@sanjanaganesan) -
బుమ్రా కచ్చితంగా బ్యాటర్ అవుతాడు! ఇప్పుడివన్నీ అవసరమా?
Jasprit Bumrah- Sanjana Ganesh Child: టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా- స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తల్లిదండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని చిన్నారి బుమ్రా కూడా క్రీడాకారుడు కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కాగా బుమ్రా సతీమణి సంజనా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాము తల్లిదండ్రులు అయిన విషయాన్ని వీరు సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కుమారుడికి అంగద్ జస్ప్రీత్ బుమ్రాగా నామకరణం చేసినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సహచర క్రికెటర్లు సహా అభిమానులు బుమ్రా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి పేర్లను ట్రెండ్ చేస్తున్నారు. అంగద్ బ్యాటర్ అవుతాడేమో? ఈ అందమైన ప్రపంచంలోకి అంగద్‌కు స్వాగతం అంటూ వెల్కమ్ చెబుతూ బెస్ట్ విషెస్ అందజేస్తున్నారు. ఇక మరికొంత మందైతే.. ఓ అడుగు ముందుకేసి చిన్నారి భవిష్యత్ గురించి జోస్యం చెబుతూ.. ‘‘అంగద్ తండ్రిలా బౌలర్ కాకుండా.. బ్యాటర్ అవుతాడు’’ అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఇప్పుడే పుట్టిన ఫ్యూచర్‌పై ఇలాంటి కామెంట్లు అవసరమా అని మరికొందరు విమర్శిస్తున్నారు. కొడుకును చూసుకునేందుకు స్వదేశానికి కాగా బుమ్రా ప్రస్తుతం ఆసియా కప్-2023 టోర్నీతో బిజీగా ఉన్నాడు. దాదాపు ఏడాది విరామం తర్వాత గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఐర్లాండ్ పర్యటనలో కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చిన ఈ స్పీడ్‌స్టర్.. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ కోసం శ్రీలంకకు వెళ్లాడు. అయితే, భార్య ప్రసవం నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వచ్చిన బుమ్రా.. మళ్లీ సూపర్-4 మ్యాచ్‌ల కోసం అక్కడికి వెళ్లనున్నాడు. దీంతో నేపాల్‌తో సోమవారం నాటి మ్యాచ్‌కు అతడు దూరమయ్యాడు. కాగా 29 ఏళ్ల బుమ్రా 2021లో సంజనా గణేశన్‌ను వివాహమాడాడు. చదవండి: WC 2023: తిలక్ వర్మను ఎందుకు ఎంపిక చేసినట్లు? అతడు అవసరమా? Indian Star Pacer Jasprit Bumrah And His Wife Sanjana Ganesan has been blessed by Baby boy. They named him as "Angad". I guess Next bumrah is a batter for sure!😉 Congratulations @Jaspritbumrah93 ❤️ pic.twitter.com/uDwQ0zdZVr — ᴘʀᴀᴛʜᴍᴇsʜ⁴⁵ (@45Fan_Prathmesh) September 4, 2023 Angad Jasprit Bumrah cheering for his father in future matches pic.twitter.com/RYmgQPmuUe — ✰ (@insane_birdie) September 4, 2023 View this post on Instagram A post shared by jasprit bumrah (@jaspritb1) -
ప్రౌడ్ ఫాదర్ జస్ప్రీత్ బుమ్రా నెట్‌వర్త్, లగ్జరీ కార్లు, ఈ వివరాలు తెలుసా?
స్కిల్డ్ పేసర్‌గా పాపులర్ అయిన భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రి అయిన ఆనందంలో మునిగి తేలుతున్నాడు. బుమ్రా భార్య సంజనా గణేశన్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న బుమ్రా అంగద్ జస్ప్రీత్ బుమ్రా అంటూ తన బుజ్జాయి పేరును కూడా ప్రకటించేశాడు. దీంతో బుమ్రా-సంజన దంపతులకు అభినందనల వెల్లువ కురుస్తోంది. ఫ్యాన్స్ కూడా తెగ సంతోష పడిపోతున్నారు. ఈ క్రమంలో బుమ్రా నెట్‌వర్త్, కార్లు తదితర ఆస్తులపై ఆసక్తి నెలకొంది. అరంగేట్రంలోనే అందరి దృష్టినీ ఆకర్షించి, క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో జట్టులో కీలక క్రికెటర్‌గా ఎదిగిన వాడు బుమ్రా. తనదైన స్పెషల్ బౌలింగ్ యాక్షన్ , యార్కర్లతో నిలకడైన బౌలింగ్ సామర్థ్యంతో పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బుమ్రా తరువాతే ఎవరైనా. ఇప్పటివరకు తన చిన్న కెరీర్లో, బుమ్రా 2019లో ICC ODI ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. బుమ్రా 2013 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతూ జట్టుకు కీలక టైటిళ్లను అందించిన ఘనత కూడా సొంతం చేసుకున్నాడు. మరి ఇంత పాపులర్ అయిన బుమ్రా సంపాదన, ఇతర వివరాలను పరిశీలిస్తే.. వివిధ మీడియా నివేదికల ప్రకారం 2023 మార్చి నాటికి జస్ప్రీత్ బుమ్రా నికర విలువ రూ. 55 కోట్లు(7 మిలియన్ డాలర్లు)గా అంచనా. అలాగే కాంట్రాక్టు ఆటగాళ్లకు బీసీసీఐ చెల్లింపు విధానం ప్రకారం బుమ్రా వార్షిక వేతనం రూ.7 కోట్లు. దీనికి తోడు భారత జట్టు కోసం ఆడే ప్రతి టెస్ట్, ODI, T20I మ్యాచ్‌లకు అందే రెమ్యునరేషన్ వరుసగా రూ. 15 లక్షలు, రూ. 6 లక్షలు , రూ. 3 లక్షలు. View this post on Instagram A post shared by Sanjana Ganesan (@sanjanaganesan) బ్రాండ్లు భారత క్రికెట్ జట్టు గ్రౌండ్లో స్టార్ క్రికెటర్‌గానే కాదు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టీమ్ కాంట్రాక్టులు,బ్రాండ్ ఎండార్స్మెంట్లు ద్వారా కూడా బుమ్రా సంపాదన పెరుగుతూనే ఉంది. బుమ్రా డ్రీమ్11, ఆసిక్స్, వన్‌ప్లస్ వేరబుల్స్, జాగల్, బోట్, సీగ్రామ్ రాయల్ స్టాగ్, కల్ట్స్పోర్ట్, ఎస్ట్రోలో, యునిక్స్ భారత్ పే వంటి అనేక ప్రసిద్ధ బ్రాండ్లు అతని చేతిలో ఉన్నాయి. ప్రముఖ క్రికెట్ యాంకర్ సంజనా గణేశన్‌తో పెళ్లి తరువాత బుమ్రా పూణేలోని అనేక ఆస్తులతో పాటు, ముంబైలో సుమారు రూ. 2 కోట్ల విలువైన లగ్జరీ ఇల్లును సొంతం చేసుకున్నాడు. 2015లో అహ్మదాబాద్‌లో విలాసవంతమైన డిజైనర్ ఇంటిని కొనుగోలు చేశాడు.దీని విలువ ప్రస్తుతం రూ. 3 కోట్లు. ఈ ఆస్తులతో పాటు దేశ వ్యాప్తంగా పలు రియల్ ఎస్టేట్ ఆస్తులను కూడా కలిగి ఉన్నాడు. లగ్జరీ కార్లు: బుమ్రా గ్యారేజీలో రూ. 2.54 కోట్ల విలువైన మెర్సిడెస్-మేబ్యాక్ S560, రూ. 2.17 కోట్ల విలువైన నిస్సాన్ GT-R, రూ. 90 లక్షల విలువైన రేంజ్ రోవర్ వెలార్ , టయోటా ఇన్నోవా క్రిస్టా ఉన్నాయి. వీటి విలువ రూ.25 లక్షలు. కాగా బుమ్రా డిసెంబర్ 6, 1993న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించాడు. తన సొంత రాష్ట్రం గుజరాత్ కోసం ఆడుతున్న క్రమంలో ముంబై ఇండియన్స్ ద్వారా ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. 2013లో, జస్ప్రీత్ తన తొలి ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కేవలం 32 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియాలో జస్ప్రీత్ బుమ్రా జనవరి 2016లో, జస్ప్రీత్ ఆస్ట్రేలియాపై అంతర్జాతీయ T20 అరంగేట్రం చేసాడు. ఇప్పటివరకు తన కెరీర్లో, బుమ్రా 2019లో ICC ODI ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెల్చుకున్నాడు. View this post on Instagram A post shared by jasprit bumrah (@jaspritb1) ఆసియా కప్ కోసం శ్రీలంకలో ఉన్న జస్ ప్రీత్ బుమ్రా ఇండియాకు తిరిగి రావడంతో ఫ్యాన్స్‌ను గందరగోళంలో పడేసిన సంగతి తెలిసిందే. ఆసియా కప్ 2023 (Asia Cup 2023)లో భాగంగా భారత్, పాకిస్తాన్ (IND vs PAK మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా నేపాల్‌తో జరగనున్న మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే, సూపర్-4కు అర్హత సాధిస్తుంది. ఆ భారత్ సూపర్-4కు క్వాలిఫై అయిన తరువాత పాకిస్తాన్‌తో సెప్టెంబర్ 10న తదుపరి మ్యాచ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం తండ్రిగా ప్రమోట్ అయిన ఆనందంలో ఉన్న బ్రుమా సూపర్-4 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
తండ్రైన జస్ప్రీత్ బుమ్రా..
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రియ్యాడు. అతడి భార్య సంజనా గణేశన్ పండింటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్ సోషల్ మీడియా వేదికగా బుమ్రా అభిమానులతో పంచుకున్నాడు. తమ కుమారుడికి అంగద్ జస్ప్రీత్ బుమ్రాగా పేరు పెట్టినట్టుగా కూడా వెల్లడించాడు. "మా చిన్న కుటుంబం ఇప్పుడు పెరిగింది. ఈ ఉదయం మేము మా లిటిల్ బాయ్ అంగద్ జస్ప్రీత్ బుమ్రాను ప్రపంచంలోకి స్వాగతించాము. ఈ సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నాము. జీవితంలోని ఈ కొత్త అధ్యాయన్ని ప్రారంభిచేందుకు సిద్దంగా ఉన్నాము" అంటూ జస్ప్రీత్ బుమ్రా- సంజన పేరుతో సందేశాన్ని ఎక్స్‌లో(ట్విటర్) పోస్టు చేశారు. Our little family has grown & our hearts are fuller than we could ever imagine! This morning we welcomed our little boy, Angad Jasprit Bumrah into the world. We are over the moon and can’t wait for everything this new chapter of our lives brings with it ❤️ - Jasprit and Sanjana pic.twitter.com/j3RFOSpB8Q — Jasprit Bumrah (@Jaspritbumrah93) September 4, 2023 దీంతో పలువురు బుమ్రా-సంజన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఆసియాకప్ కోసం శ్రీలంకలో ఉన్న బుమ్రా.. భార్య డెలివరీ కోసం ఉన్నపళంగా స్వదేశానికి వచ్చేశాడు. దీంతో అతడు నేపాల్‌తో జరగనున్న గ్రూపు స్టేజి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడు తిరిగి మళ్లీ సూపర్-4 మ్యాచ్‌లకు భారత జట్టుతో కలవనున్నాడు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్తాన్ స్టార్ క్రికెటర్.. -
ఉన్నపళంగా స్వదేశానికి బుమ్రా.. కారణమిదేనా?
ఆసియాకప్-2023లో భాగంగా సోమవారం నేపాల్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బతగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నేపాల్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఉన్నపళంగా అతడు శ్రీలంక నుంచి స్వదేశానికి పయనమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో బుమ్రా ముంబైకు వచ్చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కారణమిదేనా? కాగా బుమ్రా భార్య సంజనా గణేశన్ త్వరలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ సమయంలో భార్య పక్కనే ఉండాలని బుమ్రా నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో ఉన్నపళంగా బుమ్రా లంక నుంచి స్వదేశానికి వచ్చేసినట్లు పలురిపోర్టులు పేర్కొంటున్నాయి. నేపాల్‌తో జరగనున్న మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే.. సూపర్-4కు అర్హత సాధిస్తోంది. భారత్ సూపర్-4కు క్వాలిఫై అయితే సెప్టెంబర్ 10న తమ తదుపరి మ్యాచ్ పాకిస్తాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ సమయానికి బుమ్రా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఐర్లాండ్‌పై రీ ఎంట్రీ.. గాయం కారణంగా దాదాపు ఏడాది తర్వాత బుమ్రా ఐర్లాండ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. పునరాగమనంతోనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన బుమ్రా అదరగొట్టాడు. నాయుకుడిగానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. అదే విధంగా పాకిస్తాన్‌తో రద్దైన మ్యాచ్‌లో కూడా 16 పరుగులతో బుమ్రా రాణించాడు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్తాన్ స్టార్ క్రికెటర్.. -
IPL 2023 : టాప్-10 మోస్ట్ బ్యూటీఫుల్ క్రికెట్ యాంకర్స్ (ఫొటోలు)
-
Ind Vs Eng: బుమ్రా విశ్వరూపం.. ఇంగ్లండ్ బ్యాటర్లను దారుణంగా ట్రోల్ చేసిన సంజనా!
India tour of England, 2022 - Ind Vs Eng 1st ODI: టీమిండియాతో మొదటి వన్డేలో భాగంగా ఇంగ్లండ్ బ్యాటర్లు జేసన్ రాయ్... జో రూట్.. లియామ్ లివింగ్‌స్టోన్.. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగారు. ఇక జానీ బెయిర్‌స్టో, విల్లే, బ్రైడన్ కార్స్ సైతం బుమ్రాకు వికెట్లు సమర్పించుకున్నారు. ఇలా మొత్తంగా 7.2 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు కూల్చిన ఈ పేస్‌గుర్రం టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అదే విధంగా తన కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసి వన్డేల్లో ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్‌గా నిలిచాడు. దీంతో పాటు పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు ఈ స్పీడ్‌స్టర్. 𝘽𝙤𝙤𝙢 𝘽𝙤𝙤𝙢 posed a lot of questions, but the English batters didn't have answers 🔥 Relive @Jaspritbumrah93's epic spell as he became the first 🇮🇳 pace bowler to pick up 6️⃣ wickets in an ODI in England 🤩#ENGIND #SonySportsNetwork #SirfSonyPeDikhega pic.twitter.com/hmCxlSL0ac — Sony Sports Network (@SonySportsNetwk) July 13, 2022 ఈ నేపథ్యంలో అభిమానులతో పాటు బుమ్రా సతీమణి, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ సైతం ఆనందడోలికల్లో తేలిపోతున్నారు. భర్తతో కలిసి లండన్‌లో ఉన్న ఆమె ప్రజెంటర్‌గా తన విధులు నిర్వర్తిస్తూనే భార్యగా బుమ్రా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ బ్యాటర్లను ట్రోల్ చేస్తూ తనదైన శైలిలో చమత్కరించారు సంజనా. ఓ ఫుడ్ ఏరియాకు వెళ్లిన ఆమె.. ‘‘ఇక్కడ ఇది బిజీ ఏరియా. నిజానికి ఇక్కడ ఇంగ్లండ్ అభిమానులే ఎక్కువగా దర్శనమిస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు మ్యాచ్ చూడటం బహుశా ఇష్టం లేదనుకుంటా! ఇక్కడ హాట్ డాగ్స్.. ఇంకా ఇతరత్రా ఆహార పదార్థాలు ఉన్నాయి. మేమైతే ఇక్కడి స్టాల్స్‌ను సందర్శిస్తున్నాం. కానీ చాలా మంది ఇంగ్లండ్ బ్యాటర్లు ఇక్కడికి రావడానికి ఇష్టపడటం లేదు. దీనిని క్రిస్పీ డక్ అంటారు. మైదానం వెలుపల డక్స్ ఎలా ఉంటాయో చూడబోతున్నాం. ఎలాగూ మైదానంలో డక్స్ అద్భుతంగా ఉంటాయి కదా’’ అని వ్యాఖ్యానించారు. సంజన మాటలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ 2022 వన్డే సిరీస్- మొదటి మ్యాచ్: ►వేదిక: ది ఓవల్, లండన్ ►టాస్: ఇండియా- బౌలింగ్ ►ఇంగ్లండ్ స్కోరు: 110 (25.2) ►ఇండియా స్కోరు: 114/0 (18.4) ►విజేత: ఇండియా- 10 వికెట్ల తేడాతో గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జస్ప్రీత్ బుమ్రా(7.2 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు) Sanjana trolling England and how 🤣 #engvind pic.twitter.com/GPSy4URBv2 — Mon (@4sacinom) July 12, 2022 -
IND Vs ENG: ఇంగ్లండ్‌తో పోరుకు టీమిండియా సై! ప్రాక్టీసు వీడియో!
ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టు నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీసు మొదలుపెట్టారు. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా శుక్రవారం(జూలై 1) నుంచి ఆరంభం కానున్న మ్యాచ్ కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకు సంబంధించిన స్నీక్ పీక్ వీడియోను సిరీస్ అధికారిక ప్రసార నెట్వర్క్ సోనీ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘చారిత్రాత్మక టెస్టు ఆడే క్రమంలో టీమిండియా ఎంతగానో శ్రమిస్తోంది’’ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ జత చేసింది. కాగా వీడియోలో విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, బుమ్రా తదితరులు కనిపించారు. కొంతమంది క్యాచెస్ ప్రాక్టీసు చేస్తుండగా.. మరికొంత మంది నెట్స్‌లో బ్యాటింగ్ చేశారు. ఇక రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు కోవిడ్ సోకిన నేపథ్యంలో అతడు అందుబాటులోకి రానట్లయితే.. జస్ప్రీత్ బుమ్రా టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. మరోవైపు ఇప్పటికే రోహిత్ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ మయాంక్ అగర్వాల్‌ను బీసీసీఐ ఇంగ్లండ్‌కు పంపింది. కాగా సోనీ షేర్ చేసిన వీడియోలో స్పోర్ట్స్ ప్రజెంటర్, బుమ్రా సతీమణి సంజనా గణేషన్ టీమిండియా గురించి మాట్లాడారు. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు భర్త కెప్టెన్.. భార్య ప్రజెంటర్.. అదిరిందయ్యా బుమ్రా అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Eoin Morgan: కొత్త అవతారమెత్తబోతున్న మోర్గాన్.. ఇండియాతో సిరీస్ నుంచి..? -
స్పోర్ట్స్ ప్రజెంటర్, బుమ్రా వైఫ్ సంజనా గణేషన్ అదిరే లుక్స్
-
దిగ్గజ క్రికెటర్ టీ20 జట్టు టాప్-5లో ఉన్నది వీళ్లే!
Mahela Jayawardene First 5 Players Of His T20 XI: తన టీ20 జట్టులోని ఐదుగురు ఆటగాళ్ల పేర్లను శ్రీలంక దిగ్గజ క్రికెటర్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ మహేళ జయవర్దనే ప్రకటించాడు. ఇందులో అఫ్గనిస్తాన్ నుంచి ఒకరు, పాకిస్తాన్ నుంచి ఇద్దరు, భారత్ నుంచి, ఇంగ్లండ్ నుంచి ఒకరికి అవకాశం ఇచ్చాడు. వారిని టాప్-5గా ఎంచుకోవడానికి గల కారణాలను కూడా వెల్లడించాడు. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్‌తో వర్చువల్‌గా మాట్లాడిన జయవర్దనే ఈ మేరకు తన జట్టులోని టాప్-5ని వెల్లడించాడు. ఇంతకీ ఆ ఐదుగురు క్రికెటర్లు ఎవరంటే.. రషీద్ ఖాన్, షాహిన్ ఆఫ్రిది, జస్ప్రీత్ బుమ్రా, జోస్ బట్లర్, మహ్మద్ రిజ్వాన్. ది ఐసీసీ రివ్యూలో భాగంగా ఈ ముంబై ఇండియన్స్ కోచ్ మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం... టీ20 క్రికెట్లో బౌలర్లదే కీలక పాత్ర పాత్ర. రషీద్ ఖాన్ విషయానికొస్తే అతడు మంచి స్పిన్నర్. అదే విధంగా బ్యాటింగ్ కూడా చేయగలడు. అతడు ఏడు లేదంటే ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. నా జట్టులో అతడు అగ్రస్థానంలో ఉంటాడు’’ అని చెప్పుకొచ్చాడు. అదే విధంగా ఐపీఎల్-2022లో ప్రస్తుతం అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్న రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ గురించి చెబుతూ.. ‘‘జోస్‌తో ఓపెనింగ్ చేయడం ఇష్టం. తను దూకుడైన బ్యాటర్. పేస్, స్పిన్ బాగా ఆడగలడు. గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా యూఏఈలో కఠిన పరిస్థితులకు ఎదురొడ్డి.. అద్భుతంగా రాణించాడు’ అని ఈ ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్‌పై జయవర్దనే ప్రశంసలు కురిపించాడు. ఇక జస్ప్రీత్ బుమ్రాను ప్రపంచంలోనే అత్యుత్తమ పేసర్‌గా జయవర్దనే అభివర్ణించాడు. అందుకే అతడిని తన జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా సంజనాను ఉద్దేశించి.. ‘‘నువ్వు సిగ్గు పడొద్దు సంజనా.. ఎందుకంటే నేను చెప్పబోయేది నీ భర్త పేరే’’ అని జయవర్దనే పేర్కొనడం విశేషం. ఇక బుమ్రాతో పాటు పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ షాహిన్ ఆఫ్రిది, మిడిలార్డర్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌కు అతడు చోటిచ్చాడు. చదవండి👉🏾IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్.. కీలక ఆటగాడు దూరం..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: అందాల యాంకర్ రీ ఎంట్రీ.. టాప్-5లో ఉన్నది వీళ్లే!
ఐపీఎల్లో భారీ హిట్టర్లు, స్టార్ బౌలర్లు, సిక్సర్ల వీరులకు వీరాభిమానులు ఉన్నట్లే యాంకర్లకు సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటారు ప్రజెంటర్ మయాంతి లాంగర్. అందంతో పాటు అపారమైన ప్రతిభ కలిగిన యాంకర్‌గా ఆమె మంచి పేరు సంపాదించుకున్నారు. కాగా టీమిండియా క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ సతీమణి అయిన మయాంతి 2020లో మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె కొంతకాలం పాటు ఐపీఎల్ వంటి మెగా ఈవెంట్లకు దూరమయ్యారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఐపీఎల్-2022 సీజన్‌తో రీ ఎంట్రీ ఇచ్చేందుకు మయాంతి సిద్ధమవుతున్నారట. మరోసారి యాంకర్ అవతారంలో మెరిసేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వార్తలపై స్పందించిన అభిమానులు మయాంతిని మిస్సవుతున్నామని, ఆమె రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by mayantilangerbinny (@mayantilanger_b) ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. మయాంతితో పాటు ఐపీఎల్లో తళుక్కుమంటున్న అందాల యాంకర్లు ఎవరో చూద్దామా! సంజనా గణేషన్ ప్రస్తుతం భారత్‌లో టాప్ స్పోర్ట్స్ యాంకర్లలో ఒకరిగా ఉన్నారు సంజనా. మయాంతి గైర్హాజరీలో ఎన్నో ఈవెంట్లకు ఆమె హోస్ట్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్ టోర్నీతో బిజీగా ఉన్నారు. ఈ మెగా ఈవెంట్ తర్వాత ఆమె ఐపీఎల్లో ఎంట్రీ ఇవ్వనున్నారు. కాగా సంజనా గతేడాది.. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. తాన్యా పురోహిత్ ఉత్తరాఖండ్‌కు చెందిన తాన్యా పురోహిత్ గర్వాల్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ సినిమా ఎన్‌హెచ్-10తో వెలుగులోకి వచ్చిన తాన్యా... క్రికెట్ షోలకు యాంకర్‌గా వ్యవహరించే అవకాశం దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ ప్రజెంటర్‌గా ఆమె గుర్తింపు పొందారు. నెరోలీ మెడోస్ ఆస్ట్రేలియన్ జర్నలిస్టు అయిన నెరోలీ క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్ టోర్నీలకు కూడా యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. 2021లో ఐపీఎల్లో తన యాంకరింగ్‌తో అభిమానులను ఫిదా చేశారు. నశ్ప్రీత్ కౌర్ మెల్బోర్న్లో పుట్టి పెరిగిన భారత సంతతి యువతి నశ్ప్రీత్ కౌర్. క్రికెట్ షోలకు యాంకరింగ్ చేస్తూ గుర్తింపు పొందారు. ఐపీఎల్ -2022 సీజన్‌తో ఆమె పాపులారిటీ సంపాదించారు. చదవండి: IPL 2022: గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరితే టీ20 ప్రపంచకప్ జట్టులో నేనూ ఉంటా: టీమిండియా ప్లేయర్ View this post on Instagram A post shared by mayantilangerbinny (@mayantilanger_b) -
ఐ లవ్ యూ సంజన.. నువ్వుంటే సంతోషం: బుమ్రా భావోద్వేగం
Jasprit Bumrah Emotional Note: ‘‘మనిద్దరం కలిసి ఉంటే జీవితం నిండుగా అనిపిస్తుంది. నా వెంట నువ్వుంటే సంతోషం. నన్ను శాంత స్వభావుడిగా, మరింత దయాహృదయుడిగా, హాస్య చతురత గల వ్యక్తిగా మార్చేశావు. మనిద్దరం కలిసి మన జీవితాలను అర్థవంతంగా మార్చుకున్నాం. ఈ ప్రయాణంలో ఏడాది కాలం అనేది చాలా చిన్న వ్యవధి. ఏ చిన్న విరామం దొరికినా నేను నీ సమక్షంలోనే గడపాలని కోరుకుంటాను’’ అని టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన భార్య సంజనా గణేషన్‌ను ఉద్దేశించి భావోద్వేగ పోస్టు చేశాడు. తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సతీమణికి విషెస్ తెలియజేశాడు. ఐ లవ్ యూ అంటూ ఆమెపై ప్రేమను కురిపించాడు. ఈ సందర్భంగా తమ పెళ్లినాటి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది వైరల్ అవుతోంది. కాగా కొంతకాలం ప్రేమలో మునిగితేలిన బుమ్రా- స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ గతేడాది మార్చి 15న గోవాలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో సత్తా చాటిన బుమ్రా... జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్-2022 నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తరఫున అతడు బరిలోకి దిగనున్నాడు. మరోవైపు.. సంజన తన కెరీర్లో బిజీగా ఉన్నారు. ఏమాత్రం సమయం చిక్కినా ఇద్దరూ కలిసి ఒక్కచోట చేరి సమయాన్ని ఆస్వాదిస్తారీ జంట. చదవండి: Rohit Sharma: అతడి ఆట తీరు ఎలా ఉన్నా స్వీకరిస్తాం.. అయితే, అనవసర షాట్లు వద్దని చెప్పాం: రోహిత్ శర్మ View this post on Instagram A post shared by Vishal Punjabi (@theweddingfilmer) View this post on Instagram A post shared by jasprit bumrah (@jaspritb1) -
భారీ సిక్స్ బాదిన బుమ్రా.. క్లాప్స్ కొట్టిన సంజనా.. వీడియో వైరల్!
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 202 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. టీమిండియా బ్యాటర్లలో కేఎల్ రాహుల్(48), అశ్విన్(46) పరుగులతో రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా భారత్ సాధించగలిగింది. సఫారీ బౌలర్లలో జన్సెన్ 4, ఒలీవియర్, రబాడ తలో 3 వికెట్లు పడగొట్టారు. అయితే ఇన్నింగ్స్ 62వ ఓవర్ వేసిన రబడా బౌలింగ్‌లో భారత ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా భారీ సిక్స్ బాది అందరనీ ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న అతడి భార్య సంజనా గణేషన్ నవ్వుతూ చప్పట్లు కొట్టి అభినందించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Ranji Trophy: బెంగాల్ రంజీ జట్టులో రాష్ట్ర మంత్రి.. కెప్టెన్‌గా అభిమన్యు pic.twitter.com/asM1QNUMtH — Lodu_Lalit (@LoduLal02410635) January 3, 2022 -
స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్ ఫొటోలు